సాక్షి, హైదరాబాద్ : సినిమాలో భారీ డైలాగులు పేల్చే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. నగరంలో టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న బాలయ్య ఏకంగా సీఎం కేసీఆర్‌కు సవాళ్లు విసురుతున్నారు. సోమవారం గడ్డి అన్నారంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి భారీ డైలాగులు పేల్చారు. ‘ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానన్నావు కదా.. ఏపీకి రా చూసుకుందాం’ అంటూ పరుష పదజాలంతో కేసీఆర్‌కు సవాలు విసిరారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment