sathyavathi
-
కేసీఆర్ మీద అభిమానంతో మంత్రి పచ్చబొట్టు
-
'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం'
హైదరాబాద్: ప్రగతి భవన్‌ను పేల్చేయాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పాదయాత్రకు ఆదరణ కరువు కావడంతో అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపునివ్వడమేంటమని మండిపడ్డారు. 'రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. భట్టి విక్రమార్క రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమాలేక వ్యక్తిగతమా చెప్పాలి. కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బయట తిరగలేడు.. 'రేవంత్‌వి అన్ని అబద్ధాలే. వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనర్హుడికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు క్షమాపణ చెప్పాలి' అని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్.. 'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ ఖతం. తెలుగుదేశంలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. రేవంత్‌ను ప్రజలు ఐటెం సాంగ్ గానే చూస్తారు. ఆయన వెంట ఉండేవారు కిరాయివాళ్లే. నర్సంపేటలో పాదయాత్ర ఎందుకు చేయలేదు? అక్కడ తంతారనా? రేవంత్ ఓ బ్రోకర్. ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. మోదీ ఆఫీస్‌ను కూడా పేల్చేయాలని రాహుల్ గాంధీకి రేవంత్ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. నక్సలైట్ల ఎజెండా మంచిగానే ఉంటుంది. నాకు చదువు రాకపోతేనే ఏడు సార్లు గెలిచానా?' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు! -
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
Atchutapuram Gas Leak: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా) ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత) -
సీఎం సీటుకు వెలకట్టిన పార్టీ మీది
సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి: ‘కర్ణాటకలో సీఎం సీటు కావాలంటే అధిష్టానానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేనే అన్నడు.. సీఎం సీటుకు వెలకట్టే పార్టీ బీజేపీ అయితే, ఓటుకు కోట్లు నిందితుడు ఉన్న పార్టీ కాంగ్రెస్’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆయుష్ ఆస్పత్రి భవన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ నీరు పారలేదని చెప్పడం విడ్డూరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గతిని మార్చేసిందని నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో 13వేల డాక్టర్ పోస్టుల భర్తీ రాష్ట్రంలో త్వరలోనే 13 వేల డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు ప్రతి డెలివరీకి రూ.3వేల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
కర్ణాటకలో మంగ్లీ ధూమ్‌ధామ్.. ఓటర్లను ఆకట్టుకునేలా
సాక్షి బళ్లారి: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ మస్కి నియోజకవర్గంలో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం ఉగాది సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తాండాల్లో ఇంటింటా కలియతిరుగుతూ తాండా భాషలో మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల.. ‘‘కన్నే అదిరింది అనే పాట’’ కన్నడిగులను కూడా కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో మంగ్లీకి ఇటీవల కర్ణాటకలో కూడా విశేష ఆదరణ లభించడంతో ఆమెను ప్రచారంలోకి దింపారు. ప్రవాసాంధ్ర క్యాంపులతో పాటు మస్కి పట్టణంలో కూడా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ విజయానికి కృషి చేయండి రాయచూరు రూరల్: మస్కి ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ సూచించారు. ఆయన సోమవారం సాయంత్రం ముదుగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. రైతులకు ఉపయోగపడే ఎన్‌ఆర్‌బీసీ 5ఏ ఉప కాలువను నిర్మిస్తామన్నారు. చదవండి: ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ బహిరంగ సభ
సాక్షి, విశాఖపట్నం: ‘ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా.. ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. అనంతరం ప్లాంట్ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిస్తే.. విశాఖలో తప్ప మరోచోట ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్‌ప్లాంట్‌కున్న రుణభారం రూ.25వేల కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్‌ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తి స్థిరీకరణ చాలా అవసరం.. ఉత్పత్తి ఆగితే నష్టాలు మరింత పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదు. స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న పైఅధికారులు మన రాష్ట్రం వారు కాదు. వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తుశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలి. ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదు. కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటాం .. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వరంగంలో కొనసాగేలా ఉద్యమం కొనసాగిస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. రాయలసీమ నుంచి కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తాం. స్టీల్‌ప్లాంట్ కోసం ఉక్కుదీక్షతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం’’ అని పేర్కొన్నారు. ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో కూడా చెప్పాం. ఇప్పటికే ప్రధానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు’’ అని తెలిపారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం’’ అని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పోరాటం కొనసాగిస్తాం: ఎంపీ సత్యవతి మా అందరికీ ఎప్పటికప్పుడు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం ఉధృతం చేస్తాం. కాపాడుకుని తీరతాం: గుడివాడ అమర్నాథ్ 32 మంది ప్రాణాల త్యాగఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్. దానిని కచ్చితంగా కాపాడుకుని తీరుతాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అనగానే మొదటిగా స్పందించిన వ్యక్తి సీఎం జగన్.. ఇప్పటికే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. చదవండి: విజయసాయిరెడ్డి పాదయాత్ర విజయవంతం -
స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది
-
మాడపాటి సత్యవతి మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: రేడియోలో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు. తన సుస్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం తిరుమల్గిరి శ్మశాన వాటికలో మాడపాటి సత్యవతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన గాత్రంతో న్యూస్ రీడర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యవతి 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళ పురస్కారం అందుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం మాడపాటి సత్యవతి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి మహిళా న్యూస్ రీడర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యవతికి విజయవాడతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అందుకే గిరిజన వర్సిటీ ఆలస్యం: సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం ఉందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ములుగు నియోజకవర్గం జాకారంలో స్థలాన్ని కేటాయించిందన్నారు. ప్రత్యేకంగా యూత్ ట్రైయినింగ్ సెంటర్ భవనాన్ని సైతం కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన పద్దు లపై చర్చలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. వారి సమస్యలు నాకు తెలుసు.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళకు బాధ్యత అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తనకు బాగా తెలుసని, వాటిని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. -
పార్లమెంట్లో ఇచ్చిన మాట శాసనమే
సాక్షి, సింహాచలం (పెందుర్తి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట ఒక శాసనమే..దానికి కట్టుబడి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వాల్సిందే అని అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రానికి అన్ని సదుపాయాలు కలుగజేస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పినా హోదా మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రంలోని 22 మంది ఎంపీలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్‌పై కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో మాట్లాడటం జరిగిందని..రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తక్షణం ఇస్తామని చెప్పారన్నారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్లోనే ఉంచాలని తామంతా ఫ్లోర్‌లీడర్ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. వాల్తేరు డివిజన్ అనేదే లేకుండా చేయడం సరికాదన్నారు. అనకాపల్లి–ఆనందపురం ఆరులైన్లు రోడ్డు మార్గం త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి సోమవారం తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయడం, టోల్గేట్వద్ద స్కూల్ బస్సులు, ప్రభుత్వ వాహనాలకు ఫీజుల మినహాయింపు విషయాలని గడ్కరీని కోరుతామని చెప్పారు. తిరుమలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో సింహాచలంలో అలాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తరపున తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. సత్యవతి దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. -
పార్లమెంట్లో గళమెత్తిన అనకాపల్లి ఎంపీ
అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి తొలి మహిళా ఎంపీగా ఎన్నికైన డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి పార్లమెంట్లో గళం విప్పారు. జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు ప్రస్తావించారు. అవసరాలపై వాణిని వినిపిస్తున్నారు. వైద్యురాలైన సత్యవతి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడమే గొప్ప అని భావించకుండా తన వాణిని, బాణిని వినిపిస్తున్నారు. వందలాదిమంది పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఆమె జిల్లాకు చెందిన సమస్యలపై ప్రస్తావిస్తున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి వచ్చిన వినతులను పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పటికే మూడు అంశాలపై తనకు వచ్చిన అవకాశం ద్వారా పార్లమెంట్లో విశ్లేషిస్తూ అన్నిపార్టీల వారిని ఆకట్టుకున్నారు. సాక్షి, అనకాపల్లి: నిశితమైన పరిశీలన.. స్పష్టమైన వ్యాఖ్యానంతో ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి పార్లమెంటులో జిల్లాకు చెందిన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన సెషన్లో రైల్వేకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌కు, నర్సీపట్నం రోడ్డు వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు కల్పించాలని కోరారు. నిత్యం తిరుపతికి జిల్లా నుంచి భక్తులు ఎక్కువగా వెళ్లడంతో అదనపు రైలును కేటాయించాలని కోరారు. విశాఖ నుంచి వారణాసికి వెళ్లేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు. నర్సీపట్నం రోడ్డులో జన్మభూమి హాల్టు కోసం స్వయంగా రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. జన్మభూమితోపాటు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కూడా నర్సీపట్నం రోడ్డు వద్ద హాల్టు కల్పించాలని విన్నవించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు నర్సీపట్నం రోడ్డు నుంచి ఇటు విశాఖపట్నం, అటు రాజమండ్రి వెళ్తుంటారని, అలాంటివారి సౌకర్యార్థం తప్పకుండా జన్మభూమి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టు కల్పించాలని రైల్వేశాఖ మంత్రిని కోరారు. ‘బొజ్జన్నకొండను అభివృద్ధి చేయాలి’ అనకాపల్లి మండలంలోని శంకరం వద్ద ఉన్న బొజ్జన్నకొండ అభివృద్ధిపై పార్లమెంట్లో సత్యవతి ప్రస్తావించారు. గతంలో కేంద్రం నుంచి నిధులు మంజూరైనట్లు తెలుసుకున్న మేరకు బొజ్జన్నకొండ విశిష్టత గురించి వివరించడంతోపాటు దేశ విదేశాలకు చెందిన బౌద్ధబిక్షువులు, ప్రముఖులు వస్తున్నట్లు వివరించారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిపై కూడా ఆమె పార్లమెంట్లో ప్రస్తావించారు. అనకాపల్లి ఆస్పత్రిని కేజీహెచ్ తరలో అభివృద్ధి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్రం ద్వారా పరిష్కరించగల అంశాలపై క్షుణ్ణంగా అ«ధ్యయనం చేస్తూ ఎంపీ సత్యవతి పార్లమెంట్లో ప్రసంగించడం కొత్త అయినప్పటికీ దృఢ సంకల్పంతో తన వాణి వినిపించారు. నిరుద్యోగుల తరఫున గళం ఎంపీ సత్యవతి పార్లమెంట్ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున గళం విప్పారు. రైల్వే నియామక బోర్డు లేకుండా విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు చేశారని, ఈ కారణంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరగడం లేదన్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ పేరుకే ఏ–1 రైల్వేస్టేషన్‌గా పరిగణిస్తున్నప్పటికీ లోకమాన్యతిలక్, ఫలుక్నూమా, అమరావతి, నాందేడు–విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ రైళ్లకు అనకాపల్లిలో హాల్టు కల్పించడం లేదన్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పార్లమెంటు స్థానిక సమస్యలను ఎంపీ లేవనెత్తిన విషయం తెలుసుకున్న ప్రజలు ప్రశంసలు కురుపిస్తున్నారు. తమకు సరైన నాయకురాలు దొరికారంటున్నారు. -
అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి
