సాక్షి, హైదరాబాద్: నేను హిందువు అంటే నేను హిందువనని జాతీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనికోసమేనా స్వాతంత్ర్య సమరయోధులు వారి జీవితాన్ని త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన హిందువని కొందరంటే.. మరికొందరు ఓబీసీకి చెందిన హిందువు అంటారు. మరికొంతమంది జైను మతంతో పాటు హిందువని అంటారు. దీనికేనా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాటలు వేసిందని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఈ వ్యూహంతో నరేంద్రమోదీని ఎదుర్కోలేదని అభిప్రాయడ్డారు. గుజరాత్‌లో 12 శాతం పటీదార్లు, 11 శాతం ముస్లింలు ఉండగా 182 ఎమ్మెల్యేల్లో 32 మంది పటీదార్ ఎమ్మెల్యేలు, ఇద్దరే ముస్లిం ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ పటీదార్ల రిజర్వేషన్‌కే ప్రాధానత్యను ఇచ్చి ముస్లింలకు లాలీపాప్ ఇవ్వాలని చూస్తోందని ఓవైసీ ఆరోపించారు. ఇక యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 78 వార్డులకు పోటీ చేసి 29 వార్డుల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
గుజరాత్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తను హిందువునే అని, శివభక్తుడునని ప్రకటించారు. రాహుల్ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేసి, హిందువునని చెప్పుకోంటున్నారని బీజేపీ విమర్శించింది. జైన్ మతస్థుడైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా హిందువునని చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment