17న సభకు లక్షలాదిగా ప్రజలు | All Set For Telangana National Integration Day Celebration Sabha | Sakshi
Sakshi News home page

17న సభకు లక్షలాదిగా ప్రజలు

Published Fri, Sep 16 2022 2:45 AM | Last Updated on Fri, Sep 16 2022 2:45 AM

All Set For Telangana National Integration Day Celebration Sabha - Sakshi

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తెలిపారు. 

కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్‌ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్‌ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్‌ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. 

వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్‌

సెప్టెంబర్‌ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు

► సెప్టెంబర్‌ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ

► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్‌ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ

► సెప్టెంబర్‌ 18 – జిల్లా  కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు

ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement