సాక్షి, నెల్లూరు : పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసి తీరతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదని కేవలం కాంట్రాక్టర్లను మాత్రమే రద్దు చేశామని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇచ్చామని, నూతన కాంట్రాక్టర్లచే నవంబర్ నుంచి పనులు పారదర్శకంగా మొదలవుతాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం హెడ్‌వర్క్స్(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు నోటీసులు జారీ చేయడంతో ఆ కంపెనీలు తప్పుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment