
సాక్షి, హైదరాబాద్: రేడియోలో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు. తన సుస్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం తిరుమల్‌గిరి శ్మశాన వాటికలో మాడపాటి సత్యవతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన గాత్రంతో న్యూస్ రీడర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యవతి 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళ పురస్కారం అందుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
మాడపాటి సత్యవతి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి మహిళా న్యూస్ రీడర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యవతికి విజయవాడతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment