సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం నుంచి 6 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నవయుగ కన్‌స్ట్రక్షన్స్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. నవయుగకు చెందిన 47 కంపనీల వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో 20 మంది అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ నిబంధనలు ఉల్లగించినట్టు నవయుగ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.
నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ , కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment