
సాక్షి బళ్లారి: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ మస్కి నియోజకవర్గంలో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం ఉగాది సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తాండాల్లో ఇంటింటా కలియతిరుగుతూ తాండా భాషలో మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల.. ‘‘కన్నే అదిరింది అనే పాట’’ కన్నడిగులను కూడా కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో మంగ్లీకి ఇటీవల కర్ణాటకలో కూడా విశేష ఆదరణ లభించడంతో ఆమెను ప్రచారంలోకి దింపారు. ప్రవాసాంధ్ర క్యాంపులతో పాటు మస్కి పట్టణంలో కూడా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.
పార్టీ విజయానికి కృషి చేయండి
రాయచూరు రూరల్: మస్కి ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ సూచించారు. ఆయన సోమవారం సాయంత్రం ముదుగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. రైతులకు ఉపయోగపడే ఎన్‌ఆర్‌బీసీ 5ఏ ఉప కాలువను నిర్మిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment