Navayuga
-
మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో...‘నవయుగ’కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: మచిలీపట్నం పోర్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు ఇప్పుడు సుప్రీంకోర్టులోను అదే పరిస్థితి ఎదురైంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం నిమిత్తం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలన్న నవయుగ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాము మధ్యవర్తిని నియమించబోమని స్పష్టంచేసింది. మధ్యవర్తి నియామక అభ్యర్థనతో హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదీ నేపథ్యం.. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో 66 జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఆ జీవోను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. అదే సమయంలో ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు పలు అభ్యర్థనలతో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసింది. వాటిని న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి కొట్టేసింది. అలాగే తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో 66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీవో 9 అమలును నిలిపేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం కొట్టేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తుది విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకోర్టులో నవయుగ పిటిషన్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశాలపై నవయుగ పోర్ట్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం గురువారం విచారించింది. నవయుగ పోర్ట్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ నవయుగ విజ్ఞప్తిపై స్పందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమని తెలిపారు. ఒప్పందం రద్దులో తమ తప్పేమీ లేదన్నారు. ఒప్పందం చేసుకుని భూమి కేటాయించినా నిర్మాణ పనుల్లో నవయుగ అసాధారణ జాప్యం చేసిందని చెప్పారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రిట్ పిటిషన్ దాఖలు చేసి ప్రాజెక్టు పనులను ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు నవయుగ ప్రయత్నించిందని, అయితే హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. -
నవయుగ కంపెనీకి సుప్రీంకోర్టులో షాక్
సాక్షి, ఢిల్లీ: మచిలీపట్నం పోర్టు పనుల రద్దుపై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూమి కేటాయించినా పోర్టు నిర్మించడంలో నవయుగ ఆలస్యం చేసిందని కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు -
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం (బందరు) పోర్టుకు ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. తాజాగా గురువారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవహారంలో నవయుగ పోర్టు లిమిటెడ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కావడమే ఇందుకు కారణం. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ‘నవయుగ’ సంస్థ దాఖలు చేసిన మూడు అనుబంధ పిటిషన్లనూ హైకోర్టు గురువారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది. అలాగే, తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. అంతేకాక.. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీఓ–9 అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ పోర్టు నిర్మాణం విషయంలో యథాతథస్థితి ఉత్తర్వులతో సహా నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పింది. టెండర్ ఖరారు, లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ, లోయస్ట్ బిడ్డర్ ఒప్పందం కుదుర్చుకోవడం వంటి విషయాల్లో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేసింది. పోర్టు నిర్మాణంపై ముందుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనలనూ తోసిపుచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2,360 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైనా కూడా నవయుగ తిరిగి కొత్త షరతులను విధిస్తూ వచ్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను డిసెంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్ నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ గత నెల 25న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ‘నవయుగ’ అప్పీల్ చేసింది. దీంతోపాటు పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు చేయడంతో పాటు సింగిల్ జడ్జి తీర్పు అమలును, ఒప్పందం రద్దు ఉత్తర్వుల జీఓ అమలును నిలిపేయాలని కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఈ నెల 20న మధ్యంతర ఉత్తర్వుల జారీపై తన నిర్ణయాన్ని రిజర్వ్‌చేసింది. తాజాగా గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. అప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ‘ఒప్పందం రద్దును సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత లోయస్ట్ బిడ్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న నవయుగ అభ్యర్థనను మన్నించలేకున్నాం. ఇక పోర్టు కొత్త మోడల్ ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని 830 ఎకరాలకు కుదించారు. అలాగే, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.700 కోట్లకు తగ్గించారు. అందువల్ల జీఓ–9 అమలు నిలుపుదల సాధ్యంకాదు. జీఓ–66 సంగతికొస్తే, సింగిల్ జడ్జి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నవయుగ పిటిషన్‌ను కొట్టేశారు. అందువల్ల దాని అమలును నిలుపుదల చేయలేం’.. అని ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలని ఎక్కడాలేదు... ‘2008లో ఒప్పందం కుదిరినప్పటికీ, ఎప్పటికప్పుడు అవసరమైన భూమిని అప్పగిస్తూ వచ్చినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలన్న నిబంధనలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఒప్పందంలోని బా«ధ్యతలను నిర్వర్తించడంలో రాయితీదారు (నవయుగ) విఫలమైతే ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకోవచ్చునని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ఇక పోర్టు అభివృద్ధి కోసం 2,360 ఎకరాలతోపాటు మరో 519 ఎకరాల అసైన్డ్ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించింది. 5,324 ఎకరాలను ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టింది. వీటన్నింటి దృష్ట్యా మొత్తం భూమిని ఒక్కసారే ఇవ్వలేదు కాబట్టి ప్రాజెక్టును చేపట్టలేదన్న నవయుగ వాదనను ఆమోదించలేకున్నాం. పరస్పర విరుద్ధంగా ‘నవయుగ’ లేఖలు ‘నిజానికి.. 2019 ఏప్రిల్‌లో పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖల్లో ప్రాథమిక పనులను మొదలుపెట్టినట్లు నవయుగ చెప్పింది. అయినప్పటికీ నవయుగ ముందుకెళ్లలేదు. అంతేకాక.. నవయుగ రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నవయుగ బాధ్యతలను నిర్వర్తించలేదు. పైపెచ్చు కొత్త షరతులు విధిస్తూ వచ్చింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనను తోసిపుచ్చుతున్నాం. సింగిల్ జడ్జి తీర్పులో వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. వీటన్నింటి దృష్ట్యా నవయుగ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
‘నవయుగ’ అనుబంధ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని నవయుగ పోర్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎ.వి.రవీంద్రబాబు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను మంగళవారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కి ఏ మాత్రం లేదని, అందుకే ఒప్పందంలోని నిబంధనలను బేఖాతరు చేస్తూ వచ్చిందని చెప్పారు. రాయితీల కల్పనకు ఉద్దేశించిన స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎస్ఎస్ఏ) ఖరారు విషయంలో కూడా ఆ సంస్థ ఏ మాత్రం చొరవ చూపలేదన్నారు. భూములన్నీ ఒకేసారి అప్పగించాల్సిన అవసరం లేదని, ఇలా అప్పగించాలని ఒప్పందంలో ఎక్కడా లేదని తెలిపారు. ప్రస్తుతం ఏ భూములు కూడా నవయుగ పోర్ట్ లిమిటెడ్ స్వాధీనంలో లేవని చెప్పారు. ఈ పోర్టు నిర్మాణంలో విస్తృత ప్రజాప్రయోజనాలు, భారీ ప్రజాధనం ముడిపడి ఉన్నట్లు తెలిపారు. అందువల్ల ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. శ్రీరామ్ వాదనలకు నవయుగ పోర్ట్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం ప్రకారం నడుచుకోలేదన్నారు. ఒప్పందం ప్రకారం అప్పగించాల్సిన భూములను అప్పగించలేదని తెలిపారు. సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించే ఆస్కారం ఉందన్నారు. అందువల్ల యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
ఉల్లంఘనవల్లే ‘నవయుగ’ ఒప్పందం రద్దు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు దక్కించుకున్న నవయుగ పోర్టు లిమిటెడ్.. తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని, అందుకే ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఏ దశలో కూడా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. ప్రాజెక్టు పనులను కనీస స్థాయిలో కూడా ప్రారంభించలేదన్నారు. నిధుల లభ్యతనూ చూపలేదని తెలిపారు. తప్పులన్నీ వారి వైపు పెట్టుకుని, ప్రభుత్వమే ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుందంటూ ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణం ఏ రోజూ నడుచుకోలేదని తెలిపారు. 5,342 ఎకరాల భూమిని ఏకమొత్తంగా అప్పగిస్తే ఆ భూమిని తాకట్టు పెట్టి తద్వారా నిధులు లభ్యతను చూపుతామని నవయుగ చెప్పిందన్నారు. సముద్రానికి పక్కనే ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పినా వినిపించుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం 2018 మార్చికల్లా నిధుల లభ్యతను చూపాల్సి ఉండగా, అందులో నవయుగ విఫలమైందని, ఇది ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడమేనని శ్రీరామ్ వివరించారు. పోర్టు పనులు ప్రారంభం కాకపోవడానికి నవయుగ వైఖరే కారణమని.. అందుకే ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసుకున్నామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని చెప్పారు. ఏజీ వాదనల కొనసాగింపు నిమిత్తం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూమి మొత్తాన్ని ఏకమొత్తంగా అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దమ్మాలపాటి తెలిపారు. దశల వారీగా భూమిని అప్పగిస్తామనడం సరికాదన్నారు. పైపెచ్చు తమకు అప్పగించిన 2,900 ఎకరాల భూమి ఆక్రమణలతో పాటు పలు వివాదాల్లో ఉందన్నారు. ప్రభుత్వమే ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. నవయుగ పోర్టు లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఒప్పందం రద్దును ప్రశ్నిస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందని తేల్చిచెప్పింది. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. మొత్తం 5,342 ఎకరాల భూమిని ఒకేసారి అప్పగిస్తేనే ప్రాజెక్టు పనులు చేపడతామని నవయుగ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఆ కంపెనీ పెట్టిన కొత్త ఏకపక్ష నిబంధన అని ఆక్షేపించింది. ఒప్పందంలో ఎక్కడా భూమిని ఒకేసారి ప్రారంభంలోనే ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. సముద్రానికి పక్కన ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించిందని పేర్కొంది. తమకు ఒకేసారి 5,342 ఎకరాలను ఇవ్వాలని పట్టుబట్టిందని తెలిపింది. మొత్తం 5,342 ఎకరాల భూమిని అప్పగిస్తే తప్ప, నిధుల లభ్యతను సాధించేందుకు.. పోర్టు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ కంపెనీ చెప్పిందంది. తద్వారా పోర్టు అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నవయుగ నిరాకరించినట్లైందని స్పష్టం చేసింది. 2018 మార్చి కల్లా నిధుల లభ్యతను సాధించడంలోనూ ఆ కంపెనీ విఫలమైందని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీవో 66 జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం.. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి పదకొండున్నరేళ్ల క్రితం నవయుగ పోర్టు లిమిటెడ్ నాటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం 412 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ తర్వాత 2,601 ఎకరాల భూమిని అప్పగిస్తామని ప్రతిపాదించినా నవయుగ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. పోర్టు శంకుస్థాపన శిలాఫలకం తప్ప.. ఏ రకమైన పనులు చేపట్టలేదు. సవరణ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించడం తప్ప ఇన్నేళ్లలో ఆ కంపెనీ చేసిందీ ఏమీ లేదు. ప్రతి విషయంలో మినహాయింపులు కోరడం తప్ప ఏమీ చేయలేదు. ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోకపోవడం, నిర్దేశిత కాల వ్యవధిలోపు పనులు ప్రారంభించకపోవడంతో నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019లో జీవో 66 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నవయుగ పోర్టు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనా: నవయుగ ఇంజనీరింగ్ కంపనీ విరాళం
-
‘నవయుగ’ ముందు ఆందోళన
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు సబ్‌కాంట్రాక్టర్లు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు వంద మంది వరకు కాంట్రాక్టర్లు ఉదయం గేటు ముందు బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సుమారు రూ.150 కోట్ల బిల్లులు బకాయి పడ్డారని, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వచ్చినా.. నవయుగ కంపెనీ వాటిని తమకు చెల్లించడం లేదని ఆరోపించారు. వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ చైర్మన్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు గత కొంతకాలంగా తమను కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దుయ్యబ ట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చైర్మన్‌తో అపాయింట్మెంట్ ఉందని చెప్పడంతో తామంతా ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక చైర్మన్ లేడంటూ బయటకు పంపించారని ఆరోపించారు. తామంతా రోడ్డున పడ్డామని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల నుంచి బిల్లులు చెల్లించడం నిలిపివేశారని ఆరోపించారు. మట్టి పనులు చేశాం.. తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌నని, పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేశానని రాము అనే బాధిత కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకుగానూ రూ. 1.80 కోట్లు తనకు రావాల్సివుందన్నారు. గత జనవరి నుంచి మొన్నటి ఆగస్టు వరకు బిల్లుల చెల్లింపు జరగలేదని, ఎన్నిసార్లు అడిగినా ఎండీని అడుగుతామం టూ చెబుతున్నారని ఆరోపించారు. బిల్లులు బకాయిపడటంతో తనలాగే 50 మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్నాం.. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ కోసం తాను నవయుగ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందని కిరణ్ అనే కాంట్రాక్టర్ తెలిపారు. రూ. 4.50 కోట్లు బకాయి పడ్డారని వెల్లడించారు. బకాయిలపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, చైర్మన్‌ను కలవడంలో తాత్సారం చేస్తున్నారని, అందుకే బాధితులమంతా ఇక్కడకు వచ్చామని తెలిపారు. -
‘నవయుగ’ ఎగనామం!
సాక్షి, నెల్లూరు: పారిశ్రామికాభివృద్ధి పేరుతో కృష్ణపట్నం పోర్టు భూములు దక్కించుకున్న ‘నవయుగ’ సంస్థ స్థానిక పంచాయితీకి రూ.400 కోట్లకు పైగా పన్నులు ఎగ్గొట్టింది! పోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ ప్రజలు తక్కువ ధరకే నవయుగకు భూములు అప్పగించారు. రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న పోర్టు యాజమాన్యం స్థానిక పంచాయతీకి మాత్రం మొండిచెయ్యి చూపింది. భూమి, భవనాల విలువ రూ.6,610.08 కోట్లు కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నా స్థానిక పంచాయతీకి యాజమాన్యం రూపాయి కూడా పన్ను చెల్లించిన పాపాన పోలేదు. ఏపీ పంచాయతీరాజ్ 1994 చట్టం సెక్షన్ 61 ఐ, ఏ ప్రకారం పంచాయతీ పరిధిలోని వాణిజ్య, నివాస భవనాలకు పన్నులు వసూలు చేసే హక్కు ఉంది. ముత్తుకూరు రెవెన్యూ పరి«ధిలో పోర్టు కోసం సేకరించిన 2,625 ఎకరాల తాజా మార్కెట్ విలువ దాదాపు రూ.6,352 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. టీటీటీ పోర్టు ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, స్టోరేజీ, వేర్‌హౌస్ భవన సముదాయాల భవనాలతో కలిపి భూమి విలువను మొత్తం రూ.6,610.08 కోట్లుగా ధ్రువీకరించారు. నామమాత్రంగా కూడా చెల్లించని వైనం.. భూములు, భవనాల మార్కెట్ విలువలో స్థానిక పంచాయతీకి రూపాయి చొప్పున పన్నులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు కట్టారు. ఆ ప్రకారం చూసినా రూ.6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణపట్నం పోర్టు, భూములకు అర్ధ రూపాయి చొప్పున పన్ను వేసినా పంచాయతీకి దాదాపు రూ.33.05 కోట్లు (నెట్ ట్యాక్స్) చెల్లించాలి. ఆపై ప్రభుత్వ వనరులు ఉపయోగించుకున్నందుకు 8 శాతం లైబ్రరీ సెస్‌కు రూ.2.64 కోట్లు, పది శాతం వాటర్ సెస్‌కు రూ.3.30 కోట్లు, పది శాతం లైటింగ్ సెస్‌కు రూ.3.30 కోట్లు, 20 శాతం డ్రైనేజీ సెస్‌కు రూ.6.61 కోట్లు చొప్పున ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కొలతలకు అనుమతి నిరాకరణ ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దాదాపు రూ.400 కోట్లకుపైగా పన్నులు బకాయి పడినట్లు అధికారులు తేల్చారు. పలుమార్లు పంచాయతీ ఆడిటింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్వీకరించలేదు. ఏటా మారుతున్న విలువల ప్రకారం పోర్టు భవనాల కొలతలు తీసుకునేందుకు కూడా సిబ్బందిని అనుమతించకపోవడం గమనార్హం. విజిలెన్స్ ఆరా.. ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పన్నులు బకాయి పడటంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల ఆరా తీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్నుల ఎగవేతపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. నోటీసులకు స్పందన లేదు.. కృష్ణపట్నం యాజమాన్యం ముత్తుకూరు పంచాయతీకి పన్నులు బకాయి పడింది. పోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు చెల్లించలేదు. పన్నులు చెల్లించాలని గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదు. – సుస్మితారెడ్డి, ఇన్చార్జి డీపీవో, నెల్లూరు పోర్టుకి పన్ను మినహాయింపు లేదు.. కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – షేక్ అబ్దుల్ షఫీఉల్లా, రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ మైనార్టీ మోర్చా -
పోలవరం పనులకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగిపోయింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది. ఆ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ గురువారం నిర్ణయం తీసుకోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణ ముగించింది. దీంతో నవయుగ సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. విచారణ సందర్భంగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను పక్కకు పెట్టింది. దిగువ కోర్టును తప్పుబట్టింది. కాగా, పోలవరం కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్‌తో పారదర్శకతకు పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ. 850 కోట్లు ఆదా చేసింది. -
‘నవయుగ’కు చుక్కెదురు..
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దు విషయంలో నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. అలాగే ప్రాజెక్టు పనుల్ని థర్డ్ పార్టీకి అప్పగించకుండా ఉత్తర్వులిచ్చేందుకూ నిరాకరించింది. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చునంది. అయితే టెండర్లను మాత్రం ఖరారు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పదకొండేళ్లక్రితం ఒప్పందం కుదుర్చుకుని, వందల ఎకరాల భూమి అప్పగించినా పనులు ప్రారంభించకపోవడంతో మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపేయడంతోపాటు ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నవయుగ అనుబంధ పిటిషన్‌పై ఎటువంటి సానుకూల ఉత్తర్వులు జారీ చేయట్లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, ఈ విషయంలో న్యాయస్థానం ఏ రకంగానూ జోక్యం చేసుకోదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని, అందువల్ల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వుల పూర్తి పాఠం తెలియరాలేదు. -
హైకోర్టులో నవయుగకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మచిలీపట్నం(బందరు) పోర్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాక ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాలన్న నవయుగ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే పోర్టు నిర్మాణం కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించవచ్చని తెలిపింది. అయితే అక్టోబర్ 25 వరకు ఆ టెండర్లను ఖరారు చేయవద్దని చెప్పింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. కాగా, మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దు చేస్తూ ఆగస్టు 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2010 జూన్ 7న నవయుగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పటివరకు పోర్టు నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అంతేకాక నవయుగకు కేటాయించిన 471 ఎకరాలకు ఆసంస్థ ఒక్కపైసా కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2010లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే మచిలీపట్నం పోర్టు ప్రాజెక్టును మరొకరికి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోర్టు కాంట్రాక్టు రద్దుపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది. -
నవయుగకు ఇచ్చింది ప్రజాధనమే!
సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఏపీ జెన్కో నుంచి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద తీసుకున్నది ప్రజాధనమని, ఆ డబ్బు తిరిగి ప్రభుత్వానికి చేరాల్సిందేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆ కంపెనీ వందల కోట్ల రూపాయలు తీసుకుని క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించలేదని వివరించారు. ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకే, ఆ సంస్థ బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజాధనాన్ని వెనక్కి తీసుకోవద్దనే అధికారం ఎవరికీ లేదన్నారు. బ్యాంకు గ్యారెంటీల విషయంలో ఆర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 9 కింద విజయవాడ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎంత మాత్రం విచారణార్హత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అసలు ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధే ఆ కోర్టుకు లేదని శ్రీరామ్ వివరించారు. కమర్షియల్ కోర్టుల చట్టం కింద కమర్షియల్ కోర్టు హోదా ఉన్న న్యాయస్థానంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉందన్నారు. మచిలీపట్నం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టుకు కమర్షియల్ కోర్టు హోదానివ్వడం జరిగిందన్నారు. ఈ కోర్టుకు మాత్రమే నవయుగ పిటిషన్‌ను విచారించే పరిధి ఉందని ఆయన తెలిపారు. బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ కోర్టు, కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఏకపక్షంగా వ్యవహరించిందని, అందువల్ల ఆ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఏజీ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం, నవయుగ తరఫు వాదనలు వినడానికి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ జెన్కో హైకోర్టులో సివిల్ మిస్లేనియస్ అప్పీల్ (సీఎంఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పోలవరం పూర్తి చేసి తీరతాం
-
పోలవరం పూర్తి చేసి తీరతాం
సాక్షి, నెల్లూరు : పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసి తీరతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదని కేవలం కాంట్రాక్టర్లను మాత్రమే రద్దు చేశామని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇచ్చామని, నూతన కాంట్రాక్టర్లచే నవంబర్ నుంచి పనులు పారదర్శకంగా మొదలవుతాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం హెడ్‌వర్క్స్(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు నోటీసులు జారీ చేయడంతో ఆ కంపెనీలు తప్పుకోవడం తెలిసిందే. -
నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి దశలో రెండో ప్యాకేజీ పనులు చేయకున్నా సరే నవయుగ–ఆర్వీఆర్ సంస్థకు రూ.26.55 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా రూ.351 కోట్లకుపైగా ఖజానాను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. చేయని పనులను చేసినట్లుగా చిత్రీకరించి కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.351,11,54,057 చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఖజానా నిండుకోవడంతో దీనికి బ్రేక్ పడింది. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశం బహిర్గతమైంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.26.55 కోట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశ పనులను గత సర్కార్ చేపట్టింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 2వ ప్యాకేజీ (45 కి.మీ. నుంచి 66.600 కి.మీ. వరకు ఏడు వేల క్యూసెక్కులను ఎత్తిపోయడం) పనులను 4.41 శాతం ఎక్సెస్ ధరలకు అంటే రూ.2,655.49 కోట్లకు నవయుగ–ఆర్వీఆర్ దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్నాక సర్వే, ఇన్వెస్టిగేషన్ కోసం ఒక శాతం అంటే రూ.26.55 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద గుంటూరు జిల్లా ఎస్ఈ బాబూరావు చెల్లించారు. పెండింగ్ బిల్లులపై సమీక్షతో వెలుగులోకి.. నిబంధనల ప్రకారం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తయిన తర్వాత నాలుగు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించవచ్చు. అయితే సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులే ఇంతవరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు శాతం (రూ.106,23,57,216), పనులు చేయకున్నా చేసినట్లు చూపిస్తూ మరో రూ.244,87,96,841 వెరసి మొత్తం రూ.351,11,54,057 మేరకు బిల్లులు చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ఉద్యోగులు నివ్వెరపోయారు. అసలు చేయని పనులకు బిల్లులు ఎలా చెల్లిస్తామంటూ నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన నాటి ప్రభుత్వ పెద్దలు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే ఖజానా ఖాళీ కావడంతో తెరచాటు యత్నాలు బెడిసికొట్టాయి. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో కూడా తట్టెడు మట్టెత్తకుండానే నవయుగ సంస్థకు రూ.787.2 కోట్లు ఇచ్చారని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనుల్లోనూ ఇదే రీతిలో నవయుగకు ఖజానా నుంచి ధారపోయటాన్ని బట్టి గత సర్కారు పెద్దలకు ఆ సంస్థతో ఎంత ధృఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
పోలవరం మరింత వేగవంతం
-
పోలవరం అక్రమాలపై ‘రివర్స్’ పంచ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. హెడ్‌వర్క్స్(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నామినేటెడ్ ఎల్.ఎస్. కాంట్రాక్టు ఒప్పందంలో జీసీసీ (జనరల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్) 89–3 క్లాజ్ ప్రకారం ఒప్పందాన్ని ముందుగానే రద్దు (ప్రీ–క్లోజ్) చేసుకోవాలని సూచిస్తూ నవయుగ, బీకెమ్‌లకు పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు జూలై 29న నోటీసులు జారీ చేశారు. ఒప్పందం రద్దు కోసం పరస్పర అంగీకారాన్ని తెలియచేస్తూ 15 రోజుల్లోగా తమను సంప్రదించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడే ఆర్థికపరమైన లావాదేవీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని పేర్కొంటూ నవయుగ సంస్థకు ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) నోటీసులు జారీ చేసింది. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. కమీషన్ల కోసమే ప్రాజెక్టు బాధ్యతలు.. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం ఖర్చు భరించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కమీషన్ల దాహంతో మాజీ సీఎం చంద్రబాబు పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టడంతో పోలవరం బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1331.91 కోట్లు పెంచేస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ధి చేకూర్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్ట్రాయ్ 2017 నాటికి దివాలా తీసింది. నిబంధనల ప్రకారం దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలి. ‘డబ్బుల్’ ధమాకా.. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకే కట్టబెట్టాలని ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు 2017 జనవరి 7న ఏపీ జెన్కోతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిబంధనల సాకుతో 4.83 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.3,220.22 కోట్లకు కోట్ చేసిన నవయుగ సంస్థకు ఆ పనులు కట్టబెడుతూ 2017 డిసెంబర్ 30న ఏపీ జెన్కో ఒప్పందం చేసుకుంది. నిజానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. హెడ్‌వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసిన నేపథ్యంలో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు హెడ్‌వర్క్స్‌లో కమీషన్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 60సీ నిబంధన కింద రూ.2,914.66 కోట్ల విలువైన పనులను ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ మూడు ఒప్పందాలను చేసుకున్నారు. ఇదే రీతిలో గేట్ల పనులను 60సీ నిబంధన కింద విడదీసి రూ.387.56 కోట్ల పనులను బీకెమ్ సంస్థకు నామినేషన్ విధానంలో అప్పగిస్తూ 2018 నవంబర్ 8న మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడైంది. తేలిన అక్రమాలు.. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ ఆర్థికంగా దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో నాటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈపీసీ ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయాన్ని పెంచేయడం, నవయుగ, బీకెమ్ సంస్థలకు ఎల్ఎస్ ఓపెన్ పద్ధతిలో నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం, జీవో 22, జీవో 63 కింద అదనపు చెల్లింపులు చేయడం, స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్ కింద విడుదల చేసిన రూ.170 కోట్లకు లెక్కలు చూపకపోవడం, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో తట్టెడు కూడా మట్టెత్తకుండానే రూ.787.20 కోట్లను దోచిపెట్టడాన్ని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారిస్తూ నిపుణుల కమిటీ గత నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల పనుల్లో సమన్వయం కుదురుతుందని, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. కమిటీ సిఫార్సుల మేరకు నోటీసులు.. ట్రాన్స్‌ట్రాయ్‌తో 2013 మార్చి 2న జరిగిన ఈపీసీ ఒప్పందాన్ని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా నవయుగ, బీకెమ్ సంస్థలతో రూ.3,302.22 కోట్ల విలువైన పనులను ఎల్ఎస్–ఓపెన్ పద్ధతిలో నామినేషన్‌పై అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడం, డీజిల్ కొనుగోలుకు రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయడం, స్టీలు, సిమెంట్‌ను గత ప్రభుత్వమే కాంట్రాక్టర్‌కు సరఫరా చేయడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో నవయుగతో చేసుకున్న మూడు ఒప్పందాలు, బీకెమ్ సంస్థతో చేసుకున్న మరో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసినప్పటి నుంచే అంటే జూలై 29 నుంచి 15 రోజుల్లోగా అంటే ఆగస్టు 12లోగా ఆ ఒప్పందాలను పరస్పర అంగీకారంతో ముందస్తుగా రద్దు చేసుకోవడానికి అంగీకరిస్తూ పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను సంప్రదించాలని ఆ రెండు సంస్థలకు సూచించింది. ఈ పనులకు పారదర్శక విధానంలో కొత్తగా టెండర్లు నిర్వహిస్తామని నోటీసుల్లో పేర్కొంది. కాంట్రాక్టు ఒప్పందం చేసుకుని ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేస్తూ మే 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పనులు ప్రారంభించని జలవిద్యుదుత్పత్తి కేంద్రం కాంట్రాక్టు ఒప్పందం కూడా రద్దు అయినట్లే లెక్క. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ నవయుగకు ఏపీ జెన్కో నోటీసులు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్‌కు కసరత్తు.. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీపీఏ గెజిట్ నోటిఫికేషన్ సెక్షన్ 9–1 ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలన్నా కేంద్ర జల్ శక్తి, పీపీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌లకు సోమవారం లేఖ రాయనున్నారు. పోలవరం బాధ్యతలను గత ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాక పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థతో హెడ్ వర్క్స్ పనులకు జలవనరుల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఏపీ జెన్కో ఒప్పందం చేసుకోనున్నాయి. ఆయా పనులు చేసిన మేరకు జలవనరుల శాఖ, ఏపీ జెన్కోలు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించనున్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ, ఏపీ జెన్కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
నవయుగ కంటెయినర్ టర్మినల్ సరికొత్త రికార్డు
హైదరాబాద్: నవయుగ కంటెయినర్ టర్మినల్ (ఎన్సీటీ) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2018–19లో 5,00,000 టీఈయూల (భారీ ఓడల నిర్వహణ సామర్థ్యాన్ని లెక్కించే కొలమానం) హ్యాండ్లింగ్‌ను 2019 మార్చి 27న తొలిసారిగా చేరుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎం.వి ఎస్ఎస్ఎల్ కుచ్ వెస్సెల్ ద్వారా దీన్ని సాధించినట్టు తెలిపింది. 2013–14లో 58,577 టీఈయూల సామర్థ్యం నుంచి చూస్తే ఐదేళ్ల కాలంలో 9 రెట్ల వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ సీఈవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి దీనిపై మాట్లాడుతూ... నవయుగ కంటెయినర్ టర్మినల్ భారత తూర్పు తీరంలో రవాణా హబ్‌గా అవతరించేందుకు భారీ ముందగుడు వేసినట్టు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో దీన్నొక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. షిప్పింగ్ లైన్స్‌తో బలమైన భాగస్వామ్యాలు లేకుండా ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదని నవయుగ కంటెయినర్ టర్మినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి జితేంద్ర నిమ్మగడ్డ అభివర్ణించారు. టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1.2 మిలియన్ టీఈయూల నుంచి 2019 చివరి నాటికి 2 మిలియన్ల టీఈయూలకు పెంచనున్నట్టు చెప్పారు. -
47 నవయుగ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం నుంచి 6 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నవయుగ కన్స్ట్రక్షన్స్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. నవయుగకు చెందిన 47 కంపనీల వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో 20 మంది అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ నిబంధనలు ఉల్లగించినట్టు నవయుగ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ , కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. -
నవయుగలో సోదాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒకే చిరునామాతో లెక్కకు మించిన కంపెనీలను రిజిస్టరు చేసి... వాటి ఖాతాలు సైతం సరిగా నిర్వహించకుండా పలు అవకతవకలకు పాల్పడుతున్న కంపెనీలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు రోజులుగా నగరంలో సోదాలు చేస్తున్న ఆర్ఓసీ అధికారులు... శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఇన్ఫ్రా, ఇంజనీరింగ్ కంపెనీ అయిన నవయుగ... విద్యుత్, స్టీలు, ఐటీ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి పలు రంగాల్లో ఉంది. కృష్ణపట్నం పోర్టు కూడా ఈ గ్రూపుదే. రాష్ట్ర విభజన తరవాత పలు కంపెనీల రిజిస్టర్డ్ చిరునామాలను ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మార్చింది. ఇందులో భాగంగా కొన్ని కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలు విశాఖపట్నానికి మారాయి. అయితే హైదరాబాద్‌లో 25కు పైగా గ్రూపు కంపెనీలో జూబ్లీహిల్స్‌లోని ఒకే చిరునామాతో ఉండటంతో ఆర్ఓసీ అధికారులు శుక్రవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ సోదాల్లో ఆర్ఓసీ అధికారులతో పాటు ఆర్థిక నేరాలను, అవకతవకలను గుర్తించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు కూడా పాలు పంచుకున్నారు. రీజనల్ డైరెక్టరేట్ సూచనల మేరకే ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. సోదాల సంద ర్భంగా పలు రికార్డులు పరిశీలించటంతో పాటు వాటిపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగాయి. నిజానికి ఆర్ఓసీ ప్రాథమిక నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన నమోదిత కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రిజిస్టర్డ్ కార్యాలయంలోనే సంబంధిత రికార్డులన్నీ నిర్వహించాలి. ఒకవేళ వేరే చోట నిర్వహించాలని అనుకుంటే దానికి బోర్డు ప్రత్యేక తీర్మానం చేయాలి. చాలా కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తూ ఏదో ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ బోర్డును మాత్రమే ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు ఒకే కార్యాలయంలో భారీ కంపెనీలున్న సందర్భంలో వారి ఖాతాల నిర్వహణలో పలు అవకతవకలు ఉంటున్నాయనేది ఆర్ఓసీ అధికారుల మాట. ఇలాంటి ఉల్లంఘనల్ని పట్టుకోవడంతో పాటు ఖాతాల్లో అవకతవకలుంటే బయటపెట్టడానికి ఎస్ఎఫ్ఐఓ సహకారం తీసుకుంటున్నారు. నవయుగ గ్రూపు ప్రమోటర్ చింతా విశ్వేశ్వరరావు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు ప్రమోటర్ కూడా ఈయనే. ప్రధానంగా ఈయన కుటుంబానికి చెందిన చింతా శశిధర్, చింతా శ్రీధర్, చింతా శ్రీనివాసరావు వివిధ కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతూ పర్యవేక్షిస్తున్నారు. విడివిడిగా, ఉమ్మడిగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీల సంఖ్య దాదాపు 50కి పైనే ఉంది. వీటిలో కొన్ని కంపెనీల్లో అసలు కార్యకలాపాలే లేవని, నగదు లావాదేవీలు మాత్రం చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. దీనికితోడు ఆయా డైరెక్టర్లు తమ ఆదాయపు పన్ను రిటర్నుల్లో అన్ని కంపెనీల పేర్లూ పేర్కొన్నారా? లేదా? అన్నింటి నుంచీ వచ్చే ఆదాయాన్ని చూపించారా లేదా? అనే కోణంలో కూడా తదుపరి దశలో పరిశీలించనున్నట్లు సమాచారం. నవయుగ గ్రూపునకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో పలు భారీ ఇన్ఫ్రా, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఈ సంస్థ దక్కించుకుంది కూడా. అంతేకాకుండా బాబుకు బినామీగా పేరున్న ఓ పత్రికాధిపతితో ఈ గ్రూపునకు ఆర్థిక బంధాలూ ఉండటం గమనార్హం. -
'పోలవరంపై మొదటి నుంచీ చంద్రబాబు లాలుచీ'
-
‘పోలవరంపై నేను చెప్పినట్టే జరిగింది’
సాక్షి, రాజమండ్రి: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రోజుకో మాట అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే పోలవరం పనులు అప్పగించామని గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అబద్దాలు చెబుతున్నారని.. పనులు అప్పగించాలని అడగలేదని అంటున్నారని మండిపడ్డారు. పోలవరంపై మొదటి నుంచీ చంద్రబాబు లాలుచీనే అన్నారు. జాతీయ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. తక్కువ ధరకే నవయుగకు పనులు అప్పగించామన్న చంద్రబాబు.. ఇపుడు గడ్కరీనే ఆ పనులు ఇచ్చారని చెప్పడమేంటన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని తెలిపారు. 2016 వరకు అసలు పనులే చేపట్టలేదని పేర్కొన్నారు. శ్వేత పత్రం అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదు.. ప్రజులను చంద్రబాబు ఎంతకాలం మభ్యపెడతారన్నారు. వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారని, పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. -
ఒకే దెబ్బకు రెండు జాక్పాట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని వంటి పోలవరం ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తోంది. పనులు నత్తనడకన సాగుతుంటే.. అవినీతి, కమీషన్ల వ్యవహారాలు రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు రెండు జాక్పాట్లు కొట్టేలా సర్కారు పెద్దలు వ్యూహం రచించారు. అవేమిటంటే.. పోలవరం జలాశయంలో కాంక్రీట్ పనులను నవయుగకే నామినేషన్ పద్ధతిలో అప్పగించడం. కేంద్రం కళ్లకు గంతలు కట్టి దీన్ని ఓకే చేయించుకున్నారు. ఇక పోలవరం జలాశయం పనులు 2019 నాటికి పూర్తవుతాయనే భ్రమ కల్పించడం ద్వారా ఆర్థికశాఖ అభ్యంతరాలకు చెక్ పెట్టి... రూ.5,338.95 కోట్ల విలువైన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లను అదే సంస్థకు కట్టబెట్టడానికి చాకచక్యంగా కథ నడిపించడం.. ఈ తతంగం పూర్వాపరాలేమిటో పరిశీలిద్దాం.. నవయుగకే దక్కేలా.. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు రూ.3,157.93 కోట్లను అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించిన ఏపీ జెన్కో(విద్యుదుత్పత్తి సంస్థ) గతేడాది జనవరి 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.. తాను ఎంపిక చేసిన సంస్థకే పనులు దక్కేలా టెండర్లలో ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. గతేడాది సెప్టెంబరు 15న సాంకేతిక బిడ్, అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరిచారు. ముందే అనుకున్నట్లుగానే.. 4.83 శాతం అధిక ధరలకు నవయుగ, 12.92 శాతం అధిక ధరలకు మేఘ, 14.85 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ టాటా పవర్ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు చేసి ‘నవయుగ’ ఎల్–1గా నిలిచింది. టెండర్లు ముగిశాక అంచనా పెంపు.. టెండర్ల ప్రక్రియ ముగిసి.. నవయుగ సంస్థకు పనులు దక్కాక అంచనా వ్యయం పెంచాలంటూ సర్కారు పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తాళలేని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అంచనా పెంచేశారు. 2016–17 ధరల ప్రకారం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును జీఎస్టీ, లేబర్ సెస్ వంటి పనులతో కలిపి రూ. 3,903.81 కోట్లకు పూర్తి చేయవచ్చని ప్రతిపాదించారు. అక్కడితో సంతృప్తి చెందని చంద్రబాబు అంచనా వ్యయం మరింత పెంచాలంటూ వత్తిడి తెచ్చారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న సమయంలో పెట్టుబడిపై వడ్డీతో కలిపి అంచనా వ్యయం రూ.5,358.23 కోట్లకు అధికారులు పెంచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయం రూ. 1454.42 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్ఈసీ (రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్) రూ.3,965.11 కోట్ల రుణం ఇచ్చిందని, మిగతా రూ.1,373.84 కోట్లను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని జెన్కో వివరించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలు.. జెన్కో ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో తక్కువ వడ్డీకే రుణం లభ్యమవుతున్నప్పుడు.. ఆర్ఈసీ వద్ద 10.95 శాతం అధిక వడ్డీకి రుణం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు లేవని.. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని.. అధిక వడ్డీ భారం పడుతుందని అభిప్రాయపడింది. టెండర్ల ప్రక్రియ ముగిశాక ఐబీఎం, అంచనాల పెంపుపై అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతోనూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తోనూ సంప్రదింపులు జరిపామని, డిసెంబర్, 2019 నాటికి పోలవరం జలాశయం పనులు పూర్తవుతాయని ఆర్థిక శాఖకు జెన్కో వివరించింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ఏప్రిల్, 2021 నాటికి.. 12 యూనిట్లు అక్టోబర్, 2022 నాటికి ఉత్పత్తి చేసేలా పనులను పూర్తి చేస్తామని తెలిపింది. జెన్కో వివరణలపై అధ్యయనం చేసిన ఆర్థికశాఖ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులను పూర్తి చేయడం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ అమలుపై సందేహాలు వ్యక్తం చేసింది. జలాశయం పనులు సకాలంలో పూర్తి కాకపోతే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. అభ్యంతరాలే అస్త్రాలు.. పీపీఏ, ఆర్థిక శాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలనే అస్త్రాలుగా మల్చుకుని.. మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు. పోలవరం జలాశయం పనుల్లో రూ.1,483.22 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే.. వాటిని రద్దు చేసి రూ.2,800 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టాలని నిర్ణయించారు. జలాశయం పనులు చేస్తున్నదన్న సాకు చూపి అదే సంస్థకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులను కూడా కట్టబెడుతూ టెండర్లను ఖరారు చేయాలన్నది సర్కారు పెద్దల ఎత్తుగడ. ఇక ఐబీఎంను పెంచడం ద్వారా టెండర్ల సమయంలో నవయుగకు రూ.1454.42 కోట్ల లబ్ధి చేకూర్చడమే కాక పట్టిసీమ ‘బోనస్’ వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయడానికి పూనుకున్నారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో ప్రతి నెలా నిర్దేశించిన పని కంటే అధికంగా చేస్తామని.. అధికంగా చేసిన పని విలువలో 50 శాతం బోనస్ ఇవ్వాలని నవయుగ సంస్థతో ప్రతిపాదింపజేశారు. చేసిన పనులకు 30 రోజుల్లోగా కాకుండా 20 రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ నిర్దేశించిన పని కన్నా తక్కువగా చేస్తే.. తక్కువ పడే పని విలువలో 50 శాతాన్ని జరిమానా విధించాలని సూచించారు. కానీ.. డిజైన్ల ఆమోదం, భూసేకరణ, జలాశయం పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులో ఆలస్యమైతే తమది తప్పు కాదని.. అది సర్కారుదే బాధ్యతని మెలిక పెట్టారు. దీనివల్ల సకాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని.. వడ్డీ భారం తగ్గుతుందని నవయుగ ప్రతిపాదించింది. ఉదాహరణకు ఒక నెలలో రూ.100 కోట్ల విలువైన పని చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశిస్తే.. కాంట్రాక్టర్ రూ.120 కోట్ల విలువైన పని చేస్తే.. అదనంగా చేసిన రూ.20 కోట్ల పనికిగానూ కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు బోనస్‌గా సర్కార్ ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ ఒకవేళ ఆ మేరకు పనులు చేయకపోతే జరిమానా విధించే అవకాశమే ఉండదు. ఎందుకంటే.. డిజైన్ల ఆమోదంలోనో, బిల్లుల చెల్లింపులోనో, భూసేకరణలోనో జాప్యాన్ని చూపి కాంట్రాక్టర్ తప్పించుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ కాంట్రాక్టర్‌పై జరిమానా విధించకపోవడమే దీనికి తార్కాణం. కాంట్రాక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయాలని జెన్కో అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. జెన్కో అధికారులు అంగీకరించని నేపథ్యంలో కేబినెట్ తీర్మానం ద్వారా టెండర్లపై ఆమోదముద్ర వేసి.. కమీషన్లు రాబట్టుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఆర్థిక శాఖ ఆక్షేపణ.. పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదని.. ఇప్పటికిప్పుడు రూ.5,338.95 కోట్లతో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో ఔచిత్యమేమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీల భారం పడుతుందన్న సాకు చూపిస్తూ హైడల్ ప్రాజెక్టు పనులను నవయుగకు అప్పగించేలా టెండర్లను ఖరారు చేసే యత్నాలకు అభ్యంతరం తెలిపింది. కానీ సీఎం ఇలా అంటున్నారు పోలవరం జలాశయంలో 31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పాత ధరలకే చేసేందుకు నవయుగ ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అందువల్ల ఆ సంస్థకే కాంక్రీట్ పనులు నామినేషన్‌పై అప్పగిస్తున్నామన్నారు.