
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. భగవంతుడే స్వయంగా వచ్చినా బెంగళూరు నగరం బాగుచేయలేడంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఇటు నగరవాసులు.. అటు రాజకీయ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి.
‘బెంగళూరు నగరాన్ని రాత్రికి రాత్రే మార్చేయలేం. ఈ మహా నగరం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో మారదు. ఒకవేళ దేవుడే తల్చుకున్నా(Even God) అది సాధ్యపడదు. నగరాన్ని బాగు చేయాలంటే.. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అది జరగాల్సిందే తప్ప మరో మార్గం లేదు’’ అని శివకుమార్ ఓ వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించారు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరులో ట్రాఫిక్‌జామ్(Bengaluru Traffic Troubles) వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోవడంతో.. పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయానా డిప్యూటీ సీఎం నెగెటివ్ కామెంట్లు చేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రకటించారే తప్ప.. వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, ఆరిన్ కాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పై(Mohan Das Pai) డీకేఎస్ స్టేట్‌మెంట్‌పై ఫైర్ అయ్యారు.
‘‘శివకుమార్‌గారూ.. మీరు మంత్రి అయ్యి రెండేళ్లు కావొస్తోంది. ఒక బలమైన నేతగా మీకు ఆహ్వానం పలికాం. కానీ, మా బతుకులు మరింత హీనంగా తయారవుతున్నాయి’ అంటూ ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. అలాగే.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయని అంటున్నారాయన. ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరిపడా లేదని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, నగరానికి సుమారు 5,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు.
Minister @DKShivakumar it has been 2 years since you became our Minister! We applauded and welcomed you as a strong Minister.But our lives have become much worse!Big projects announced!Will take very long and delayed as govt has not completed any project in city on time!
Why… https://t.co/32Kqkzrviv— Mohandas Pai (@TVMohandasPai) February 20, 2025
ఇక రాజకీయంగానూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘బ్రాండ్ బెంగళూరు’’ అంటూ నినాదం ఇచ్చిన వ్యక్తి.. ఇవాళ దేవుడు కూడా సరి చేయలేడంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ అంటోంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇసతే.. ఈ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని బీజేపీ నేత మోహన్ కృష్ణ విమర్శించారు. అయితే విమర్శల నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు సమస్యలను పరిష్కరించే బాధ్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యను తప్పించే ప్రణాళికతో కూడిన హ్యాండ్‌బుక్‌ను రిలీజ్ చేశామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment