సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాగా, తెలంగాణలో అధికారం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితమే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి అమిత్ షా.. తెలంగాణకు రానున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినం సందర్భంగా అమిత్ షా తెలంగాణకు వస్తున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా, విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఏడాదిపాటు విమోచన దినోత్సవ అమృతోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు. భారతదేశంలో విలీన దినోత్సవంగా నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోంది. కాగా, తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్‌ను పెంచింది.
తరుణ్‌చుగ్ తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కోర్ కమిటీలతో తరుణ్‌చుగ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజాసమస్యల పోరాటాలు, ర్యాలీపై సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు ప్రధాని వ్యాఖ్యలను దిగజారుస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment