సాక్షి, రాజమండ్రి: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రోజుకో మాట అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే పోలవరం పనులు అప్పగించామని గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అబద్దాలు చెబుతున్నారని.. పనులు అప్పగించాలని అడగలేదని అంటున్నారని మండిపడ్డారు.
పోలవరంపై మొదటి నుంచీ చంద్రబాబు లాలుచీనే అన్నారు. జాతీయ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. తక్కువ ధరకే నవయుగకు పనులు అప్పగించామన్న చంద్రబాబు.. ఇపుడు గడ్కరీనే ఆ పనులు ఇచ్చారని చెప్పడమేంటన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని తెలిపారు. 2016 వరకు అసలు పనులే చేపట్టలేదని పేర్కొన్నారు. శ్వేత పత్రం అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదు.. ప్రజులను చంద్రబాబు ఎంతకాలం మభ్యపెడతారన్నారు. వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారని, పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment