Irrigation authorities
-
‘కడెం’ నీరు వృథా
కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ 15వ నంబరు గేటు కౌంటర్ వెయిట్(గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె) మంగళవారం తెల్లవారుజామున విరిగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్ట్‌లోకి 13,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలకు గేటును ఎత్తే క్రమంలో కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరంతా వృథాగా పోతోంది. వెంటనే మరమ్మతులు చేయలేకపోయినా, ఇన్‌ఫ్లో లేకపోయినా ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం ఉండడంతోపాటు ఇన్‌ఫ్లో వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్ తెలిపారు. బుధవారం మెకానికల్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతారని, ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రస్తుత నీటిమట్టం 699అడుగులు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700(7.603టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 699.625(7.504టీఎంసీ) అడుగులు ఉందని, 3,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, వరద గేటు ద్వారా 3,185 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ మొత్తం 18 వరద గేట్లకు గాను గతంలో 2వ నంబర్ గేట్‌కు కౌంటర్ వెయిట్ విరిగినా ఇప్పటికీ వేయలేదు. ఇప్పుడు తాజాగా 15వ నంబర్ గేట్ కౌంటర్ వెయిట్ విరగడంతో మొత్తంగా ఆ రెండింటినీ ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
‘యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, అమరావతి: ఇరిగేషన్ అధికారులతో సోమవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆర్అండ్ఆర్పై దృష్టి పెట్టి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. చదవండి: ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్ -
వానొచ్చె.. వరదొచ్చె..
సాక్షి, అమరావతి/ నెట్వర్క్: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటం, ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 16.53 టీఎంసీలు జలాశయంలోకి చేరాయి. ప్రస్తుతం 1,79,709 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 838.7 అడుగుల్లో 59.98 టీఎంసీలకు చేరుకుంది. రానున్న రెండు రోజులు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కర్ణాటకకు సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కూడా దాదాపుగా నిండింది. ఈ నేపథ్యంలో శనివారం శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు భీమా నదిలో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఉజ్జయినిలోకి 39,467 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 78.06 టీఎంసీలకు చేరుకుంది. 24,860 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 30.44 టీఎంసీలకు చేరింది. నేడు మరింత పెరగనున్న గోదారి వరద శబరి, సీలేరు పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో భారీ ఎత్తున వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీకి 8,00,084 క్యూసెక్కుల వరద రాగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,85,089 క్యూసెక్కులను 174 గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. సాయంత్రం ఏడు గంటలకు వరద కాస్త తగ్గడంతో 7,11,439 క్యూసెక్కులను విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 60 టీఎంసీలను ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వదిలారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 340 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. శనివారం కాటన్ బ్యారేజ్‌కు సుమారు 8.50 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరుకుంది. తాలిపేరు రిజర్వాయర్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద నీటి ఉధృతి మరింత పెరిగింది. పునరావాస పనులు వేగవంతం పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 27.34 అడుగులకు చేరుకుంది. స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్ ఛానల్ మీదుగా గోదావరిలోకి ప్రవాహాన్ని మళ్లిస్తున్న అధికారులు వరదను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నదికి 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వచ్చినా పోలవరం ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు ఉండదని.. కానీ 12 లక్షల కంటే ఎక్కువ వరద వస్తే 41.15 కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించే పనులను వేగవంతం చేశారు. కంటి మీద కునుకు లేదు.. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి తీర ప్రాంత గిరిజనం భయాందోళన చెందుతున్నారు. ఇటు గోదావరి పరీవాహక పోలవరం నిర్వాసిత దేవీపట్నం మండలంతో పాటు విలీన మండలాలు నాలుగింటిలో గిరిజనులు కుంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ముంపునీటిలో నానుతున్న ఇళ్లు కూలిపోతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పారుదలకు కాఫర్‌డ్యామ్ అడ్డుగా నిలవడంతో దానిపై నుంచి ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పూడుపల్లి, దేవీపట్నం సెక్టార్లు వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో నాటు పడవలే శరణ్యంగా మారాయి. ఏజెన్సీలోని 22 ముంపు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ కళ్లు మూసుకుని నిర్మించిన కాఫర్ డ్యామ్ తమ కొంప ముంచుతోందని దేవీపట్నం పరిసర ప్రాంతాల గిరిజనులు శాపనార్థాలు పెడుతున్నారు. 5, 6 తేదీల్లో భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిమీ మధ్యలో ఆవరించి ఉంది. అదే విధంగా ఇది వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అనేక చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీనికి తోడు ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 5, 6 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అరుకు లోయ, సీలేరు, డుంబ్రిగుడ తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జలాశయం పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షంతో ఈ జలాశయం నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరరామచంద్రాపురం, కూనవరంలో 13, నూజివీడు, ఏలూరులో 9, కోయిడా, వేలరుపాడు, కుకునూరు, భీమడోలులో 8, రాజమండ్రిలో 7, కొయ్యలగూడెం, విజయవాడ, తాడేపల్లిగూడెం, చింతలపూడిలో 6, చింతపల్లి, తణుకు, ప్రకాశం బ్యారేజీలో 5, తిరువూరు, గుడివాడ, పిడుగురాళ్ల, పాలకోడేరు, పోలవరం, డోర్నిపాడు, దేవరకొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగమేశ్వరుడిని చేరిన కృష్ణవేణి కొత్తపల్లి/ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమ ప్రదేశమైన శ్రీ లలితా సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోకి కృష్ణా జలాలు శుక్రవారం ప్రవేశించాయి. ఐదారు రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణవేణి గర్భవాసంలోకి చేరుకోబోతుండడంతో ఆలయ గోపుర దర్శనం చేసుకునేందుకు భక్తులు సంగం బాట పట్టారు. వర్షాలు ఇక పుష్కలం సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలకు వాతావరణ అనుకూలం ఉందని.. మొదట్లో ఇవి ఆలస్యమైనా ఇప్పటి నుంచి ఇక పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కువ ప్రభావాన్ని చూపే ఈశాన్య, ఆగ్నేయ గాలులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణం వైపుగా పయనించడం ప్రారంభించడంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా ఆగస్టు 15 నుంచి అక్టోబరు 15 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వాతావరణంలో మార్పులవల్ల దశాబ్ద కాలం తరువాత ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యమయ్యాయని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొ. భానుకుమార్ ‘సాక్షి’కి వివరించారు. వర్షాలకు అనుకూలం.. పసిఫిక్ మహా సముద్రంలో ఈ ఏడాది వాతావరణంలో హెచ్చు తగ్గులు సాధారణంగా ఉండటం.. హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రంలో కూడా తటస్థంగా ఉండటంతో ఈ ఏడాది వర్షాలకు సముద్ర భాగం నుంచి ఎలాంటి ఆటంకం ఏర్పడటంలేదని ఆయన తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్టోబరు 15వ వరకూ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఆగస్టు ద్వితీయార్థం నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని చెప్పారు. లోటు తీరిపోతుంది.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8 శాతం లోటు వర్షపాతం ఉందని.. ఇది ఆగస్టు నాటికి భర్తీ అవుతుందని ఆయనన్నారు. రాష్ట్రంలో గతేడాది 91 శాతం వర్షం కురవగా.. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే ఇప్పటివరకూ 92 శాతం వర్షపాతం నమోదైందని.. ఇంకా ఆగస్టు, సెప్టెంబరు నెలలు ఉండటంతో నూరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రొ.భానుకుమార్ వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. ఏపీలో మాత్రం ఆగస్టు, సెప్టెంబరులోనే ఎక్కువగా ఉంటుందన్నారు. -
వరంగల్ జిల్లాలో శుక్రవారం స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు మండల, గ్రామస్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి అప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. -
చేతకాకుంటే వెళ్లిపోండి
ఇరిగేషన్ అధికారులపై తుమ్మల ఫైర్ భద్రాచలం: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారుల సమక్షంలోనే ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. పుష్కర ఘాట్లలో బురదను తీసి, మెట్లకు రంగులు వేయాలని ఆదేశించినా చేయరా.. అని ఇరిగేషన్ ఈఈ రాములను నిలదీశారు. ‘ఈయన పెద్ద పుడుంగని జిల్లా మొత్తం అప్పగిస్తున్నావ్’ అంటూ ఎస్ఈ సుధాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చం ద్రబాబు జేజమ్మ వచ్చి నా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోలేరని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. -
వేషాలు వేయొద్దు..
ఏన్కూరు: ‘చెరువు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా.. ఎన్నాళ్ల నుంచి చెరువు పనులు జరుగుతున్నాయి. పనులు పారదర్శకంగా నిర్వహించాలి. వేషాలు, డ్రామాలు వేయొద్దు’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఊరచెరువు అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. చెరువు పనులు ఎప్పుడు ప్రారంభించారు. చెరువు ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలు భూమి ఉన్నది.. ఇప్పుటి వరకు ఏం పనులు చేశారు?, పనులు నాణ్యతగా చేస్తున్నారా? పనుల రికార్డులు చూపించండి అని ఇగిరేషన్ శాఖ అధికారులను అడిగారు. వారు సరైన రికార్డులు చూపించకపోవడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సంవత్సరాలు నుంచి ఉద్యోగం చేస్తున్నారు?, డ్రామాలు, వేషాలు వేయకండి, పనులు రైతులకు ఉపయోగపడేలా చేయండి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, అధికారులు చెరువు పనుల్లో భాగస్వామ్యం పెంచాలని కోరారు. చెరువు కట్టలపై రోలర్ తిరిగించాలన్నారు. తూములు, అలుగుల నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పటిష్టంగా చేయూలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఎంపీ వెంట ఎంపీపీ బాణోత్ మాధవి, జెడ్పీటీసీ కోపెల శ్యామల, తహశీల్దార్ పూసా సాంబశివరావు, ఎంపీడీవో కె.పాపారాణి, ఇరిగేషన్ డీఈ అంజయ్య, ఏఈ భగీరథబాబు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజశేఖర్, నాయకులు సూతకాని జైపాల్, ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల వెంకటేశ్వర్లు, శివకుమార్, డి.రామారావు, లచ్చిరాంనాయక ఉన్నారు. -
పనులు కాకముందే చెల్లింపులు?
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మునిసిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాజకీయ పార్టీల నాయకులు ప్రచార బాట పట్టారు. ఈ ఎన్నికలు ఇంజినీరింగ్ అధికారులకు అవకాశంగా మారాయి. ముఖ్యంగా చిన్న నీటి పారుదల అధికారులకు పంట పండింది. ఈ శాఖకు ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపులు జరుగుతాయి. మంజూరైన నిధులకు సంబంధించిన బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో సమర్పించాలి. లేకుంటే కేటాయించిన నిధులు మురిగిపోయే పరిస్థితులు ఉంటాయి. గత సంవత్సరం చిన్న నీటి పారుదల శాఖకు ఆలస్యంగా నిధులు మంజూరయ్యాయి. సమయం లేకపోవడంతో పలు గ్రామాల్లోని చెరువుల అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి. పనులు పూర్తికాకున్నా భవిష్యత్‌లో బిల్లులు చెల్లించాలంటే, నిధులు మురిగిపోకుండా ఉండాలంటే ఇపు్పుడు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు సమర్పించాల్సిందే. అది కూడా 31 మార్చి తేదీలోగా పీఏఓ అధికారులకు అందించాలి. 15 రోజులుగా సాగునీటి శాఖలో ఇదే దందా జరిగినట్లు తెలిసింది. కొన్ని పథకాల్లో చేపట్టిన పనులు 10 నుంచి 30 శాతం పూర్తయ్యాయి. నూరు శాతం పనులు జరిగినట్లు ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు పీఏఓలో సమర్పించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. పనులు పూర్తయితే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను బిల్లులతో జతచేసి అధికారులు అందించాల్సి ఉంటుంది. దీంతో యూసీ లేకుండానే బిల్లులు సమర్పించినట్లు తెలిసింది. సాగునీటి శాఖలో.. గత సంవత్సరం వివిధ పథకాల ద్వారా చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది. అయితే టెండర్లు నిర్వహించి, పనులు చేపట్టే నాటికి జూన్ నెల రానే వచ్చింది. తూతూమంత్రంగా పనులు చే సి 15 నుంచి 30 శాతం వరకు బిల్లులు కాంట్రాక్టర్లు తీసుకున్నారు. ఆ తర్వాత వర్షాకాలం రావడంతో పనులు చేపట్టే అవకాశాలు లేకుండా పోయాయి. భారీగా వర్షా లు కురవడంతో నీరు ఎక్కువగా ఉండి చెరువుల్లో పను లు చేయలేదు. ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క-సారల మ్మ జాతర రావడంతో పనుల ఊసేలేకుండా పోయింది. ఈలోగా మార్చి నెలాఖరు రానే వచ్చింది. జనవరి నాటి కి పురోగతి లేని పనులు మార్చి నాటికి పూర్తయినట్లు ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పర్సంటేజీలు తీసుకున్న తర్వాతే బిల్లులు పీఏఓలో సమర్పించారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పనులు చేయకున్నా బిల్లులు ఇస్తామనడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి అధికారులకు పర్సంటేజీలు ముట్టజెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు గోప్యం.. చిన్న నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతి వివరాలు ఇచ్చేందుకు అధికారులు దాట వేత ధోరణి అవలంబిస్తున్నారు. ఎన్ని చెరువులకు ఎన్ని నిధులు మంజూరయ్యా యి, ఏ మేరకు పనులు పూర్తయ్యాయో చెప్పాలని ఐబీ అధికారులను అడిగితే డివిజన్లలో వివరాలు తీసుకోమని సమాధానం ఇస్తున్నారు. డివిజన్లలో అడిగితే ఈఈలు లేరు.. వారు వస్తనే ఇస్తామని కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమాధానం వస్తోం ది. విజిలెన్స విచారణ చేపడితేనే చిన్న నీటి పారుదల శాఖలో చేపట్టిన పనుల్లో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.