september 17th
-
కిషన్‌రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండకూదు అంటూ కేటీఆర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt That's why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS — KTR (@KTRTRS) September 17, 2022 ఇదిలా ఉంటే.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణను మలినం చేసే కుట్ర జరుగుతోంది -
Telangana: విలీనం.. విమోచనం.. సమైక్యత!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి. నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. నిజాం అరాచకాల నుంచి సర్దార్ వల్లభాయ్‌పటేల్ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది. విలీనం, విమోచనం కాకుండా టీఆర్ఎస్ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. వామపక్షాలు దీన్ని విలీనంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు. వామ పక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
రేవంత్‌కు మరో షాక్.. టీపీసీసీ చీఫ్ నిర్ణయానికి చెక్‌పెట్టిన సీనియర్లు!
TPCC Chief Revanth Reddy.. తెలంగాణలో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డుచెబుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంలో సైతం రేవంత్‌కు సీనియర్లు షాకిచ్చారు. దీంతో, రేవంత్ చేసేదేమీ లేక వెనక్కి తగ్గారు. ఏం జరిగిందే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కి సీనియర్లు మళ్లీ చెక్ పెట్టారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, కొత్తజెండాపై సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కాగా, ఈ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో విస్తృతస్థాయి సమావేశాలో ఆమోదం పొందినప్పటికీ కొంత మంది సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో, సీనియర్లను గౌరవిస్తూ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై సస్పెన్స్ నెలకొంది. కాగా, సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం, పార్టీ జెండాను రూపొందించారు. దీంతో, ఆయన నిర్ణయాన్ని సీనియర్లు వ్యతిరేకించారు. రేవంత్.. కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా చూస్తున్నారని గుస్సా అయ్యారు. తమకు చెప్పకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ సీనియర్లు విగ్రహం విషయంలో వ్యతిరేకత తెలపడంతో విగ్రహం ఆవిష్కరణ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో, సెప్టెంబర్ 17న గాంధీభవన్‌లో కేవలం జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయనున్నట్టు సమాచారం. -
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
‘తెలంగాణ చరిత్ర గొప్పది.. సెప్టెంబర్ 17 గురించి నేటి తరానికి తెలియాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కాగా, గ్రౌండ్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం విచ్చేయనున్నారు. మరోవైపు.. టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: 16న హైదరాబాద్‌కు అమిత్‌షా -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
అది బీజేపీ అంటే.. కేసీఆర్‌కు చెమటలు పడుతున్నాయి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం జరపాలని సూచించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎంపై ఫైరయ్యారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న విమోచన దినం ఇన్ని రోజులు ఎందుకు జరుపలేదు. మేము ఎన్నో ఏళ్లుగా విమోచన దినోత్సవం కోసం పోరాడుతున్నాము. కేంద్రం అధికారికంగా విమోచన దినం జరుపుతామన్నాకే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఉద్యమ సమయంలో విమోచన దినం జరపాలని కేసీఆర్ ఎందుకు అన్నారు. ఇప్పుడెందుకు సమైక్యత రాగం ఎత్తుకున్నారు. ఒవైసీ కుటుంబం నుంచి వచ్చిన ఆదేశాలనే కేసీఆర్ పాటిస్తున్నారు. దారుస్సలాం ఆదేశాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపాల్సిందే. అసద్దుదీన్ ఒవైసీ చేతిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కీలుబొమ్మలు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామన్నాకే ఇప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అని కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. అంతుమందు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా వజ్రోత్సవాల వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఇక, ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 17పై ఫుల్ సస్పెన్స్.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు -
అమిత్ షాకు లేఖ రాసిన ఒవైసీ.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. లేఖల్లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. కాబట్టి సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలి. 17వ తేదీన పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: పాలిటిక్స్‌లో ట్విస్టులు.. బీజేపీ బిగ్ ప్లాన్! -
పొలిటికల్ గేమ్‌లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాగా, తెలంగాణలో అధికారం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి అమిత్ షా.. తెలంగాణకు రానున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినం సందర్భంగా అమిత్ షా తెలంగాణకు వస్తున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా, విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఏడాదిపాటు విమోచన దినోత్సవ అమృతోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. దీంతో అధికార టీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు. భారతదేశంలో విలీన దినోత్సవంగా నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోంది. కాగా, తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్‌ను పెంచింది. తరుణ్‌చుగ్ తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కోర్ కమిటీలతో తరుణ్‌చుగ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజాసమస్యల పోరాటాలు, ర్యాలీపై సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు ప్రధాని వ్యాఖ్యలను దిగజారుస్తున్నారు -
నిరంకుశత్వం తలవంచిన వేళ
సాక్షి, కరీంనగర్ : కరడుగట్టిన నిజాం, వీర తెలంగాణ దిశను, దశను మార్చేందుకు సంకల్పించిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన రోజు. వందల ఏళ్ల బానిసత్వపు సంకెళ్లనుంచి బాంచన్ కాల్మొక్త బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు. దక్కన్ పీఠభూమిలోని ప్రజలందరూ సంబరాలు జరుపుకున్న రోజు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం దశాబ్దాలుగా సాగించిన పోరాటానికి ఫలితం లభించిన రోజు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్ సంస్థానం కలిసిపోయిన రోజు. అదే సెప్టెంబర్ 17. నాటి తెలంగాణ భౌగోళిక స్వరూపం దేశంలోని అన్ని సంస్థానాల్లో కెల్లా హైదరాబాద్ ఎస్టేట్ పెద్దది. తెలుగు మాట్లాడే ప్రజలు సుమారు 90 లక్షలతో ఎనిమిది జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాల్లో 45లక్షల జనాభా, కర్నాటకలోని మూడు జిల్లాల్లో 20లక్షల జనాభాతో కలిపి 8 జిల్లాలు. కోటి 70 లక్షల జనాభా. 83 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించింది. భూమి స్వరూపం.. సంస్థానంలో 60శాతం ప్రాంతాన్ని ఖాల్సా (నేరుగా నిజాం ఆధీనంలో ఉండేది. సారవంతమైన భూములన్నింటిని స్వంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు. 30 శాతం గైర్ ఖాల్సా, దీన్ని జాగీర్లు, మఖ్తాలు, బంజరుదార్లు, ఈనాందార్లు, అగ్రహారాల పేర్లు పెట్టి దోపిడీ ప్రభువులకు అప్పగించారు. 10 శాతం సర్ఫేఖాస్ ప్రాంతం. ఇది పూర్తిగా నిజాం ప్రభువు జాగీర్. ఇపుడున్న హైదరాబాద్ (అత్రఫ్ అల్దా) మొత్తం నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించింది. అప్పట్లోనే ఏటా రెండు కోట్లు ఆదాయం లభించేది. దీనికి తోడు ఖజానా నుంచి మరో 70 లక్షలు ఇస్తుండేవారు. ఆపరేషన్ పోలో.. దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ ఎస్టేట్‌లో రజాకార్ల దురాగతాలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. విద్యార్థులు, రైతులు, నిజాంపై తిరగబడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు, వేషభాషల విధ్వంసంపై రజాకర్లపై ధిక్కార స్వరం వినిపించారు. తెలంగాణ పరిస్థితి చూసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి సారథ్యంలో ఆపరేషన్ పోలోకి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 13న భారత సైన్యం దక్కన్ పీఠభూమిని ఆక్రమించుకుంది. విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా మరో దళం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. మూడురోజులు ఎదురించే ప్రయత్నాలు చేసి చివరికి రజాకర్ల సైన్యం చేతులెత్తేసింది. నిజాం వ్యతిరేక పోరాటంలో సామాన్యులు(ఫైల్) ఓటమి అంగీకరిస్తూ దిక్కుతోచని పరిస్థితిలో నిజాం 17వ తేదీన పటేల్ ముందు తల వంచాడు. బేగంపేట విమానాశ్రయంలో పటేల్‌కు స్వాగతం పలికి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో చేర్చేందుకు అంగీకరించాడు. దీంతో భారత రిపబ్లిక్లో తెలంగాణ కలిసిపోయింది. ఆ క్షణం నుంచి జేఎన్ చౌదరి నేతృత్వంలో సైనిక గవర్నర్‌గా, ఎంకే వెల్గొడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నిజాం తన ప్రధాని లాయక్ అలీని పదవినుంచి తొలగించాడు. ప్రజలకు నరకయాతను చూపించిన ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. పూణె జైలుకు తరలించారు. అక్కడినుంచి విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లాడు. 1948 నుంచి 1951 వరకు సాయుధ పోరాటం జరిగింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలతో తిరిగి ప్రజాస్వామ్యం అవతరించింది. ఎదురుతిరిగిన ఎల్లప్ప కోరుట్ల: భారత్ చేపట్టిన ఆపరేషన్ పోలోను ప్రతిఘటించేందుకు ఖాసీం రజ్వీ దళాలు కొత్తగా సైనికులను నియమించే క్రమంలో 1947 ఆగస్టు నెలలోనే కోరుట్ల వాగుకు అవతల వైపు సంగెం గ్రామ శివారులో మకాం వేశాయి. ఒక్క రోజు గడిస్తే రజ్వీ దళాలు కోరుట్లలోకి చొరబడి ఆరాచకాలు పాల్పడే అవకాశాలున్నాయన్న సమాచారం అందుకున్న కస్తూరి ఎల్లప్ప ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చక్కని పథకం వేశారని ఆయన సహచరులు వేముల విశ్వనాథం చెప్పుకొచ్చారు. ఎల్లప్ప తన సహాచరులతో కలిసి సుమారు 20 మందిని పోగు చేసుకుని రాత్రి వేళ చీకట్లో కోరుట్ల వాగు సమీపంలో బొంగు కట్టెలకు నూలు బట్టలను చుట్టి నూనేలో ముంచి కాగడాలు చేతపట్టుకుని పెద్ద ఎత్తున భారత మాతాకు జై అన్న నినాదాలు చేస్తూ భారత సైన్యం కోరుట్లకు చేరుకుందన్న సమాచారం ఖాసీం రజ్వీ దళాలకు చేరేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో రజ్వీ దళాలు భయంతో అక్కడి నుంచి పరారైపోయినట్లు విశ్వనాథం తెలిపారు. కస్తూరి ఎల్లప్ప(ఫైల్), వేముల విశ్వనాథం బీడీ కార్మిక కుటుంబం కోరుట్లకు చెందిన బీడీ కార్మిక కుటుంబంలో 1905లో కస్తూరి ఎల్లప్ప జన్మించారు. తల్లిదండ్రులు పుణేకు వలస వెళ్లడంతో యుక్త వయసు వరకు అక్కడే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఎల్లప్ప కోరుట్లలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించేవారు. 1947లో కోరుట్లలో భారత జాతీయ జెండాను ఆలయంపై ఎగురవేయడం..ఖాసీం రజ్వీ సేనలను బెదరగొట్టడం వంటి చర్యలు చేపట్టారు. ఎల్లప్ప 1991లో తుదిశ్వాస విడిచి చిరస్మరణీయుడిగా మిగిలారు. పెద్దపల్లిలో నిజాం ఏజెంట్ల పెద్దరికం.. పెద్దపల్లి: పెద్దపల్లి జాగీరి కింద ఆదిలాబాద్ జిల్లా నస్పూరు, తపాలాపూర్ ప్రాంతాలు విస్తరించి ఉండేవి. ఆయా ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లు పెద్దరికం చలాయిస్తూ పేదల నుంచి వసూలు చేసే పన్నులు నిజాంకు కట్టేవారు. నిజాం ఏజెంట్ల దౌర్జన్యాన్ని ఎదురించేందుకు పెద్దపల్లి ప్రాంతంలోని గట్టెపల్లి మురళీ నాయకత్వంలో సాదుల నంబయ్య, లొట్ల ముత్తయ్య, మద్దిరాల పురుషోత్తం తదితరులు పన్ను వసూలుకు వచ్చే నిజాం పోలీసులపై తిరుగుబాటు చేశారు. మంథనికి చెందిన గుల్లకోట శ్రీరాములు దళాన్ని ఏర్పాటు చేసి సిరివంచ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. నిజాయితీగా ఉద్యోగం చేస్తే బదిలీ.. కరీంనగర్ కలెక్టర్ కింద నా భర్త రాంచందర్‌రావు పేష్కార్గా పని చేశారు. ప్రజల నుంచి పన్నులు బలవంతంగా వసూలు చేయరాదని అన్నందుకు నాగపూర్ దగ్గరలోని షరీశ్రాపూర్కు బదిలీ చేశారు. అక్కడి నుంచి మళ్లీ మహబూబ్‌నగర్ అన్నసాగర్‌కు బదిలీ చేశారు. నిజాం పాలనలోని కలెక్టర్లు సైతం దుర్మార్గంగా వ్యవహరించేవారు. పోలీసుల ఆకృత్యాలైతే చెప్పతరం కాదు. నిజాం పోలీసులు గ్రామాలకు వస్తే గజగజ వణికిపోయే వాళ్లం. – లక్ష్మీకాంతమ్మ, 98 ఏళ్లు, పెద్దపల్లి చదువు పక్కనబెట్టి.. పోరాటబాట పట్టి.. మంథని: ‘అమ్మానాన్నకు ఒక్కగా నొక్క కుమారున్ని. మూడేళ్ల వయస్సులో అమ్మ చనిపోయింది. నాన్నే అన్ని తానై అల్లారుముద్దుగా పెంచాడు. పెద్దవాన్ని చేశారు. చదువు పక్కనబెట్టి నిజాంపై పోరాటం చేస్తుంటే ఓ రోజు నాన్న నన్ను కలిశాడు. ఉద్యమం వదిలిపెట్టు నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తా. ఎక్కడికైనా వెళ్లు, జల్సాగా బతుకు అని బతిమిలాడాడు. ఓక్క కొడుకువి ఉద్యమంలో చనిపోతే నేను ఎట్లా బతకాలని వేడుకున్నాడు. కాని అప్పుడు నా మనస్సులో ఓకటే లక్ష్యం ఉండే. నేను ఉద్యమంలో చనిపోతే దేశంలోని ప్రతి ఓక్కరిని కన్నకొడుకులా భావించు అని అక్కడి నుంచి వెళ్లిపోయా. మా నాన్నను ఆ మాటలు ఎంతో బాధ పెట్టాయని తర్వాత తెలుసుకొని మదనపడ్డ’ అని సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య అన్నారు. చాందా క్యాంపు శిక్షణలో స్వాతంత్య్ర సమరయోధులు(ఫైల్) ప్రస్తుతం ఆయనకు 92 ఏళ్లు. హైదరాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. ఇండియన్ యూనియన్‌లో హైదరా బాద్‌ను చేర్చాలని సాగిన పోరాట పటిమ, సాధించిన విజ యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 1947లో భారతదేశంలోని 600 రాష్ట్రాలకు స్వాతంత్య్రం లభించినా హైదరా బాద్‌ను ఏడవ నిజాం ఉ స్మాన్ అలీఖాన్ బహుదుర్ వదిలి వె ళ్లకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. మధ్యప్రదేశ్ (ప్రస్తుత మహారాష్ట్ర)లోని చందాలో మంథనికి చెం దిన గులుకోట శ్రీరాములు ఆధ్వర్యంలో ఉద్యమ శిక్షణ పొ ందినట్లు వెల్లడించారు. ఇండియన్ యూనియన్ ఆధ్వర్యం లో గెరిల్లా శిక్షణ పొంది పోలీస్స్టేషన్లు, నాకాలపై దాడులకు శ్రీకారం చుట్టామని, రోజుల తరబడి దట్టమైన అడవుల్లో తలదాచుకునే వాళ్లమని, ఎన్నో రోజులు అన్నం తినకుండా గడిపినట్లు వివరించారు. అయితే ఉద్యమం తీవ్రం కావడంతో ఇండియన్ యూనియన్ పోలీస్ యాక్షన్‌ను రంగంలోకి దింపడంతో స్వేచ్ఛ లభించినట్లు పేర్కొన్నారు. రాంపెల్లి కిష్టయ్య త్యాగధనుల పురిటి గడ్డ.. కరీంనగర్: ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన కరీంనగర్ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలక భూమిక పోషించింది. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో అమరులయ్యారు. సి.నారాయణరెడ్డి , కొండల్రావు, దేశిని చినమల్లయ్య, అనభేరి ప్రభాకర్‌రావు రణభేరి మోగించిన ‘అనభేరి’ జమీందారి కుటుంబంలో పుట్టిన అనభేరి ప్రభాకర్‌రావు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి దళ నాయకుడిగా తుపాకి పట్టి పేదప్రజలకు బాసటగా నిలిచి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలను ఫణంగా పెట్టిన యోధుడు. రజకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక మిలటరీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 1948 మార్చి 14న ప్రభాకర్ సాయుధ దళాన్ని హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ పోలీస్ పటేల్ భోజనానికి పిలిచి అ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తేలియజేశారు. దీంతో మహ్మదాపూర్ గు ట్టలను మిలటరీ, రజకార్లు చుట్టుముట్టి కాల్పులు జరి పారు. తూటాలకు ఎదురొడ్డి పోరాడి అనభేరితో పాటు సిం గిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అ యిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి అమరులయ్యారు. కొరియర్‌గా చినమల్లయ్య.. తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పాల్గొన్న దేశిని చినమల్లయ్య మలి విడత తెలంగాణ ఉద్యమంలో నూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1948 ఫిబ్రవరిలో అ నభేరి ప్రభాకరరావును కలువగా ఆయన దళానికి కొరియర్‌గా పని చేయాలని చెప్పి కొన్ని గ్రామాల బాధ్యతలు ఇ చ్చారు. ఆయా గ్రామాల్లో తిరిగి వివరాలు సేకరించి, ద ళానికి చేరవేసేవారు. నాలుగు సార్లు సర్పంచ్‌గా, ఎమ్మెల్యే గా, ఒకసారి సమితి ప్రెసిడెంట్‌గా పదవులు చేపట్టారు. విద్యార్థిగా దశలోనే.. విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు జువ్వాడి గౌతంరావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కరీంనగర్, వరంగల్ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1947లో ఔరంగాబాద్ జైల్ నుంచి తప్పించుకొని వచ్చి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి ఎందరో వీరుల మార్గదర్శకత్వంలో పనిచేశారు. జువ్వాడి గౌతంరావు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్‌కు చెందిన బోజ్జపురి వెంకటయ్య స్వాతంత్య్ర ఉద్యమాలకు ఆకర్షితులై ఉద్యోగం వదిలి, పోల్సాని నర్సింగరావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా రాయికల్ పోలీసు స్టేషన్‌పై దాడి సంఘటనలో పాల్గొన్నారు. ముల్కనూర్ సర్పంచ్‌గా సేవలందించారు. అక్షరాలే ఆయుధాలుగా.. వేములవాడ తాలూకా పరిధిలో హనుమాజీపేట గ్రామానికి చెందిన సి. నారాయణరెడ్డి చిన్న వయసులోనే ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ విధానాల వల్ల తప్పని సరై ఉర్దూ మాధ్యమంలో విద్యాభ్యాసం గావించారు. నిరంకుశ పాలన విధానాలకు, రజాకార్లు సాగించిన హింసాకాండలకు వ్యతిరేకంగా స్వయంగా జానపదగేయాలు రాసి, ఆలపించి, ప్రజా చైతన్యానికి సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. కొరియర్‌గా కొండల్రావు.. వెలిచాల కొండల్రావు హైదరాబాద్‌లో చదువుకుంటూనే విద్యార్థి కార్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల వయసులో కోర్టు విచారణలో మెజిస్ట్రేట్‌కే ఎదురు తిరిగినందుకు 7 రోజుఏల జైలు శిక్ష గడపాల్సివచ్చింది. చంచల్‌గూడ జైలులో గడిపిన జీవితం తర్వాత హాస్టల్లో చదువుకుంటూ కాంగ్రెస్ పార్టీలో సోషలిస్టు వర్గానికి మద్దతునిచ్చేవారు. నాయకులకు కోరియర్‌గా పని చేశారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ధీశాలి.. మహదేవ్పూర్కు చెందిన ఎస్.శంకరయ్య భద్రాచలంలో ప్రైవేట్ గుమాస్తాగా పని చేస్తూ 1947లో ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్రావుతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అప్పట్లో ఎస్ఐ గురుదయాళ్‌సింగ్ వీరిని అరెస్ట్ చేశారు. మంథని వీధుల్లో లాఠీ దెబ్బలు కొడుతూ ఊరేగించారు. అనంతరం తప్పించుకుని చాందా క్యాంపులో చేరిపోయారు. ఆపైన మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌గా భావించి కాళేశ్వరం ఔట్‌పోస్ట్‌పై దాడి చేశారు. పోరాటాల గడ్డ.. సిరిసిల్ల సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగి సింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్‌శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, దామోదర్‌రావు, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి, రాజారాం లాంటి ఎందరో యోధులు అజ్ఞాతవాసంతో చారిత్రాత్మక పోరాటాన్ని సాగించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్రామహాసభలో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పి.వి.నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. రుద్రంగి శివారులోని మానాల శిక్షణ శిబిరం సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. ఇక్కడ శిక్షణ పొందిన తెలంగాణ యోధులు రజాకార్లను ఉరికించారు. త్రివర్ణపతాకం ఎగురవేయడమే నేరమైనట్లుగా ఖాసీంరజ్వీ రెచ్చిపోతే.. ఆయన ప్రైవేటు సైన్యమైన రజాకార్ల అకృత్యాపై పేదోళ్లు తిరుగుబాటు చేశారు. బద్దం ఎల్లారెడ్డి(ఫైల్), అమృత్లాల్ శుక్లా (ఫైల్), రాజేశ్వరరావు(ఫైల్) సాయుధపోరుకు శ్రీకారం.. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. ఈ ఘటనలో అప్పటి సాయుధ దళనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం పాల్గొంది. ఈ దాడితో గెరిల్లా తరహాదాడులకు తెలంగాణ ఉద్యమకారులు తెగించి తెగువను చాటుకున్నారు. మరసటి రోజే అప్పటి ఉద్యమనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం 1948 మార్చి 14న హుస్నాబాద్ మండలం మహ్మదాపురం గుట్టల వద్ద ఆశ్రయం పొందగా.. పోలీసులు దాడి చేశారు. పరస్పరం కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. దీంతో విచక్షణ కోల్పోయిన పోలీసులు అనభేరి ప్రభాకర్‌రావుతో సహా.. సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్‌కు చెం దిన సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, నారాయణ, భూం రెడ్డి, పాపయ్య, మల్లారెడ్డిలను కాల్చి చంపారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో రక్తచరిత్రగా మిగిలింది. అమృత్లాల్... నిజాంను ఎదిరించిన వారిలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్లాల్ శుక్లా ప్రముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేష న్పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్ 14న అమృత్లాల్ శుక్లా అస్తమించారు. త్యాగాల గాలిపెల్లి.. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. నాటి రజాకార్లకు వ్యతిరేకంగా కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలు, గుల్లెర్లతో పోరుసాగించారు. ఈ పోరులో గాలిపల్లితో పాటు సమీప గ్రామాలకు చెందిన పదకొండు మంది ఒకే రోజు అమరులయ్యారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో తలదాచుకున్న వీరిని రజాకార్లు వృద్ధులనికూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. రజాకార్ల కళ్లు గప్పి.. తప్పించుకుని.. గాలిపెల్లిలో రజాకారర్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజ లింగం, అమృత్లాల్ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆగ్రహం తో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఉద్యమకారులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి తుపాకుల్ని అపహరించారు. ఆయుధాల సేకరణకు అప్పట్లోనే ఠాణాను లక్ష్యంగా చేసుకున్నారు. సాయుధ పోరాటానికి గాలిపెల్లి ఊపిరి పోసింది. ప్రతి దాడులకు వేదికైంది. సాయుధ యోధుడు ‘చెన్నమనేని’ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారిలో సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వర్‌రావు ముఖ్యులు. వి ద్యార్థి దశలో తొలిపోరాటం సాగించారు. దున్నేవాడికే భూమి కావాలని నినదించారు. చిరోంచ ప్రాంతంలో సాయుధ ద ళాలకు రాజేశ్వర్‌రావు శిక్షణ ఇచ్చారు. అక్కడే మాజీ ప్రధాని పీ. వి. నర్సింహారావుతో చెన్నమనేనికి పరిచయం ఏర్పడింది. హై దరాబాద్‌లో అరెస్టయి 12 నెలల పాటు కరీంనగర్, వరంగల్, చంచల్‌గూడ, గుల్బర్గా జైళ్లలో గడిపారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత సాయుధ పోరాటం వద్దని రాజేశ్వర్‌రావు చెప్పారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయాయి. తొలిసారి చొప్పదండి ఎమ్మెల్యేగా 1957లో ఎన్నికయ్యారు. తరువాత సిరిసిల్ల ఎమ్మెల్యేగా 1967, 1978, 1985, 1994, 2004లో ఎన్నికయ్యారు. 2016 మే 9న 93 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వర్‌రావు తన రాజకీయ, సాయుధ పోరాటంపై ‘సత్యశోధన’ ఆత్మకథ పుస్తకాన్ని రాశారు. చెన్నమనేని రాజేశ్వర్‌రావు 16వ ఏటనే ఉద్యమాల్లోకి.. వేములవాడ: ఉద్యమమే ఊపిరిగా 96 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్న నమిలకొండ పుల్లయ్య అలియాస్ గుమ్మి పుల్లన్న వేములవాడ వాసి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనైనా.. భూపోరాటమే పంథాగా ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 16వ ఏట కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. నేటికీ వేదాలు, మంత్రాలు పటిస్తూనే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయనకే సొంతం. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న పుల్లన్నకు నేటికీ స్వాతంత్య్ర సమరయోధుడి పెన్షన్ మంజూరు కాకపోవడం బాధాకరం. స్వాతంత్య్ర సమరయోధుడు రాజేశ్వర్‌రావుకు వెన్నంటి ఉంటూ భూపోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో రైతులను జాగృత పరుస్తూ ఊరూరా ఉద్యమాలను కొనసాగించారు. గుమ్మి పుల్లన్న సిరిసిల్ల ఠాణాపై దాడులు.. రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి నిర్వహించి 9 తుపాకులు ఎత్తుకెళ్లారు. అలాగే తిమ్మాపూర్ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలసి దాడి చేసి 110 తుపాకులను ఎత్తుకెళ్లారు. తుపాకులు ఎత్తుకెళ్లడంతో పుల్లన్నను పోలీసులు గుర్తించే అవకాశం ఉన్నందున పార్టీ తీర్మానం మేరకు అతడిని మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు బదిలీ చేశారు. దీంతో వారంపాటు కాలినడకన చంద్రపూర్‌కు చేరుకున్నారు. మూడేళ్లు అక్కడే కోయ, గోండు, నేతకాని, గుత్తికోయల వారితో పార్టీ పునర్నిర్మాణం చేశారు. మూడేళ్ల అనంతరం చంద్రపూర్ కమిటీ ఇద్దరు కొరియర్ల సాయంతో పుల్లన్నను కరీంనగర్‌కు పంపించింది. ఈక్రమంలో ధర్మపురి గంగ వద్ద స్నానాలు చేస్తున్న వీరిపై పోలీసులు దాడులు చేశారు. ఇరువురు కొరియర్లను చంపేసి అక్కడే గడ్డిలో తగులబెట్టారు. పుల్లన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించగా, మూడేళ్లు గడిపాడు. చివరకు ఎలాగోలా బయటిపడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. పోరాటయోధుడిగా పేరొందిన పుల్లన్నను ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడి ప్రజాప్రతినిధులు పౌరసన్మానం చేస్తారు. -
అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదిన జరగబోయే బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడం లేదని బీజేపీఅధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పటాన్చెరులో జరిగే ఈ సభకు తొలుత అమితాషా రానున్నట్లు బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం వీలు కావడం లేదని ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్వం మజ్లిస్ పార్టీనే నడుపుతోందని, మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమేనని మండిపడ్డారు. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను స్మరించుకోవాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజున అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు. -
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక
► విమోచన దినంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ► అవినీతిని అరికట్టే చర్యలు చేపట్టాం ► అధికారికంగా నిర్వహిస్తాం: హన్స్‌రాజ్ ► బీజేపీలో చేరిన డీఎస్ తనయుడు ► నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంకల్ప సభ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవ మైన సెప్టెంబర్ 17 ఈ ప్రాంత ప్రజల అస్తిత్వానికి ప్రతీక అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ సుమారు అరగంటపాటు మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, మోదీ పుట్టిన రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు, దేశ ప్రజలకు సౌభాగ్యమైన రోజు అని పేర్కొన్నారు. యూపీఏ సర్కారులో మంత్రులు అవినీతిలో కూరుకు పోయారని, కానీ, మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక కూడా లేదని రాజ్‌నాథ్ అన్నారు. అవినీతిని అరికట్టే చర్యలు చేసి చూపించామని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ ప్రతిపక్ష పార్టీ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి స్పందిస్తూ పాక్ హింసను ప్రేరేపిస్తుంటే చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. అహింసామార్గంలో పయనిస్తున్నందున సహనం పాటిస్తున్నామని, అందుకే మొదటి తూటాను మనం ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా నిర్వహిస్తాం: హన్స్‌రాజ్ తెలంగాణ సాయుధ పోరాట యోధులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినట్లుగానే, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం లభించిందని అన్నారు. మండలిలో బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రభాకర్, మాజీ మంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, పుష్పలీల తదితరులు ప్రసంగించారు. బీజేపీలోకి డీఎస్ తనయుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ ఈ సభ సందర్భంగా బీజేపీలో చేరుతున్నట్లు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. అయితే, మంచి రోజు కాదని అరవింద్ పార్టీ కండువాను కప్పుకోలేదు. టీఆర్ఎస్.. మజ్లిస్ తొత్తు: లక్ష్మణ్ నిజామాబాద్ అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి, మజ్లిస్ నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ చరిత్రను టీఆర్ఎస్ వక్రీకరిస్తోందని, విమోచన దినోత్సవం నిర్వహించడానికి కేసీఆర్ ఎందుకు ముందుకు రావట్లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమారుడ్ని సీఎం చేయడానికే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే వచ్చే ఏడాది విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. గోల్కొండ కోటపై వచ్చే ఏడాది బీజేపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాదిరిగానే టీఆర్ఎస్ కూడా నాశనమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావ్ అన్నారు. తెలంగాణ గుర్తింపును, సంస్కృతిని కాపాడడంలో విఫలమైన టీఆర్ఎస్ ఉద్యమాలను అణచివేయడం ద్వారా ఆ పార్టీ కూడా సమాధి అవుతుందని చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని బర్తరఫ్ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విచ్ఛిన్న కార్యక్రమం అనడం ఆయన అవగాహన లేనితనానికి నిదర్శనమని విమర్శించారు. మజ్లిస్ నాయకులను చర్లపల్లి జైలులో పెట్టిస్తామన్నారు. రజకార్ల వారసత్వానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. -
సెప్టెంబర్ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!
సందర్భం తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. హైదరాబాద్ సంస్థాన విమోచన పోరు అంతగా పట్టించుకోదగినది కాదా? ఆ ఘట్టాన్ని ఒక రాజ్యవిలీనంగా, అధికార మార్పిడిలా మాత్రమే చూడాలా? ప్రాణాలు విడిచిన వేలాది మంది యోధుల త్యాగం గురించి మాట్లాడుకోవద్దా? రజాకార్ మూకలు చెరిచిన అసంఖ్యాక ఆడబిడ్డలకు జరిగిన అవమానం కూడా తేలికగా తీసుకోదగినదేనా? అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకను ఎన్నిసార్లు మడతవేసినా తప్పులేదనుకునే తెలంగాణ నయా నిజాం కేసీఆర్ చెబుతున్నదిదే. ఆయన పార్టీ నేతలు, మంత్రులు, సామంతులు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరును చిన్నదిగా చేసి చూపడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ముందుతరం గోస గుర్తు చేసుకోదగిన చరిత్రే కాదంటున్న కేసీఆర్ ఎందుకలా అంటున్నారో తెలుసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు. భారతదేశం బ్రిటిష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందిన ఏడాదిదాకా ఇక్కడి భూభాగం ఎవరి పాలనలో ఉంది? సెప్టెంబర్ 17న విముక్తి పొందే దాక 13 నెలల పాటు తెలంగాణలో జరిగిన నరమేధం తేలికగా మర్చిపోగలిగేదేనా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MఐM) మత సంస్థ పేరుతో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సేన సాగించిన ఊచకోతల గాథలను తెలంగాణ లోని ప్రతి పల్లె జ్ఞాపకం పెట్టుకుంది. నాడు రజ్వీని ఉసిగొల్పిన నిజాంకు, నేడు ఒవైసీ కోసం తెలంగాణ చరిత్రనే మర్చిపోమంటున్న కేసీఆర్‌కు మధ్య ఎంత సారూప్యం ఉందో చూస్తున్నాం. అందుకే ఆయనను నయా నిజాం అనాల్సి వస్తోంది. ‘భారత్‌కు స్వాతంత్య్రం వస్తే ఏమిటి...నేను పాకిస్తాన్లో భాగంగా ఉంటా...లేదా హైదరాబాద్ దక్కన్ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు...వాళ్లు భారత్‌లో కలవాలంటే నేను విలీనం చేయాలా? తిరుగుబాటు చేసే వారిని మా మిలటరీ, రజాకార్లు చూసుకుంటారు’, ఆగస్టు 15, 1947న యావద్దేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానంలోని ప్రముఖ్‌లతో అన్న పొగరుబోతు మాట లివి. మువ్వన్నెల జెండా ఎగరేసిన వారిని రజాకార్లు పిట్టల్లా కాల్చి చంపారు. లూటీలు, ఇళ్లు, ఆస్తుల దహనాలు, ఆడవాళ్లను చెరచడం, వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిపించడం... సంస్థానమంతా ఒక అగ్నిగుండమైంది. తూర్పు పాకిస్తాన్ లాగా, దక్షిణ పాకిస్తాన్‌గా హైదరాబాద్ దక్కన్‌ను గుర్తించాలంటూ ఆఖరి గవర్నర్ జనరల్‌తో రాయబారాలు నడుపుతూనే, ఐక్య రాజ్య సమితికి వినతి పత్రాలు పంపించిన నక్క జిత్తుల నిజాం, ఆనాడు పన్నని కుయుక్తులు లేవు. కనీసం ప్రజా తిరుగుబాటు రాకుండా చూసుకుంటే భారత రిపబ్లిక్ నుంచి తనకు తక్షణ ముప్పు ఉండదని మిలటరీ, రజాకార్లను వదిలి పెట్టాడు. కోటి యాభైæ లక్షల మందిలో 13 శాతం మంది తన వాళ్లు తప్ప స్వాతంత్య్ర కాంక్షతో రగిలిన ప్రజలు నిజాం వదిలిన ముష్కరులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1947 ఆగస్టు 15 తర్వాత విలీనమైన సంస్థానాల్లో ఎక్కడా ఇంత హింస, తిరుగుబాట్లు లేవు. పాలకులు ప్రజల ఆకాంక్షను మన్నించి రిపబ్లిక్లో కలపడానికి సిద్ధపడ్డారు. మరి నైజాం రాజు నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు వీరందరికి మించిన గొప్ప మానవతావాది ఎలా అయ్యోడో అర్థంకాదు. అధికారంలోకి రాకముందు విమోచన దినం జరపాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? నిజాం వార్షికాదాయం రూ. రెండున్నర కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం నిల్వలు, అరుదైన వస్తువుల లెక్క ఎవరికీ తెలియదు. 50 లక్షల ఎకరాల భూమి ఆయన సొంతం. ఇది మొత్తం సంస్థానం భూమిలో పది శాతం. నిజాంకు ఏజెంట్లుగా ఉన్న దేశ్‌ముఖ్‌లు, ఆయన తాబేదారులు 1,100 మంది చేతిలో 30 శాతం సేద్యపు భూమి ఉంది. సంస్థానంలో 40 లక్షల మంది కౌలుదారులే. వారికి గుంట భూమి కూడా లేదు. నిజాం సంస్థానంలో అక్షరాస్యత 9 శాతమే. అది కూడా మెజారిటీ హిందువుల మాతృభాష తెలుగులో చదువుకునే వీలే లేదు. నిజాంసాగర్, డిండీ, మూసీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిర్మించడం వెనుక ప్రజా సంక్షేమం కన్నా నిజాం స్వార్థమే ఎక్కువ. కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు హైదరాబాద్ సంస్థానంలో నుంచే ప్రవహించినా వాటిపై పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం జరగలేదు. వీటిని కట్టాలంటే సిమెంటు, ఉక్కు అవసరం. ఖజానాలోని పైకం ఖర్చవుతుంది. అందుకే అణా, కాణీ ఇచ్చి బలవంతపు కూలితో పూర్తి చేయగలిగే మట్టికట్టలనే నిర్మించారు. సంవత్సరంలో నెలకు పైగా రాజు నిర్మించే రోడ్లు, చెరువు కట్టల నిర్మాణాలకు ‘బేగార్’పేరుతో ఉచితంగా కూలీ చేయాలి. మొత్తం మీద నిజాం పాలనలో ప్రజలు తమ ఇళ్లు, గ్రామాలు అనే బహిరంగ జైలులో ఉన్నట్టే ఉండేది. పండగలు చేసుకోవాలన్నా, పెళ్లి, మరే శుభ కార్యం చేసుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. రెండొందల ఏళ్ల అసఫ్ జాహి, నిజాం పాలకుల పీడనలో హైదరాబాద్ సంస్థానం ప్రజల జన్యుపటమే మారిపోయింది. సర్కారు కొలువు దొరికితే తప్ప గౌరవంగా బతకలేని స్థితి. వ్యవసాయం చేసేవారు, కూలీ పనులతో బతుకీడ్చే వారు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతూ దినదిన గండంగా బతికేవారు. బానిసత్వంలో మగ్గేవారు దేని గురించి ఆలోచించలేని శూన్య స్థితిలో ఉంటారు. ఇది భౌతిక హింస కంటే దారుణమైనది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యాపార గుణాలను ఇంకొకరి నుంచి నేర్చు కోవాల్సిన అవశ్యకతను కల్పించింది. వజ్రాలు, బొగ్గు ఖనిజాలు అపారంగా దొరికే చోట ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గోస కనిపించదు. మూడు పూటలా తిండి దొరకని, ఒంటి నిండా గుడ్డలు కప్పుకోలేని దయనీయ స్థితి. 86శాతం మంది హిందువులు మైనారిటీలుగా మనుగడ సాగించిన ఘోరం. 13 శాతం మంది ముస్లిములదే ఆధిపత్యం. తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. మీరు బతుకమ్మను జరుపుకోవడానికి ప్రభుత్వ నిధులు కేటాయించనపుడు, అధికారిక ఉత్సవంగా ప్రకటించకపోయినా ఆ పండుగను ప్రజలు జరుపుకోలేదా? ఇది ఐదేళ్లు పాలించడానికి ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయిస్తే తప్ప జరగాల్సిన పర్వదినమేమీ కాదు. కాకపోతే ఆరోజు అన్న మాటలు ఇప్పుడెందుకు మర్చిపోయారని మాత్రమే అడుగుతున్నాం. ముందు తరాల వాళ్లు సెప్టెంబర్ 17 విముక్తి దినాన్ని ఒక దసరాలా, దీపావళిలా జరుపుకుంటారు. వ్యాసకర్త బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి మొబైల్ : 99490 99997 -
విలీనమా.. విమోచనమా ?
-
వరంగల్‌లో తెలంగాణ విమోచన వేడుకలు
బహిరంగ సభకు హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండు లక్షల మంది తరలింపునకు ప్రణాళిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భీమారం : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఈనెల 17న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యాన వరంగల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారని రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ తెలిపారు. హన్మకొండలోని బాలాజీ గార్డెన్స్‌లో పార్టీ మండల, డివిజన్ల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్‌షా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా తో పాటు కరీంనగర్ జిల్లాల నుంచి కార్యకర్తలను తరలిం చాలని సూచించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మం దిని సభకు తరలించనున్నట్లు పార్టీ నాయకులు లక్ష్మణ్‌కు వెల్లడించారు. అధికార పార్టీని నమ్మడం లేదు... రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉండగా.. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు పూర్తిగా మరిచిపోయారని పేర్కొన్నారు. ఆనాడు సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుంటే ఈరోజు హైదరాబాద్ ప్రత్యేక దేశంగా అవతరించి.. పాకిస్తాన్‌కు సహకారం అందించి ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, మందాడి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములుతో పాటు నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, రావుల కిషన్, గురుమూర్తి శివకుమార్, పావుశెట్టి శ్రీధర్, గుండమీది శ్రీనివాస్, ఏనుగుల రాకేష్‌రెడ్డి, కీర్తిరెడ్డి, నరహరి వేణుగోపాల్, చాడా శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ వర్సెస్ రూరల్ బీజేపీలో వర్గ పోరు బయటపడింది. బాలాజీ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ రావడానికి ఇరవై నిముషాల ముందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ మేరకు గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మైక్ తీసుకుని అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇదేక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కూ డా ఆహ్వానించినా ఆయన రాలేదు. ఇంతలోనే రూరల్ నాయకులు నిరసన తెలిపారు. సమావేశానికి రూరల్ అధ్యక్షుడు అధ్యక్షత వహించాల్సి ఉండగా గ్రేటర్ అధ్యక్షుడు ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన బయటకు వెళ్తుండగా రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడం వివాదం సద్దుమణిగింది. -
'వాళ్లకు భయపడే సెప్టెంబరు 17ను నిర్వహించటం లేదు'
రంగారెడ్డి(తాండూరు): తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించటంలేదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు విమర్శించారు. తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు పరామర్శించలేదని ఆయన విమర్శించారు. -
టీఆర్ఎస్కు సెప్టెంబర్ 17 టెన్షన్
-
తెలంగాణ విమోచన దినోత్సవం
-
సెప్టెంబర్ 17...అసలు ఏం జరిగింది
-
విలీనమా! విమోచనమా?