jubleehills
-
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్స్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్ చేస్తూ జాబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఇక, ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిద్దరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కారు డ్రైవ్ చేసిన సాకేత్ రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. -
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్న సమయంలో జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఫ్లోర్లో సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు. దాంతో సాష్ట్‌వేర్ ఉద్యోగులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పినట్లు సమాచారం. -
HYD: బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్య రావుపై కొందరు మహిళలు దాడి చేశారు. వారి దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మాగంటి గోపినాథ్ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. #Hyderabad: Jubilee Hills BRS Corporator Attacked Over Flex Controversy Dedeepya Rao, #BRSParty corporator from Vengala Rao Nagar, faced assault by women amid a dispute over flexes. She & her husband Vijay Mudiraj filed a complaint with the Jubilee Hills police. pic.twitter.com/dE7nLpd5cr — Informed Alerts (@InformedAlerts) March 13, 2024 -
పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?
సాక్షి, హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆదాయపన్నుల విభాగం(ఐటీ) సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం అధికారులు తమ వెంట కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో రెండు బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోని ఓ రూంలో అధికారులు చాలాసేపు ఉన్నారు. ఆఖర్లో ఆ గది నుంచి మూడు బ్యాగులు, బ్రీఫ్ కేసు, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవా ప్రైడ్ ఆఫీస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, లాంకోహిల్స్, రాయదుర్గం, బషీర్‌బాగ్ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో ఈ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ ఈ ఐటీ రైడ్స్‌ను ప్రతీకార రాజకీయ చర్యగా అభివర్ణించింది. తాను నామినేషన్ వేసిన సమయంలోనే ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, అధికారులు తమల్ని ఇబ్బందిపెట్టారంటూ సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
మాజీ ఐఏఎస్, కవి జె.బాపురెడ్డి కన్నుమూత
సిరిసిల్ల కల్చరల్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జె.బాపురెడ్డి(86) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బాపురెడ్డి భార్య పదేళ్ల క్రితం కాలం చేశారు.బాపురెడ్డి ఇల్లంతకుంట మండలం సిరికొండకు చెందిన జంకె కృష్ణారెడ్డి, రామలక్ష్మి దంపతులకు 1936, జూలై 21న జన్మించారు. సినారె స్ఫూర్తితో 8వ ఏట నుంచి రచనలు చేశారు. పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం వంటి సాహితీ విభాగాల్లో రాణించారు. 36 పుస్తకాలు రచించారు. చైతన్యరేఖలు, రాకెట్ రాయబారం వంటి గేయసంపుటాలు, ‘మనసులో మాట’వ్యాససంపుటి, ప్రణవ ప్రణయం, రంగురంగుల చీకట్లు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు, ఆంగ్లంతోపాటు పలు భారతీయ భాషల్లోకి సైతం ఆయన పుస్తకాలు అనువాదమయ్యాయి. ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ‘మన చేతుల్లోనే ఉంది’గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారంతో సత్కరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రుడయ్యారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో చేరి మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం స్పెషల్ అసిస్టెంట్‌గా, భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పరిశ్రమల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఏపీపీఎస్సీ సభ్యుడిగా విధులు నిర్వహించారు. పరిశ్రమల శాఖలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా పేరుగాంచారు. ప్రపంచ పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఆయన 37 దేశాల్లో పర్యటించారు. బాపురెడ్డి మరణంపై సాహితీవేత్తలు దిగ్భ్రాంతి చెందారు. సాహితీవేత్తలు బీఎస్ రాములు, డాక్టర్ పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ ‘తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ'గా మారింది..
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఒక్క తెలంగాణలోనే రోజుకు ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాం«దీభవన్‌లో చేపట్టిన మౌనదీక్షలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డిసౌజా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పారీ్టగా మారిపోయిందని, ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలిక రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడి ప్రమేయం చూస్తే తెలంగాణలో పాలిటిక్స్ గూండాగిరీ నడుస్తోందని, మద్యం, డ్రగ్స్ పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, ఆమెకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డిసౌజా చెప్పారు. దీక్షలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నీలం పద్మలతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీజీపీకి వినతిపత్రం: అంతకుముందు మహిళా కాంగ్రెస్ నేతలు డిసౌజా, కొండా సురేఖ, సునీతారావు తదితరులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. -
అసాంఘిక చర్యలకు పాల్పడే పబ్‌లపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్‌లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్‌లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో సుమారు 150 పబ్‌లకు అనుమతినిచ్చారని, పబ్‌ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్‌లు, డ్రగ్ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్‌లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్‌రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో పోలీసులు రాజకీయ పరికరాలుగా మారారని, ముఖ్యమైన వ్యక్తులను రక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. బుధవారం తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జంగిల్‌రాజ్ నడు స్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన, శాంతిభద్రతలు, ఆడపిల్లల సంరక్షణ ఇలా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులిలా ఉంటే రూ.109 కోట్లు ఖర్చుచేసి వార్తాపత్రికల్లో తన ఫొటోతో ప్రకటనలిచ్చి ప్రచారం చేసుకోవడం గర్హనీయమన్నారు. గత ఏప్రిల్ 22 నుంచి మే 31 దాకా 11–17 ఏళ్ల వయసున్న అనేక మంది బాలికలు అత్యాచారానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా స్పందించేందుకు కేసీఆర్‌కు నోరు కూడా రావడం లేదని మండిపడ్డారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై, కేటీఆర్ ట్విటర్‌తో బిజీగా ఉంటే హోంమంత్రి అనే వ్యక్తి అసలు ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి ఉంది’అని ఎద్దేవా చేశారు. ఓ ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగ్గా అది ఏ శాఖది, ఎవరు ఉపయోగిస్తున్నారన్న వివరాలు ఆరా తీయకుండా.. దాంట్లో ఉన్న ఆధారాలను చెరిపేసే కుట్ర జరుగుతోందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రాష్ట్రాన్ని పంచుకున్నాయి: సంజయ్ జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచారం కేసును ౖముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచి్చన ఆదేశాల మేరకే పోలీసులు నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేటీఆర్ ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్‌కే కళ్లు లేవు.. ఇక దోషుల కళ్లేం పీకుతడు?’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పారీ్టలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నాయని, ఎంఐఎం నాయకులు దాడులు చేస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుల పోరాటం వల్లే కేసులు నమోదు చేశారని, బీజేపీ స్పందించకపోతే కేసును మూసేసేవారన్నారు. న్యాయం కోరుతున్న తమ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్ రావులపై కేసు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ధ.. బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టే విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ‘కేసును తప్పు దోవ పట్టించేందుకు ఇందులో హిందువు ఉన్నట్లు మొదటి ఎఫ్ఐఆర్లో సూరజ్ అనే పేరు నమోదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్ధారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసి, నిందితుల జాబితాలో చివరన చేర్చారు’అని చెప్పారు. -
Amnesia Pub Case: జువైనల్ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసు.. రెండు కోర్టుల పరిధిలో.. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఓ చిత్రమైన అంశం వెలుగులోకి వచి్చంది. సాధారణంగా ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. గ్యాంగ్ రేప్ జరిగిన జూబ్లీహిల్స్ ఠాణా నాంపల్లిలోని పదిహేడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఠాణాలో నమోదైన కేసుల విచారణ, నిందితుల హాజరు వంటివన్నీ ఆ కోర్టులోనే జరుగుతాయి. అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులు మాత్రం నాంపల్లి సెషన్స్ కోర్టు పరిధిలోకి వెళ్తాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన వారిని మాత్రం రెండు వేర్వేరు కోర్టుల్లో హాజరుపర్చాల్సి వచి్చంది. ఈ కేసులో పోక్సో యాక్ట్ కూడా ఉండటంతో సాదుద్దీన్‌ను దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మిగతా వారంతా మైనర్లు కావడంతో వారిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువైనల్ జస్టిస్ కోర్టులో హాజరుపర్చారు. వీరి కస్టడీ పిటిషన్లను సైతం పోలీసులు రెండు న్యాయస్థానాల్లో వేర్వేరుగా దాఖలు చేయాల్సి వచ్చింది. రేపటి నుంచి పోలీసు కస్టడీకి.. సామూహిక అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం సాదుద్దీన్‌ను 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పోక్సో కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. పోలీ సులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. నిందితుడిని తీసుకుని పబ్, కాన్సూ బేకరీలతోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. నిందితుడు, మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది తెలుసుకోనున్నారు. నేరం తర్వాత వారు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ నిందితుడిని తీసుకువెళతామని అధికారులు తెలిపారు. నేర నిరూపణలో ఇది కీలకాంశమని వెల్లడించారు. ఇక మరో ఐదుగురు మైనర్ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ వేశారు. పొటెన్సీ టెస్ట్ చేయించి.. గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన ఆరుగురిలో ఒకరే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల ద్వారా పొటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది వైద్యపరంగా నిర్ధారిస్తారు. అభియోగపత్రం (చార్జిïÙట్) దాఖలుకు ఇది కీలకం కావడంతో ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు సాదుద్దీన్ సహా ఆరుగురి గత చరిత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండి ఉంటుందని.. స్వాధీనం చేసుకునేప్పుడు అది లేదని పోలీసులు చెప్తున్నారు. ఓ నిందితుడిని పోలీసులు విచారించిన సమయంలో అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ లేదని, కేవలం తెరలతో కూడిన షీల్డ్స్ ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో కారు అద్దాలపై ఫిల్మ్ ఉండేదా? అనేది నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే.. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఐపీసీలోని 201 సెక్షన్‌ను జోడించాలని భావిస్తున్నారు. కారుపై రాని క్లారిటీ! బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజి్రస్టేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
రొమేనియా బాలికపై అఘాయిత్యం కేసు.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అఘాయిత్యానికి సంబంధించి పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సామూహిక అత్యాచారంలో అతడి పాత్ర లేకున్నా బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద సదరు మైనర్‌పై ఆరోపణలు నమోదు చేశారు. ఇతడితో పాటు పరారీలో ఉన్న మరో బాలుడినీ పట్టుకున్నారు. వీరిని బుధవారం జువైనల్ హోమ్‌కు తరలించనున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగుర్నీ అరెస్టు చేసినట్టయ్యింది. మార్చి 28న మొదలైన పార్టీ కథ.. బెంగళూరులో నివసిస్తున్న ఓ బాలుడు స్కూల్స్ ప్రారంభమయ్యే లోపు హైదరాబాద్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడు. దానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్యతల్ని హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితులకు (మైనర్లు) అప్పగించాడు. అనేక ప్రాంతాలను పరిశీలించిన వీళ్లు ఆమ్నేషియా అండ్ ఇన్సోమ్నియా పబ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయం బెంగళూరు బాలుడికి చెప్పడంతో అతడు తన ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌లో ఏప్రిల్ 19న ‘ఇన్సోమ్నియా కమింగ్ సూన్’అంటూ పోస్టు చేశాడు. ఇక్కడి వాళ్లు ముగ్గురు మైనర్లు కావడంతో పబ్ బుక్ చేయడానికి తమ స్నేహితుడైన ఉస్మాన్ అలీ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన ద్వారా పబ్ మేనేజింగ్ పార్ట్నర్ కునాల్‌ను సంప్రదించి బేరసారాల తర్వాత ఒక్కొక్కరికీ ఎంట్రీ రేటును రూ.1,200 నుంచి రూ.900కు తగ్గించేలా చేశారు. ఇన్‌స్ట్రాగామ్ ద్వారానే అంతా.. తర్వాత బెంగళూరు బాలుడు తన ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌లో ‘ఇన్సోమ్నియా పార్టీ ఆన్ మే 28 ఎట్ 1 పీఎం’అంటూ పోస్టు చేశారు. అక్కడే తన ఫోన్ నంబర్ సైతం ఇవ్వడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అతడి ఫాలోవర్స్ 150 మంది స్పందించి నగదు చెల్లించారు. వీరికి రేటు రూ.1,200 నుంచి రూ.900కు తగ్గిన విషయం చెప్పలేదు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన రొమేనియా బాలికకు బెంగళూరు బాలుడు స్నేహితుడు కావడంతో ఆమె కూడా రూ.1,200 చెల్లించి పారీ్టకి రావడానికి బుక్ చేసుకుంది. గత నెల 25న హైదరాబాద్‌కు వచి్చన బెంగళూరు బాలుడు పబ్‌కు వెళ్లి చూడటంతో పాటు రూ.లక్ష అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇది నాన్ ఆల్కహాలిక్ అండ్ నాన్ స్మోకింగ్ పారీ్టగా ప్రచారం చేశారు. రొమేనియా బాలిక గత నెల 28న బెంగళూరు బాలుడితో కలిసి పబ్‌కు వచి్చంది. అక్కడే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. కొద్దిసేపటికి పబ్‌కు వచి్చన సాదుద్దీన్ సహా మిగిలిన బాలురు వీరిని గమనించారు. పబ్‌లోనే పథకం వేశారు.. పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే రొమేనియా బాలికపై అఘాయిత్యానికి ప్లాన్ వేశారు. ఆమె వద్దకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇది ఇబ్బందికరంగా భావించిన ఆమె, మరో బాలిక బయటకు వచ్చేశారు. వీరి వెనుకాలే సాదుద్దీన్ తదితరులు బయటకు వచ్చారు. మరో బాలిక వెళ్లిపోగా... రొమేనియా బాలికను ట్రాప్ చేశారు. బెంజ్ కారులో బాలిక, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఎక్కారు. దీని వెనుక ఇన్నోవా కారులో డ్రైవర్ జమీల్, సాదుద్దీన్, ముగ్గురు బాలురు అనుసరించారు. బెంజ్ కారులో ఉన్న నలుగురూ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ రెండు వాహనాలు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని కాన్సూ బేకరీ వద్దకు చేరుకున్నాయి. అక్కడ బాలిక ఇన్నోవా కారులోకి మారగా... డ్రైవర్‌తో పాటు మరో బాలుడిని అక్కడే వదిలేశారు. ఓ ఫోన్ కాల్ కావడంతో ఎమ్మెల్యే కుమారుడూ వెళ్లిపోయాడు. సాదుద్దీన్‌తో పాటు మిగిలిన నలుగురు బాలురు రొమేనియా బాలికను పెద్దమ్మగుడి ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సందర్భంలో ఆమె మెడపై గాయాలయ్యాయి. అనంతరం బాలికను పబ్ వద్ద వదిలేశారు. తర్వాత తండ్రికి ఫోన్ చేసిన ఆమె ఆయనతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. రెండురోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు.. ఈ ఉదంతం గత నెల 28న జరగ్గా... 31వ తేదీ వరకు బాలిక విషయాన్ని తండ్రికి చెప్పలేదు. ఆ రోజు తనపై నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని మాత్రమే చెప్పింది. ఆయన ఈ మేరకు డీసీపీని కలిపి ఫిర్యాదు చేశారు. అసభ్య ప్రవర్తన కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరోసా కేంద్రంలో బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో బాలిక సామూహిక అత్యాచారం విషయాన్ని బయట పెట్టడంతో కేసులో ఆ సెక్షన్లు కూడా చేర్చారు. సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు బాలురను పట్టుకుని చర్యలు తీసుకున్నారు. కాగా సోమవారం మేజి్రస్టేట్ ముందు వాంగ్మూలం ఇచి్చన బాలిక బెంజ్ కారులో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించింది. దీంతో ఐపీసీలోని 354, 323తో పాటు పోక్సో యాక్ట్‌లోని 9(జీ) రెడ్‌విత్ 10 సెక్షన్ల కింద అతడిపై ఆరోపణలు నమోదు చేశారు. ఈ బాలుడితో పాటు అత్యాచారం కేసులో పరారీలో ఉన్న మరో బాలుడినీ మంగళవారం పట్టుకున్నారు. హోం మంత్రి మనవడి పాత్ర లేదు: కొత్వాల్ ఈ కేసుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన కేసు కావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో మరో బాలుడిని నిందితుడిగా చేర్చడంలో ఆలస్యమైందని అన్నారు. హోంమంత్రి మనవడి పాత్ర ఏమాత్రం లేదని, ఆ ఆరోపణలు చేసిన వాళ్లు వచ్చి తనకు ఆధారాలు అందిస్తే కచి్చతంగా దర్యాప్తు చేస్తామని స్పçష్టం చేశారు. పబ్ నుంచి బేకరీకి వెళ్లే క్రమంలో, ఆ తర్వాత ఈ రెండు కార్లను మైనర్లు నడిపారని తేల్చామన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కార్లు ఇచి్చన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో నిందితుడు (సాదుద్దీన్), చట్టంతో విభేదించిన బాలురు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టవచ్చనే ఉద్దేశంతోనే బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో వీడియోలు తీసుకున్నారని, వాటిని వారే సర్క్యులేట్ చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసులో ఐటీ యాక్ట్‌ను చేర్చామని తెలిపారు. ఈ కేసు విచారణ పోక్సో చట్ట ప్రత్యేక కోర్టులో జరుగుతుందని పేర్కొన్నారు. ‘కారులో బాలిక’వీడియోలు ఎమ్మెల్యేకు ఎలా వచ్చాయో అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో అడుగుతామని వివరించారు. -
జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పబ్ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లుకాగా.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), బంజారాహిల్స్‌కు చెందిన ఉమేర్‌ఖాన్ ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మసీవుల్లాఖాన్ కుమారుడి ఆచూకీ గుర్తించారు. అతడు మైనర్ కావడంతో శనివారం ఉదయం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటివరకు అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా వేసి ఉంచారు. ఇక ఉమేర్ ఖాన్, మరో ఇద్దరు మైనర్ల కోసం గాలిస్తున్నారు. వీరిలో సంగారెడ్డికి చెందిన ఓ కార్పోరేటర్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఏం జరిగింది? మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది. పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. దీంతో రేప్ సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిపై నిఘా పెట్టారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాలేజీ పార్టీకని వెళ్లి.. బంజారాహిల్స్‌లో నివాసముండే రొమేనియా దేశానికి చెందిన బాలిక (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న హాదీ అనే యువకుడితో బాలిక కుటుంబానికి పరిచయం ఉంది. అతడు చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నీషియా ఇన్సోమియా పబ్‌లో ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి తనతోపాటు రమ్మని హాదీ బాలికను ఆహ్వానించాడు. గత నెల 28న మధ్యాహ్నం 1.30 గంటలకు హాదీతోపాటు సూరజ్ అనే స్నేహితుడితో కలిసి బాలిక అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. ఇది నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీగా విద్యార్థులు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేసుకున్నారు. మొత్తం 150 మంది వరకు వస్తారంటూ కాలేజీ నుంచి లెటర్ తీసుకువచ్చినప్పటికీ 182 మంది వచ్చారు. వీరిలో సదరు కాలేజీ విద్యార్థుల స్నేహితులు కూడా ఉన్నారు. రొమేనియన్ బాలిక స్నేహితులతో కలిసి సాయంత్రం 5.30 గంటల దాకా పబ్‌లో గడిపింది. ఈ సమయంలో ఆమెకు సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మిగతా ముగ్గురు మైనర్లు (మసీవుల్లాఖాన్ కుమారుడు సహా)తో పరిచయమైంది. అయితే ఈ ఐదుగురూ పబ్‌కు తమ వెంట తెచ్చుకున్న మద్యం తాగినట్టు సమాచారం. పార్టీ ముగిశాక హాదీ బిల్లు చెల్లించే పనిలో ఉండగా.. సాదుద్దీన్, ఉమేర్, మిగతా ముగ్గురు తాము ఇంటివద్ద దింపుతామంటూ ఆ బాలికను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే ఆ బాలికపై అఘాయిత్యానికి పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం కారులో ఎక్కించుకుని.. పబ్ బయట కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు ఎరుపు రంగు బెంజ్ కారులో బాలికను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకొచ్చారు. మిగతా ఇద్దరు ఇన్నోవా కారులో వారిని అనుసరించారు. అందరూ బేకరీలో దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నారు. తర్వాత బెంజ్ కారును అక్కడే వదిలేశారు. ఐదుగురూ ఇన్నోవా కారులో బాలికను ఎక్కించుకున్నారు. బాలికను ఇంటివద్ద దింపుతామంటూ.. పెద్దమ్మ గుడి సమీపంలోని గల్లీల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు అద్దాలన్నీ మూసేసి.. ఒకరి తర్వాత ఒకరుగా కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు గంటసేపటి తర్వాత ఆమెను తీసుకుని బయలుదేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో అమ్నీషియా పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో పబ్‌లోకి వెళ్లిన బాలిక.. తన జాకెట్ మర్చిపోయానంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తీసుకువెళ్లింది. అయితే.. ఇంటికి వెళ్లిన బాలిక ఆందోళనతో రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనతో ఐదుగురు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి గత నెల 31న సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం, వైద్య పరీక్షలతో.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. వైద్య పరీక్షల సందర్భంగా, మహిళా అధికారులు, నిపుణులు వాంగ్మూలాన్ని సేకరించిన సమయంలో.. తనపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీని ఆధారంగా పోలీసులు.. కేసును మార్చి ఐపీసీ 376 (డి), పోక్సో యాక్ట్‌లోని కొన్ని సెక్షన్లను జోడించారు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అమ్నీషియా పబ్, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి.. బాలికతోపాటు ఉన్నవారు ఎవరనేది ఆరా తీశారు. పబ్ నుంచి బంజారాహిల్స్‌లోని బేకరీ దాకా రెండు వాహనాలు రావడం, బేకరీ వద్ద సుమారు 20 నిమిషాలు ఆగడం, ఐదుగురు యువకులతో కలిసి బాలిక కారు బయలుదేరడం వంటివన్నీ పరిశీలించారు. సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మసీవుల్లాఖాన్ కుమారుడు సహా ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. వారు ఏ దారిలో ప్రయాణించారు, ఎక్కడ కారు ఆపి లైంగిక దాడికి పాల్పడ్డారనేది గుర్తించేందుకు.. నిందితుల ఫోన్‌కాల్స్, టవర్ లొకేషన్, బాలిక ఫోన్ లొకేషన్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానాలు! అమ్నీషియా పబ్ నుంచి బాలికతో కలిసి బయలుదేరిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్లాన్‌లో అతనూ భాగమేనని.. అయితే బేకరీ వద్ద బాలికను కారు ఎక్కించుకునే సమయంలో ఓ ఫోన్‌కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని సమాచారం. ఈ విషయంపై పోలీసులు స్పందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని కుమారుడి సమాచారంతో అమ్నీషియా పబ్‌లో పార్టీకి హాజరైనవారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేదు. అంతా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా స్నేహితులైన వారు కావడంతో నిందితులను గుర్తించడం కష్టమైం దని పోలీసువర్గాలు చెప్తున్నాయి. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు.. నిందితులు 29న (అఘాయిత్యానికి పాల్పడిన తర్వాతి రోజు) మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ మీడియా సంస్థ కార్యాలయానికి వెళ్లి, దాని యజమాని కుమారుడిని కలిసినట్టు గుర్తించారు. అతడిని ప్రశ్నించగా.. ఐదుగురు నిందితులు తనవద్దకు వచ్చి అఘాయిత్యం విషయం చెప్పారని వెల్లడించినట్టు తెలిసింది. కానీ తాను సహకరించబోనని వారికి స్పష్టం చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు ఈ మీడియా యజమాని కుమారుడి సాయంతోనే నిందితులను గుర్తించినట్టు తెలిసింది. హోంమంత్రి మనవడికి సంబంధం లేదు రొమేనియన్ బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి ఎలాంటి సంబంధం లేదు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడి పాత్రపై ఆధారాలు లభించాయి. అతడి ఆచూకీ కనిపెట్టినా రాత్రివేళ మైనర్లపై చర్యలు తీసుకోవడానికి చట్టం అంగీకరించదు. అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా ఉంచాం. శనివారం చర్యలు తీసుకుంటాం. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నాం. మిగతా ముగ్గురు నిందితులను 48 గంటల్లో పట్టుకుంటాం. బాలిక పూర్తిగా కోలుకున్నాక ఆమెతో కోర్టులో వాంగ్మూలం నమోదు చేయిస్తాం. మరెవరి పాత్ర అయినా ఉన్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎంతవారైనా వదిలి పెట్టేది లేదు. ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అత్యాచారం చేసిన సమయంలో వీడియో తీసినట్టుగానీ, దాన్ని చూపిస్తామని బెదిరించినట్టుగానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. – జోయల్ డెవిస్, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ -
జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరీ ప్రేమ వేధింపులు
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రేమించాలంటూ వివాహిత వైద్యురాలిని వేదిస్తున్న ఓ వ్యక్తి.. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యురాలికి అంతు పట్టలేదు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి వైద్యురాలు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో తెలుసుకునేదుకు ఏకంగా ఆమె కారుకు జీసీఎస్ ట్రాకర్‌ను అమర్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు.. బాధితురాలు జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా విశ్వనాథ్ తన తీరు మార్చుకోలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్యురాలు దీని గురించి తన భర్తకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు. విశ్వనాథ్ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్, అతడి స్నేహితుడు శ్రీకాంత్ గౌడ్ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్ మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిసాయి. వైద్యురాలిని వెంటాడేందుకు విశ్వనాథ్ ఆమె కారుకు జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చినట్లు వెల్లడించాడు. చదవండి: ‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’ -
సాయం కోసం వెళ్తే అత్యాచారం!
సాక్షి,హైదరాబాద్ : సహాయం కోసం తన వద్దకు వచ్చిన యువతిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..బాధిత యువతి (24) భర్తతో విడాకులు తీసుకొని ఫలక్‌నుమాలో ఉంటోంది. అలీబకర్ అనే వ్యక్తితో కొద్ది రోజులుగా సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ తమకు ఆర్థిక సాయం చేయాలని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉండే అలీబకర్ పెద్దమ్మ భర్త సలీముద్దీన్(80) వద్దకు ఏప్రిల్ 3న వెళ్లారు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తర్వాత మత్తులోకి జారుకున్న యువతిపై సలీముద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అలీబాకర్ తన ఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. ఇదిలా ఉండగా..తన ఇంట్లో ఖరీదైన చేతి గడియారం కనిపించడంలేదని అలీ బాకర్‌తో పాటు యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 13న సలీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరినీ పిలిచి విచారించారు. తనపై సలీముద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అలీబాకర్ తీసిన వీడియోను శుక్రవారం బాధితురాలు పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సలీముద్దీన్‌పై ఐపీసీ 376, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హమ్మయ్య.. చిన్నారి ఇంటికి చేరుకుంది
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి 8 ఏళ్ల చిన్నారి అదృశ్యం కాగా ఆమె కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 6 గంటల పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను జల్లెడపట్టారు. తీరా ఆ చిన్నారి తన సహచర చిన్నారులతో ఆడుకొని అలిసిపోయి సమీపంలోని ఓ గుడిసెలో పడుకొని ఆదివారం తెల్లవారుజామున తీరిగ్గా ఇంటికి చేరుకుంది. పోలీసుల కంటిమీద ఆరు గంటల పాటు కునుకులేకుండా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఓ ఖాళీప్లాట్లో చెన్నైకి చెందిన పార్వతి, సూదన్ దంపతులు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వీరికి మైథిలి 8 సంవత్సరాల కూతురు ఉంది. 15 రోజుల క్రితమే ఈ దంపతులు ఇక్కడికి పొట్టచేతబట్టుకొని వచ్చి స్థిరపడ్డారు. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వీరి కూతురు మైథిలి ఆడుకుంటూ సమీపంలోని ఓ గుడిసెలోకి వెళ్లింది. అక్కడున్న చిన్నారులతో ఆడుకొని కునుకురావడంతో బయటే ఇసుకపై పడుకుంది. అర్ధరాత్రి దాటినా కూతురు జాడ కనిపించకపోయేసరికి అప్పటికే వెతుకుతున్న తల్లిదండ్రులు రాత్రి 12 గంటలకు చిన్నారి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. డీఐ రమేష్‌తో పాటు ఎస్ఐలు సుధీర్‌రెడ్డి, శివశంకర్, యాదగిరిరావు తదితరులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలతో పాటు రహదారుల పక్కన గాలింపు చేపట్టారు. రెండు పెట్రోకార్లు, మూడు బ్లూకోట్స్ వాహనాలు ఈ ప్రాంతాలన్నీ జల్లెడపట్టాయి. 6 గంటల పాటు గాలించినా పోలీసులకు చిన్నారి ఆచూకీ చిక్కలేదు. అక్కడే ఉన్న సీసీ ఫూటేజీలను పరిశీలించగా చిన్నారి జాడ అందులో కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఓ బాలుడు తాను ఆ చిన్నారి వెళ్తుండగా చూశానని ఫిలింనగర్వైపు చూపించాడు. ఆ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో కూడా పోలీసులు గాలించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 7 గంటలకు మైథిలి ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. అప్పటికి తల్లిదండ్రులు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. చిన్నారి వచ్చిన విషయాన్ని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా రాత్రి ఆడుకుంటూ కొద్ది దూరంలో ఉన్న ఓ గుడిసె బయట పడుకున్నానని చెప్పింది. -
‘మోదీ చేతిలో టీఆర్ఎస్ రిమోట్’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినా రిమోట్ మాత్రం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఆయన కుటుంబ ఆస్తులు 400 శాతం పెరిగాయని, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా నగరంలోని జూబ్లీహిల్స్‌లో రాహుల్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
47 నవయుగ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం నుంచి 6 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నవయుగ కన్స్ట్రక్షన్స్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. నవయుగకు చెందిన 47 కంపనీల వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో 20 మంది అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ నిబంధనలు ఉల్లగించినట్టు నవయుగ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ , కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. -
కొత్త ‘పోలీసులు’
హైదరాబాద్ : పోలీస్ స్టేషన్లో విధులు ఎవరు నిర్వర్తిస్తారు..? పోలీసులే కదా అని తేలికగా అనేయకండి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఆ మాట మాత్రం మీరు చెప్పరు. ఎందుకంటే అక్కడ పోలీసులతో పాటు సీమకోళ్లు కూడా విధులు నిర్వర్తిస్తుంటాయి. అదేంటి సీమకోళ్లకు అక్కడేం పని అని ఆశ్చర్యపోకండి. అవి ఎవరికి కాపలా కాస్తున్నాయనే కదా మీ అనుమానం. బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లోని పురాతన క్వార్టర్స్‌లోకి మార్చారు. అయితే ఇటీవల ఈ క్వార్టర్లోకి పాములొస్తున్నాయి. వారం కింద రెండు నాగుపాములు ట్రాఫిక్ సీఐ బల్వంతయ్య గదిలోనే తిష్టవేశాయి. వీటి బారి నుంచి రక్షించుకునేందుకు సీమకోళ్ల ఉపాయాన్ని అమలు చేశారు. సీమకోళ్లు ఉన్న ప్రాంతంలో పాములు తిరగవు. పాములను రానివ్వవు. శనివారం స్టేషన్ ఆవరణలోకి రెండు సీమకోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. -
పరిపూర్ణానంద హౌస్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహయాత్రకు బ్రేక్ పడింది. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. జుబ్లీహిల్స్‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేపథ్యంలో వేలమంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. -
అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పబ్ ముందు యువతీ యువకుల హల్చల్
బంజారాహిల్స్: ఒక్కరు.. ఇద్దరు కాదు.. దాదాపు 160 మంది యువతీ యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. నడిరోడ్డుపై చిందులేశారు.. పోలీసులనూ లెక్కచేయలేదు.. ఆ... ఏం చేస్తారులే అన్నట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.. పబ్‌లో అర్ధరాత్రి వరకుతప్ప తాగి నడిరోడ్డుపై నానా హంగామా చేశారు..జూబ్లీహిల్స్‌పోలీసులు తెలిపిన మేరకు.. రోడ్ నెం. 45లో ప్యాట్ పిజియన్ పబ్ వద్దకు శుక్రవారం రాత్రి పోలీసులు 11.45 గంటలకు వచ్చారు. 12 గంటలకు పబ్ మూసి వేయాలని యత్నిస్తుండగా పీకలదాకా మద్యం తాగిన యువతీ, యువకులు పోలీసులను అడ్డుకున్నారు. పబ్‌లోపలి నుంచి బయటకు రావడానికి నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే పబ్‌ను మూసివేయాలని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పబ్ లోపలే ఉండిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటినా పబ్ తెరిచి ఉండటం పట్ల పోలీసులు క్లాస్ తీసుకున్నారు. బయటకు వచ్చిన యువతీ, యువకులు తాగిన మత్తులో డ్యాన్స్‌లు చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. దీంతో రోడ్డంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎవరూ కదలకుండా అక్కడే డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా సృష్టించారు. క్యాబ్‌ల కోసం రోడ్డుపైన వేచి చూస్తున్నామంటూ యువతీ, యువకులు చెబుతున్నారని సీఐ తెలిపారు. 160 మంది యువతీ, యువకులు అర్ధరాత్రి రోడ్డుపై చిందులేస్తుండటంతో సీన్ చూసేందుకు వాహనదారులందరూ ఎక్కడికక్కడే నిలిచిపోయారు. నీ సంగతి చూస్తా...:ఎస్ఐని బెదిరించిన పబ్ యజమానిపై కేసు బంజారాహిల్స్: నా సంగతి నీకు తెలియదు.. నా పబ్‌కు వచ్చి నన్నే మూసేయమని చెబుతావా..? మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపిం చామో నిన్ను కూడా అలాగే పంపిస్తాం ఖబ డ్దార్ అంటూ ఓ పబ్ యజమాని నిర్ధేశించిన సమ యం ముగిసినా బంద్ చేయకపోవడంతో పోలీసులు రాగా వారితో అన్న హెచ్చరికలు ఇవి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 12.10 గంటల సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని స్టోన్ వాటర్‌పబ్ ఇంకా తెరిచి ఉండటంతో పోలీసులు వెళ్లారు. పబ్‌ను మూసివేయాలని కానిస్టేబుల్ రాజు చెప్పినా వినకపోవడంతో నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్ఐ సైదా అక్కడికి వెళ్లారు. సరిగ్గా అర్ధరాత్రి 12.16 గంటల సమయంలో ఎస్ఐ అక్కడికి వెళ్లి ఇంకా తెరిచి ఉన్న పబ్‌ను వీడియో తీస్తుండటంతో యజమాని సంతోష్ అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు. విధులను అడ్డుకున్నాడు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌ను నెట్టేసేందుకు ప్రయత్నించాడు. నా సంగతి నీకు తెలియదంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపించామో అలాగే నిన్నూ పంపిస్తామంటూ రంకలేశాడు. దీంతో ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పబ్ యజమాని సంతోష్‌పై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. -
డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి కారు కింద నక్కి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులకు చిక్కిన యువ హాస్య నటుడు నవీన్ తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. కారు డ్రైవ్ చేస్తూ వస్తున్న నవీన్‌ను ఆపి తనిఖీ చేయగా.. మద్యం తాగినట్లు తేలింది. దీంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నించారు. మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో నవీన్ కారు దిగి పరుగులు తీశాడు. ఆ వెనుకే ఉన్న మరో కారు కింద దాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడు పారిపోతున్నాడని భావించిన పోలీసులు వెంబడించి పట్టుకోవడంతోపాటు వాహనం సీజ్ చేశారు. అర్ధగంట పాటు ఈ హైడ్రామా నడిచింది. ఈ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న 16 మంది కారు డ్రైవర్లను, నలుగురు బైక్ రైడర్లను పోలీసులు పట్టుకున్నారు. తాగిన మైకంలో తిట్ల దండకం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్లో నలుగురు యువతులూ చిక్కారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద చిక్కిన ఇద్దరికి బీఏసీ కౌంట్లు 83, 95 వచ్చాయి. మరోపక్క జూబ్లీహిల్స్ రోడ్ నం.45 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 9 కార్లు, 5 ద్విచక్ర వాహనచోదకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలోనూ ఇద్దరు యువతులు ఉన్నారు. వీరి బీఏసీ కౌంట్ 80 కంటే ఎక్కువ వచ్చింది. కార్లలో వచ్చిన ఈ నలుగురు యువతులూ తొలుత తమను పరీక్షించేందుకు వీల్లేదంటూ మొండికేశారు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా పరీక్షించడానికి ప్రయత్నించగా.. తిట్ల దండకం ప్రారంభించారు. చివరకు టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో మిన్నకుండిపోయారు. -
జుబ్లీహిల్స్ నడిరోడ్డు మీద.. పట్టపగలు..
హైదరాబాద్: నగరంలో సంపన్నప్రాంతం జుబ్లీహిల్స్.. అలాంటి జుబ్లీహిల్స్‌లో నడిరోడ్డు మీద శనివారం పట్టపగలు దారుణం జరిగింది. తాగిన మైకంలో ఉన్న మందుబాబులు ఓ యువతి పట్ల దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఆమె కారును తమ కారుతో ఢీకొట్టడమే కాకుండా.. ఆమె నుంచి డబ్బులు లాక్కోబోయారు. ఎలాగోలా మందుబాబుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదేమాదిరిగా బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న రోడ్డు నెంబర్ 12లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతిపట్ల పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు. దీంతో వారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ యువతి ప్రతిఘటించింది. ఆమెకు మద్దతుగా దారిన పోయేవారు కూడా పోగవడంతో ఆ పోకిరీలు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోకిరీల దుశ్చర్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. -
కుటుంబం మొత్తం క్యూలోనే..
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చిన్నమ్మ. ఫిలింనగర్ సైదప్ప బస్తీలో నివాసం. నోట్ల కష్టాలు ఈమె కుటుంబంతో ఎంతగా ఆడుకుంటున్నాయో నిరూపించే ఘటన ఇది. ప్రతిరోజూ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని ఫిలింనగర్ ఎస్బీఐ శాఖకు ముందు వచ్చిన 150 మందికి టోకెన్లు ఇస్తోంది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే ఖాతాదారులు లైన్లో నిలబడుతున్నారు. చిన్నమ్మ కుటుంబ సభ్యులు కూడా టోకెన్ కోసం వంతులు వారీగా క్యూలో నిలబడుతున్నారు. తెల్లవారుజామునే ఆమె మనవడు, పదో తరగతి చదువుతున్న రాము వచ్చి క్యూలైన్లో నిలబడ్డాడు. బడికి టైం కావడంతో 9.30 గంటలకు చిన్నమ్మ వచ్చి లైనులో నిలబడి మనవడిని పంపించింది. ఇళ్లల్లో పనిచేసే ఈమె కూతురు సంతీవమ్మ 11 గంటలకు ఇళ్లల్లో పనులు ముగించుకొని వచ్చి క్యూలో నిలబడి తల్లిని ఇంటికి పంపించింది. తీరా సంజీవమ్మ వంతు వచ్చేసరికి క్యూలైన్ టోకెన్లు అయిపోపవడంతో ‘రేపు రండి’ అంటూ బ్యాంకు సిబ్బంది వెనక్కి పంపారు. రూ.1000 కోసం తెల్లవారి నుంచి మనవడు, అవ్వ, ఆమె కూతురు లైన్లో నిలబడ్డా టోకెన్ దొరకలేని పరిస్థితి చేసేది లేక ఉస్సూరుమంటూ వెనుదిరిగింది. నగదు కోసం ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనం ఈ ఉదంతం.