National Integration Day
-
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
కిషన్‌రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండకూదు అంటూ కేటీఆర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt That's why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS — KTR (@KTRTRS) September 17, 2022 ఇదిలా ఉంటే.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణను మలినం చేసే కుట్ర జరుగుతోంది -
Telangana: విలీనం.. విమోచనం.. సమైక్యత!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి. నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. నిజాం అరాచకాల నుంచి సర్దార్ వల్లభాయ్‌పటేల్ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది. విలీనం, విమోచనం కాకుండా టీఆర్ఎస్ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. వామపక్షాలు దీన్ని విలీనంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు. వామ పక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
...ఇవి సమైక్యత వజ్రోత్సవాలు.. లేదు లేదు విమోచన దినోత్సవాలు!
అటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు.. ఇటు విమోచన దినోత్సవాలు.. అయోమయంలో తెలంగాణ -
జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చదవండి: హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది? -
సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?
‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ. 1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్‌ప్రముఖ్‌ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్‌షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?) తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది. తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి ఎడిటర్స్ మీట్లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్‌తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్‌ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని. - తెలకపల్లి రవి సీనియర్ జర్నలిస్ట్ -
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
17 జాతీయ సమైక్యతా దినం
-
యువత చేతుల్లోనే జాతీయ సమైక్యత
విశాఖ స్పోర్ట్స్: జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విశాఖ సాగర తీరంలోని వుడా పార్క్ రింక్‌లో ఏర్పాటు చేసిన 57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న స్కేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది క్రీడల ద్వారా వస్తుందన్నారు. యువత తమ చుట్టూ ఉండే సమాజం పట్ల అవగాహన కలిగిఉండాలని ఉద్భోద చేశారు. ఇప్పటికే కాడెట్ నేషనల్స్ పూర్తి కాగా గురువారం నుంచి జూనియర్ నుంచి సీనియర్స్ కేటగిరీల్లో స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్‌హాకీ, ఇన్లైన్ హాకీ, ఇన్లైన్ ఫ్రీస్టయిల్, స్కేట్‌బోర్డ్, రోలర్ ఫ్రీస్టయిల్ తదితర అంశాల్లో పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల్లోనే రూ. రెండు కోట్లు క్రీడాకారులకు నజరానాగా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతహాగా క్రీడాకారుడు కావడంతో క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తున్నారన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, స్కేటింగ్ సమాఖ్య ప్రతినిధులు తులసీరామ్, నరేష్కుమార్, టోర్నీ నిర్వాహక కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ టెన్నిస్ పోటీలు ప్రారంభం విశాఖ వేదికగా 20వ ఆలిండియా పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ కాపాడటంలోనే కాకుండా విశాఖ నగరాన్ని అందంగా ఉంచేందుకు పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. తొలుత నగర సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ దేశంలోని 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్, అదనపు డీజీపీ ఎన్.శ్రీధర్‌రావు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జాతీయ సమైక్యతా దినంపై వివాదం!
పటేల్ జయంతిని సమైక్యతా దినంగా ప్రకటించిన కేంద్రం ఇప్పటికే ఇందిర జయంతిని ఈ రోజుగా పాటిస్తున్న దేశం న్యూఢిల్లీ/ముంబై: ఉక్కుమనిషి, దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19ని ఇప్పటికే జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారే అవకాశముంది. పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినంగా(రాష్ట్రీయ ఏకతా దివస్)గా నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతముందు ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబైలో విలేకర్లతో మాట్లాడుతూ.. పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న ‘జాతీయ సమైక్యతా పరుగు’ (రన్ ఫర్ యూనినిటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పటేల్ సందేశాన్ని ఘనంగా చాటేందుకే దీన్ని చేపడుతున్నామని, ఇందులో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొంటారని తె లిపారు. ‘సర్దార్ పటేల్ దేశానికి చేసిన నిరుపమానమైన సేవల గురించి నేటి సమాజానికి అవగాహన తక్కువే. ఇది చాలా దురదృష్టకరం. ఇటీవలే నేను పదో తరగతి చరిత్ర పుస్తకాన్ని చూశాను. అందులో పటేల్ ప్రస్తావనే ఒకే ఒక్కసారి ఉంది’ అని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక 1947-1949 మధ్య పటేల్ 500 సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దీన్ని సంస్మరించుకునేందుకే జాతీయ సమైక్యతా దినం పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.