సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. లేఖల్లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఎంఐఎం చీఫ్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. కాబట్టి సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలి. 17వ తేదీన పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: పాలిటిక్స్‌లో ట్విస్టులు.. బీజేపీ బిగ్ ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment