సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల వార్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కాగా, గ్రౌండ్‌లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా.. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం విచ్చేయనున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్, ఎంఐఎం మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి: 16న హైదరాబాద్‌కు అమిత్‌షా
Comments
Please login to add a commentAdd a comment