ఇల్లెందు: నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించటమే తన చిరకాల కోరికని, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవటం కోసమే మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కోరారు. ఆదివారం రాత్రి ఇల్లెందులోని కరెంటాఫీఎస్ నుంచి గోవింద్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి కవితతో పాటు ఎమ్మెల్సీ, పార్లమెంటు ఇన్చార్జ్ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్, జీసీసీ చైర్మన్ మోహన్‌గాంధీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ మడత రమలు ప్రజలకు అభివాదం చేశారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు తన సేవలు అందించాలనే తన చిరకాల కోరిక ఈ విధంగా తీరనుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఇక్కడి అన్ని వర్గాలు, గ్రూపుల సహకారం తీసుకుంటానని, అందరిని కలుపుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు, సీతారామా ప్రాజెక్టు నిర్మాణం, ఇల్లెందు రైలు సమస్యలతో పాటు బస్‌డిపో ఏర్పాటు లాంటి సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు మడత వెంకట్‌గౌడ్, దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, కొక్కు నాగేశ్వరరావు, బానోతు హరిసింగ్ నాయక్, అక్కిరాజు గణేష్, లకావత్ దేవీలాల్ నాయక్, కనగాల పేరయ్య, సుధీర్‌తోత్లా, మండల రాము, బోళ్ల సూర్యం, సూర్నబాక సత్యనారాయణ, బి. లాల్ సింగ్ నాయక్, భావ్‌సింగ్ నాయక్, బానోతు స్వామినాయక్, తోటలలిత శారధ, కొక్కు సరిత తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ భర్తీలో కేసీఆర్ మార్కు..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకేవిధంగా ఆలోచనలకు పదునుపెడుతున్నారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై కూడా ఎంతో ఆచూతూచి నిర్ణయం తీసుకుని మరోసారి తన మార్కు రాజకీయాన్ని చూపించారు. దీనిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మండలి స్థానాల భర్తీలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు గిరిజన నేత, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గిరిజన జిల్లా మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో సొంతం గెలుచుకోవాలన్న ఆలోచనతోనే స్థానిక నాయకురాలైన సత్యవతికి కేసీఆర్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్లతో సహా ఎంతో మంది నేతలు తీవ్రంగా పోటీపడ్డారు. మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన తకెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, నాగుర్ల వెంకటేశ్వరరావు సీటు ఆశించారు. కానీ వీరందరినీ కాదని మహబూబాబాద్ స్థానిక గిరిజన నాయకురాలైన సత్యవతి రాథోడ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. గిరిజన సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసమే స్థానిక నాయకురాలకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సంస్థాగతంలో పట్టున్న కాంగ్రెస్‌కు చెక్‌పెట్టాలనేదే కేసీఆర్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గిరిజన నేత కావడం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఆమెకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ సీటు కోసం సత్యవతి తీవ్రంగా పోటీపడిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు సీటు దక్కింది. రెడ్యా నాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడు సత్యవతి రాథోడ్ రాజకీయ భవిష్యత్తుపై ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ మాట నిలుపుకున్నారు. కాగా ఆమె ఎంపిక వూహాత్మకంగానే జరిగినట్లు జిల్లాలోనే నేతల మధ్య చర్చజరుగుతోంది. కాగా ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీకి, రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోస్థానాన్ని ఎంఐఎంకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. -
తొలి మహిళా లోకో పెలైట్
కూత పెడుతూ పట్టాల వెంట పరుగులు తీసే రైలు ఎక్కడమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అలాంటివారిలో సత్యవతి ఒకరు. కానీ ఆమెకు మాత్రం రైలు ఎక్కడంతో పాటు దాన్ని నడపాలన్నది కల. ఆనాటి స్వప్ననాన్ని ఇప్పుడు నిజం చేసుకుని కుటుంబ బండిని గాడి తప్పకుండా నడిపించే మహిళ రైలుబండిని సైతం పట్టాలపై పరుగులు తీయంచగలదని నిరూపించి చరిత్ర సృష్టించారు సత్యవతి. దక్షిణమధ్య రైల్వేలోనే తొలి మహిళా లోకో పెలైట్ ఆమె. బోగీల్లో నిశ్చింతంగా కూర్చున్న వేలాది మంది ప్రయాణికుల భద్రతే ఆ క్షణాన ఆమెకు ప్రాణప్రదం. విజయపథంలో దూసుకుపోతోన్న సత్యవతి నగరంలో ఎంఎంటీఎస్ రైలు నడుపుతున్నారు. ‘రైలు నడపాలనే’ ఆశయంతోనే ఈ రంగంలోకి ప్రవేశించారు. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను చూసిన ప్రయాణికులు ప్రశంసిస్తున్నారని, అవే తనకు అవార్డులని ఆనందం వ్యక్తం చేశారు. -
రచ్చబండలో ఎమ్మెల్యేని అడ్డుకున్న సమైక్యవాదులు