trs sabha
-
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
సభకు వెళ్లేదెలా!
సాక్షి, ఆదిలాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యం.. వారిని కొంగరకలాన్‌కు ఎలా తరలించాలన్నదే ఇప్పుడు సవాల్.. సెప్టెంబర్ 2న నిర్వహించే సభ ఎలా విజయవంతం చేయాలనేదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతల ముందున్న లక్ష్యం.. ఉమ్మడి జిల్లాలో మూడోంతుల ఆర్టీసీ బస్సులను ఇప్పటికే బుక్ చేసుకున్నా అందులో లక్ష్యంలో ఒక వంతును కూడా తరలించలేని పరిస్థితి. మరి మిగతా జనాన్ని అక్కడికి ఎలా చేర్చేది.. ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీ వాహనాలను వేలాదిగా సమకూర్చాల్సిన బాధ్యత. టీఆర్ఎస్ జిల్లా పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారమే ఆర్టీసీ బస్సులు పోనూ ఇంకా 2వేల బస్సులు, 5వేలు ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు అవసరం.. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనిపించిన వాహనాలను ఎంగేజ్ చేసేసుకుంటున్నారు. 415 ఆర్టీసీ బస్సులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 415 ఆర్టీసీ బస్సులను టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం బుక్ చేసుకున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రమే కొంగరకలాన్‌కు తరలనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు 627 ఉండగా, అందులో సుమారు మూడంతుల బస్సులు ఆ రోజున సభకు తరలనున్నాయి. ప్రధానంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లాంటి బస్సులు అటు వెళ్తుండడంతో ఆ రోజు సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులే అధికంగా తిరుగుతాయి. దీంతో సెప్టెంబర్ 2న ప్రయాణికులు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. కాగా, ఒక్కో బస్సులో 50 మంది చొప్పున బుకింగ్ చేసుకున్న బస్సుల్లో 20వేలకు పైగా జనం అక్కడికి వెళ్లనున్నారు. ఒక్కో బస్సుకు కిలోమీటర్‌కు రూ.43 చొప్పున చెల్లించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ సభకు వెళ్లేందుకు సుమారు 300 కిలోమీటర్ల దూరభారం పడుతుంది. అప్‌అండ్‌డౌన్ కలిసి 600 కిలోమీటర్ల చొప్పున ఆర్టీసీకి కిలోమీటర్‌కు చెల్లించే రుసుము లెక్క కట్టినా రూ.కోటి పైబడుతుంది. దీంతో ప్రగతి నివేదనకు టీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీసీకే రూ.కోటి చెల్లించే పరిస్థితి ఉండగా, మిగతా వాహనాల పరంగా చూస్తే సుమారు రూ.5 కోట్లకు పైబడే రవాణాకు వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ వాహనాల ఎంగేజ్.. ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ దిశగా ఉమ్మడి జిల్లాలో జన సమీకరణ విషయంలో దిశానిర్దేశం కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లోక భూమారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని జనసమీకరణ కోసం నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా పార్టీ అంచనా ప్రకారమే 2వేల బస్సులు, 5వేల ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు అవసరం కాగా, ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ రోజు కోసం వాహనాలను ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా రైలు మార్గం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా నియోజకవర్గాల్లో వాహనాలను సమకూర్చుకోవాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కారు అడ్డాపై సుమారు 200 వరకు ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు ఉండగా, ఇప్పటికే 150కి పైగా టీఆర్ఎస్ నేతలు బుకింగ్ చేసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రైవేట్ వాహనాలు అధికంగా లేకపోవడంతో ఆదిలాబాద్ నుంచే ఈ వాహనాలను మాట్లాడుకుంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో వారు సమీప పట్టణ ప్రాంతాల్లోని వాహనాలను బుకింగ్ చేసుకుంటున్నారు. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటం, మళ్లీ వాహనాలు దొరుకుతాయో లేవోనన్న ఆందోళనలో వారు కొంత ఎక్కువమొత్తం ఇచ్చి కూడా వాహనాలను బుకింగ్ చేసుకుంటుండడంతో ప్రైవేట్ వాహన యజమానులకు కొంగరకలాన్ కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ఖర్చు మోపెడు.. ప్రగతి నివేదన సభకు కార్యకర్తలను తరలించే విషయంలో రవాణా ఖర్చు ఒక ఎత్తు కాగా, ఇప్పుడు వారికి టిఫిన్, భోజనాలు, ఛాయ్, పానీ ఖర్చులు మోపెడయ్యే పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయమే వాహనాలు బయల్దేరుతాయి. ఈ భారాన్ని ఎమ్మెల్యేల భుజాననే వేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో నియోజకవర్గం వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి 10వేల మందిని పెట్టుకున్నా సుమారుగా రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఏదేమైనా కొంగరకలాన్ టెన్షన్ ఇప్పుడు నేతల మదితొలుస్తోంది. సమన్వయం చేస్తున్నాం హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గం వారీగా నేతలను సమన్వయం చేసి నియోజకవర్గం నుంచి పది వేలకు తగ్గకుండా ప్రజలను తరలించనున్నాం. – లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు -
చరిత్ర సృష్టించేలా ప్రగతి నివేదన సభ
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభ దేశంలోనే చరిత్ర సృష్టిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని సభాస్థలాన్ని చదును చేసే పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సేవలను ఇక్కడ వివరిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించాడన్నారు. 25 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి సత్తా చాటుతామని నాయిని చెప్పారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది టీఆర్ ఎస్ సర్కార్ మాత్రమేనని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి మైనార్టీ హాస్టళ్లను ప్రారం భించిందని, 50 వేల మంది పిల్లలు నేడు హాస్టళ్లల్లో చదువుతున్నారనితెలిపారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ సభ జరగబోతోందన్నారు. సెప్టెంబర్ 2న ఉప్పొంగే జనసంద్రానికి ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు. -
అన్ని దారులూ పట్నంవైపే..
- టీఆర్ఎస్ సభకు భారీగా తరలిన కార్యకర్తలు - స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు - పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల బుకింగ్ సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభ కావడంతో జిల్లా నుంచి గులాబీదండు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లింది. సోమవారం జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా నుంచి జనం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. స్వయంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డా.సి.లకా్ష్మరెడ్డిలు జిల్లాలో మకాం వేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున ఉపయోగించుకున్నారు. జిల్లా మొత్తం మీద లక్షన్నరకు పైగానే జనం తరలివెళ్లారు. దీంతో జిల్లాలోని అన్నిదారులు కూడా హైదరాబాద్ వైపే కదలాయి. మరోవైపు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మందికి పైగానే.. హైదరాబాద్‌కు పక్కనే ఉండడంతో జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని పైస్థాయి నుంచి ఉన్న ఆదేశాల మేరకు ముఖ్యనాయకులు పక్కా ప్రణాళిక రచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి వందల సంఖ్యలో వాహనాలను కేటాయించారు. దిశా నిర్దేశం ఇవ్వడం కోసం మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు ఎక్కడిక్కడ బాధ్యతలు అప్పగించి సక్సెస్ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమీటీలు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు అందరినీ భాగస్వామ్యం చేశారు. కొన్నిచోట్ల పైస్థాయిలో మెప్పు పొందేందుకు నాయకులు హొరాహోరీగా జన సమీకరణ చేపట్టారు. మరోవైపు త్వరలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. సీటు పొందేందుకు ఎమ్మెల్సీ ఆశావహుల పోటీపడ్డారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్ తదితర నాయకులు జనసమీకరణలో చురుగ్గా వ్యవహరించారు. ఆర్టీసీ బస్సులన్నీ అటువైపే.. జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నీ టీఆర్ఎస్ మహాసభకు కదలాయి. జిల్లాలో ఆర్టీసీకి 900 బస్సులున్నాయి. వీటిలో దాదాపు 612 బస్సులను టీఆర్ఎస్ సభకు జనాన్ని తరలించడం కోసం ఉపయోగించారు. దీంతో జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్క నాగర్‌కర్నూల్ డిపోకు మొత్తం 82 బస్సులుంటే టీఆర్ఎస్ సభ కోసం 70 బస్సులను వినియోగించారు. బస్సుల కొరత కారణంగా దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నిత్యం 40 బస్సులు 80 ట్రిప్పులు వెళ్లేవి. టీఆర్ఎస్ మహాసభ కారణంగా పదిహేను బస్సులకు మించి తిరగలేదు. రాయిచూరు, తాండూరు, పరిగి, శ్రీశైలం ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. నియోజకవర్గాల వారీగా బస్సుల కేటాయింపు.. మహబూబ్‌నగర్-100, నారాయణపేట-96, షాద్‌నగర్-70, కల్వకుర్తి-75, నాగర్‌కర్నూల్-70, అచ్చంపేట-51, కొల్లాపూర్-55, వనపర్తి-40, గద్వాల్-51, ఇవిగాక కొండగల్, మక్తల్ నియోజకవర్గాలకు తాండూరు, పరిగి, వికారాబాద్ డిపోలకు చెందిన దాదాపు 100 బస్సులను కేటాయించారు. -
భారీగా జన సమీకరణ
- టీఆర్ఎస్ సభకు జిల్లా నుంచి లక్ష మందిని తరలిస్తాం - త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ - తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల ఉనికి గల్లంతు తాండూరు: హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరులోని తన నివాసంలో జన సమీకరణ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 24న జరిగిన ప్లీనరీ విజయవంతమైందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు అధిష్టానం జన సమీకరణ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొన్నారు. పది నెలల టీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలు గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు, అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం గుజరాత్, తెలంగాణ ధనవంతమైన రాష్ట్రాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలబెట్టాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం, విద్యుత్ సమస్యలు వస్తాయని చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌లు విమర్శలు చేశారని, విమర్శలు చేసినవారే ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేశామని, భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే 20 ఏళ్ల వరకు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని మంత్రి జోస్యం చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో ఉనికి గల్లంతు కావడం ఖాయమన్నారు. ఆ పార్టీలకు కార్యకర్తలు, నాయకుల లేరన్నారు. త్వరలోనే మార్కెట్ కమిటీ, దేవాదాయ తదితర నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ జనసమీకరణకు సుమారు 500 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అగ్గనూర్ జగదీశ్వర్, జుబేర్‌లాల, నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, అబ్దుల్ రవూఫ్‌లు పాల్గొన్నారు. -
కేసీఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు
మెదక్, న్యూస్‌లైన్: గుంట భూమి లేక గంజి నీళ్లు తాగుతున్న మాకు ప్రధాన మంత్రి భూములిస్తే మా బతుకులు మారుతాయనుకున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని రాళ్ల భూమిని రతనాలుగా మార్చినాం. తీరా పంటలు చేతికొచ్చాక నోటికాడి బువ్వను గద్ద తన్నుకు పోయినట్లు.. రజాకార్లోలె జంగ్లాతోళ్లు పొలాల మీద బడ్డరు. ఈ భూమి మాదంటూ కేసులు బెట్టిండ్రు.. గరీబులని సూడకుండా జరిమానాలేసిండ్రు. కనిపించిన నాయకుని కాళ్లు మొక్కినం.. ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసినం. తొమ్మిదేళ్లవుతోంది. ఓట్లు వస్తున్నయ్,, పోతున్నయ్.. కాని మా పంచాయితీ తెగలేదు. మా పాణాలైన ఇస్తం కాని మా భూములు మాత్రం విడిచి పెట్టం’ అని అంటున్నారు గిరిజనులు. వివరాల్లోకెళ్తే.. మెదక్ మండలం తొగిట పంచాయతీ పరిధిలోని సుల్తాన్పూర్ తండా అది. పేరులోనే సుల్తాన్ ఉన్నా.. వారంతా గుంట భూమి లేని గరీబు గిరిజనులే. కాయకష్టం చేసుకుని బతుకులీడ్చే 90 మంది గిరిజనులకు 372,367 సర్వే నంబరులో గల 180 ఎకరాల భూమిని 2005లో ప్రధానమంత్రి చేతుల మీదుగా పంచిపెట్టారు. ఈ మేరకు పట్టాదార్ పాసుబుక్కు లిచ్చారు. ఇందిర జలప్రభ, సీఎల్డీపీ పథకాల కింద బోర్లు వేసి భూ అభివృద్ధి చేశారు. బీడు భూమిని బంగారు భూమిగా మార్చారు. కాని అందులోని 14 మంది గిరిజన కుటుంబాలను మాత్రం దురదృష్టం వెంటాడింది. శాంతి, సేవి, బుజ్జి, చందర్, విఠల్, రాంకీ, కమ్లీ తదితరుల పంటలు చేతికొచ్చే సమయానికి జంగ్లాతోళ్ళు ఊడిపడ్డారు. ‘ఈ భూమి జంగ్లాత్(ఫారెస్ట్)ది. మీరు మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు’ అంటు కేసులు పెట్టారు. ఆంతటితో ఆగక రూ 24 వేల నుంచి 30 వేల వరకు జరిమానాలు వేశారు. సాక్షాత్తూ ప్రధాని మంత్రి మన్మోహన్సింగ్ అందజేసిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను చూపించినా వారు వెనక్కితగ్గలేదు. దీంతో కళకళ లాడిన ఆ 28 ఎకరాల భూమి బీళ్లుగా మారింది. ఇక ఆ గిరిజనులు కనిపించిన అధికారులను, నాయకులను వేడుకున్నా వారి వేదన అరణ్య రోదనే అయ్యింది. తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ వారి సమస్యకు పరిష్కారం అభించలేదు. ‘మళ్ళీ ఎన్నికలు వచ్చినయ్. కొత్త ఎంపీలు..ఎమ్మెల్యేలు వస్తరేమో.. కనీసం ఇప్పటికైనా మా బతుకులు మరుతాయా’ అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మా సమస్య తీర్చేవారికే ఓటేస్తం. లేకుంటే తండా పొలిమేరల్లోకి రానివ్వమంటూ తమ అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.