సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినా రిమోట్ మాత్రం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఆయన కుటుంబ ఆస్తులు 400 శాతం పెరిగాయని, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా నగరంలోని జూబ్లీహిల్స్‌లో రాహుల్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment