traffic troubles
-
తుళ్ళూరులో తొలగని ట్రా‘ఫికర్’
తుళ్ళూరు రూరల్: రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తొలగేటట్లు కన్పించడంలేదు. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రకటన వెలువడడంతో ట్రాఫిక్ సమస్య తెరపైకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరగడం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల రాకపోకల తాకిడి అధికం కావడంతో రద్దీ ఎక్కువైంది. తుళ్ళూరులోని లైబ్రరీ సెంటర్, మందడం, తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్లలో రోడ్డు దాటాలంటే పడే అవస్థ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 22న జరిగిన రాజధాని శంకుస్థాపన సందర్భంగా రోడ్ల విస్తరణ పనులు ప్రభుత్వం చేపట్టింది. ట్రాఫిక్ కష్టాల నివారించేందుకు కొత్తగా రోడ్ల నిర్మాణం జరిపింది. ఇందులో భాగంగా రాయపూడి-తుళ్ళూరు మధ్య వడ్డగిరి దగ్గరి నుంచి అమరావతి వైపుకు వెళ్ళేందుకు వీలుగా కొత్తగా ైబె పాస్ రోడ్డు నిర్మించారు. దీంతో వాహనాల మళ్ళింపుతో తుళ్ళూరులో ట్రాఫిక్ కష్టాలు తొలుగుతాయని అందరూ భావించారు. కానీ అలా జరగక పోగా, తీవ్రతరమయ్యాయని ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ,అమరావతి వైపు నుంచి రాకపోకలు సాగించే లారీలను, వాహనాలను తుళ్ళూరు వద్ద నుంచి దారి మళ్లీంచాలని స్థానికులు కోరుతున్నారు. -
సెన్సర్ చెక్!
ఐఐటీఎంఎస్ విధానంలో సిగ్నల్స్ 68 జంక్షన్లలో ‘బెల్’ సర్వే 4 25 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం సిగ్నల్స్‌తో సీసీ కెమెరాల అనుసంధానం 4 ప్రభుత్వానికి ప్రతిపాదనలు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు సెన్సర్ విధానం ద్వారా చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని విజయవాడలోనూ అందుబాటులోకి తేనున్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇది అందుబాటులోకి రానుంది. విజయవాడ సిటీ : రాజధాని నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పొరుగు ప్రాంతాలకు చెందిన వాహనాల రాకపోకలు కూడా గతం కంటే 50 శాతం మేర పెరిగాయి. ఇక్కడున్న ట్రాఫిక్‌కు తోడు బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లాలంటే అరగంట పైనే పడుతోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టం) విధానంలో సెన్సర్ పద్ధతిలో సిగ్నల్స్ పనిచేసేలా సమగ్ర ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్‌లో పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ రూ.75 కోట్ల వ్యయంతో 200 సిగ్నల్ జంక్షన్లను ఆధునీకరించనున్నారు. విజయవాడలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు సర్వే జరిపి 68 జంక్షన్లలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆవశ్యకతను గుర్తించారు. వాటిలో ముఖ్యమైన 25 ప్రాంతాల్లోని సిగ్నల్స్లోనే సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. బెల్ అధికారుల సర్వే ఆధారంగా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే సెన్సర్ విధానంలో సిగ్నల్ వ్యవస్థను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సీఎం సుముఖం ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నారు. రాజధాని కావడంతో మంత్రులు, వారి శాఖల కార్యాలయాలు ఇక్కడికి తరలి రానున్నాయి. అదే జరిగితే ప్రస్తుత విధానంలో మరిన్ని ట్రాఫిక్ కష్టాలు తప్పవు. దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కూడా దీనిపై సుముఖంగా ఉండటంతో త్వరలోనే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఈ విధానం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొంటున్నారు. -
ఇక.. నాలుగు లేన్ల రోడ్లు
=భీమారం నుంచి అన్నాసాగర్ వరకు.. =కేయూ నుంచి పెద్దమ్మగడ్డ వరకు.. =కడిపికొండ వద్ద 10 మీటర్ల రోడ్డు =రూ.57 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు వరంగల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న ప్రధాన రోడ్లను విస్తరించనున్నారు. ఇప్పటి వరకున్న ఇరుకు రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.57 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి ఆమోదించి.. సీఎం పేషీకి పంపించారు. దీంతో త్వరలోనే వీటికి అనుమతి లభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిధులకు ఒకే చెప్పిన నాలుగైదు నెలల్లోనే ఇప్పుడున్న రోడ్లు నాలుగు లేన్ల రోడ్లుగా రూపాంతరం చెందనున్నాయి. దీంతో రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ప్రమాదాలు తగ్గనున్నాయి. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కాకతీయ యూనివర్సిటీ క్రాసింగ్ నుంచి ములుగురోడ్డు(పెద్దమ్మగడ్డ) వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనికి కూడా త్వరలోనే అనుమతి రానుంది. ఎక్కడెక్కడంటే.. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే రహదారిని మడికొండ నుంచి కాజిపేట వరకు 13 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. మొత్తం 13 కిలోమీటర్ల ఈ రోడ్డు ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచనున్నారు. అరుుతే ఇందుకు భూ సేకరణ మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు 5 మీటర్ల వరకు అదనంగా ఉందని, దీనిలో 3 మీటర్లు తీసుకుని 10 మీటర్ల రోడ్డుగా నిర్మాణం చేయనున్నట్లు ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం 13 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లను వెచ్చించనున్నారు. జిల్లా దాటి కరీంనగర్ జిల్లాలోకి అడుగు పెట్టే ప్రధాన రహదారిని సైతం విస్తరించనున్నారు. భీమారంలోని 115వ మైలురాయి నుంచి 124వ మైలురాయి వరకు ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా మార్చనున్నారు. ప్రధాన నగరాలకు అవసరమయ్యే ఈ రోడ్డు విస్తరణ అత్యంత ప్రాముఖ్యమని నివేదికల్లో పేర్కొన్నారు. మొత్తం 9 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చేందుకు రూ.21 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సర్వేలో గుర్తించారు. విస్తరిస్తే ప్రమాదాలను తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వానికి వివరించారు. ఇక ములుగు, ఏటూరునాగారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఔట్ సిటీ రోడ్డును ఆర్అండ్బీ ఆధ్వర్యంలో విస్తరించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ములుగు రోడ్డుకు కలుపుతూ ఉన్న రోడ్డును ఫోర్‌లేన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 5 కిలోమీటర్ల ఈ రోడ్డును రూ.16 కోట్లతో నిర్మించనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. నిధులు త్వరలోనే వస్తాయి : మోహన్ నాయక్, ఎస్ఈ ఆర్అండ్బీ వరంగల్ ఈ రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రెండు నెలల కిందటే పంపించాం. రూ.57 కోట్లతో ఈ రోడ్లను విస్తరించడం అనివార్యం. త్వరలోనే వీటికి సంబంధించిన నిధులు విడుదల కానున్నట్టు సమాచారం వచ్చింది.