పనులు కాకముందే చెల్లింపులు?
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మునిసిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాజకీయ పార్టీల నాయకులు ప్రచార బాట పట్టారు. ఈ ఎన్నికలు ఇంజినీరింగ్ అధికారులకు అవకాశంగా మారాయి. ముఖ్యంగా చిన్న నీటి పారుదల అధికారులకు పంట పండింది. ఈ శాఖకు ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపులు జరుగుతాయి. మంజూరైన నిధులకు సంబంధించిన బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో సమర్పించాలి.
లేకుంటే కేటాయించిన నిధులు మురిగిపోయే పరిస్థితులు ఉంటాయి. గత సంవత్సరం చిన్న నీటి పారుదల శాఖకు ఆలస్యంగా నిధులు మంజూరయ్యాయి. సమయం లేకపోవడంతో పలు గ్రామాల్లోని చెరువుల అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి. పనులు పూర్తికాకున్నా భవిష్యత్‌లో బిల్లులు చెల్లించాలంటే, నిధులు మురిగిపోకుండా ఉండాలంటే ఇపు్పుడు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు సమర్పించాల్సిందే.
అది కూడా 31 మార్చి తేదీలోగా పీఏఓ అధికారులకు అందించాలి. 15 రోజులుగా సాగునీటి శాఖలో ఇదే దందా జరిగినట్లు తెలిసింది. కొన్ని పథకాల్లో చేపట్టిన పనులు 10 నుంచి 30 శాతం పూర్తయ్యాయి. నూరు శాతం పనులు జరిగినట్లు ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు పీఏఓలో సమర్పించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. పనులు పూర్తయితే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను బిల్లులతో జతచేసి అధికారులు అందించాల్సి ఉంటుంది. దీంతో యూసీ లేకుండానే బిల్లులు సమర్పించినట్లు తెలిసింది.
సాగునీటి శాఖలో..
గత సంవత్సరం వివిధ పథకాల ద్వారా చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది. అయితే టెండర్లు నిర్వహించి, పనులు చేపట్టే నాటికి జూన్ నెల రానే వచ్చింది. తూతూమంత్రంగా పనులు చే సి 15 నుంచి 30 శాతం వరకు బిల్లులు కాంట్రాక్టర్లు తీసుకున్నారు. ఆ తర్వాత వర్షాకాలం రావడంతో పనులు చేపట్టే అవకాశాలు లేకుండా పోయాయి. భారీగా వర్షా లు కురవడంతో నీరు ఎక్కువగా ఉండి చెరువుల్లో పను లు చేయలేదు.
ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క-సారల మ్మ జాతర రావడంతో పనుల ఊసేలేకుండా పోయింది. ఈలోగా మార్చి నెలాఖరు రానే వచ్చింది. జనవరి నాటి కి పురోగతి లేని పనులు మార్చి నాటికి పూర్తయినట్లు ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పర్సంటేజీలు తీసుకున్న తర్వాతే బిల్లులు పీఏఓలో సమర్పించారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పనులు చేయకున్నా బిల్లులు ఇస్తామనడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి అధికారులకు పర్సంటేజీలు ముట్టజెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు గోప్యం..
చిన్న నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతి వివరాలు ఇచ్చేందుకు అధికారులు దాట వేత ధోరణి అవలంబిస్తున్నారు. ఎన్ని చెరువులకు ఎన్ని నిధులు మంజూరయ్యా యి, ఏ మేరకు పనులు పూర్తయ్యాయో చెప్పాలని ఐబీ అధికారులను అడిగితే డివిజన్లలో వివరాలు తీసుకోమని సమాధానం ఇస్తున్నారు. డివిజన్లలో అడిగితే ఈఈలు లేరు.. వారు వస్తనే ఇస్తామని కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమాధానం వస్తోం ది. విజిలెన్‌స విచారణ చేపడితేనే చిన్న నీటి పారుదల శాఖలో చేపట్టిన పనుల్లో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.