సాక్షి, అమరావతి: ఇరిగేషన్ అధికారులతో సోమవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆర్‌అండ్‌ఆర్‌పై దృష్టి పెట్టి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment