Engineering officials
-
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
మచిలీపట్నం (చిలకలపూడి) : ‘ఎన్నిసార్లు చెప్పినా మారరా?.. కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప కోట్ల రూపాయలు వెచ్చించి బందరు ప్రభుత్వాస్పత్రిలో నిర్మించిన కొత్త భవనాన్ని వినియోగంలోకి తీసుకురారా?’ అని ఇంజినీరింగ్ అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. తొలుత విద్య, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ గర్భిణుల కోసం ఆస్పత్రిలో నిర్మించిన భవనానికి త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికల కోసం ప్రత్యేక శానిటరీ ఏర్పాట్లకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి విలువగల భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జిల్లా పరిషత్ స్థలంలో రూ.5 కోట్లతో కన్వెన్షన్ హాలు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ తోట్లవల్లూరు మండలంలో ఉపాధి నిధులతో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా పరిషత్ అతిథిగృహం కేటాయింపుపై సభ్యుల ఆవేదన విజయవాడలోని జిల్లా పరిషత్ అతిథిగృహం గదుల కేటాయింపులో జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వెళ్లినప్పుడు జెడ్పీటీసీ సభ్యులకు గదుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్‌కు చెందిన అతిథిగృహంలో ఇతర శాఖల అధికారులకు కేటాయించటంపై అసహనం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యులకే అతిథిగృహంలో గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌ను కోరారు. అనంతరం వైస్‌చైర్మన్ శాయన పుష్పావతి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశం, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యులు దాసరి కరుణజ్యోతి అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో టి.దామోదరనాయుడు, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
మింగలేక.. కక్కలేక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ప్రభుత్వమిచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక్కరోజే గడువుంది. ఏదో ఒకటి చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి, శాఖాధిపతుల సతాయింపు భరించలేం. పనులు ప్రారంభించని చోట కనీసం సిమెంట్ అయినా బుక్ చేసేయాలి. ఒక్కసారి సిమెంట్ బుక్ చేస్తే పని అయిపోయినట్టే’ ఇదీ ఇంజినీరింగ్ ఉన్నతాధికారుల ఆదేశం. దీంతో కాదనలేక, అవుననలేక మండల స్థాయి ఇంజినీరింగ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఉన్నతాధికారులు చెప్పినట్టు సిమెంట్ బుక్ చేస్తే తదుపరి జరిగే అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాస్‌లు చెప్పినట్టు చేయకపోతే ఇబ్బందులు తప్పవని అంతర్మథనం చెందుతున్నారు. నాణ్యతకు తిలోదకాలు జిల్లాలో రూ.800కోట్లతో ఉపాధి మెటీరియల్ కాంపొనెంట్ కింద పనులు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా సీసీ రోడ్లే ఉన్నాయి. పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించడమే ధ్యేయంగా నచ్చిన రీతిలో ఇసుక, సిమెంట్, కంకర కలిపి రోడ్లు వేస్తున్నారు. ఒకవైపు రోడ్లు నిర్మిస్తుండగానే మరో వైపు ధ్వంసమవు తున్నాయి.ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో నిధులెలా ఖర్చు చేయాలోననే చూస్తున్నారే తప్ప పనుల్లో నాణ్యత కనబడడం లేదు. ఈ ఒక్కరోజులోగా పనులు చేపట్టకపోతే దాదాపు రూ. 20కోట్ల వరకు నిధులు నిరుపయోగమవుతాయన్న అభిప్రాయంతో పని ప్రారంభించకపోయినా సిమెంట్ పేరుతో మండలానికి రూ. అరకోటి బుక్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వివక్షతో మూల్యం మంజూరు మేరకు పనులు ప్రారంభించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ, వైఎస్సార్సీపీ పంచాయతీలనే తేడా లేకుండా పనులు చేపట్టి ఉంటే ఈపాటికే అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు అయిపోయేవి. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారని వైఎస్సార్సీపీకి చెందిన పలు పంచాయతీల్లో పనులు చేపట్టకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో సెటిల్మెంట్ చేసుకుని, రాజీకొస్తేనే పనులు మొదలు పెట్టాలని లేదంటే బిల్లులు మంజూరవ్వవని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంజూరైన అన్ని చోట్ల పనులు ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాని దుస్థితి నెలకొంది. -
డబ్బుల్ ట్రబుల్
అనంతపురం కార్పొరేషన్ : కార్పొరేషన్ టైం బాగుండి సరిపోయింది. లేకపోతే ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన పథకం పారి ఉంటే సంస్థ రూ.50 లక్షలు నష్టపోయుండేది. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణ, ఆర్సీసీ డివైడర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కౌన్సిల్ అనుబంధ అజెండాలో ఉంచారు. అనుబంధ అజెండాలోని 5వ అంశంగా.. నగర పాలక సంస్థ పరిధిలోని చౌదరి సర్కిల్ నుంచి రుద్రంపేట బైపాస్ రోడ్డు వరకు గల రోడ్డును విస్తరించి ఆర్సీసీ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు రూ.48.55 లక్షలతో ఎస్టిమేట్ వేశారు. ఈ మేరకు పరిపాలనపరమైన అనుమతి మంజూరు చేయూలని కోరారు. మరో వైపు అనుబంధ అజెండాలోని 9వ అంశంగా.. నగర పాలక సంస్థ పరిధిలోని చౌదరి సర్కిల్ నుంచి శ్రీ నగర్ కాలనీ జంక్షన్ వరకు గల రోడ్డును విస్తరించి ఆర్సీసీ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు రూ.45.49 లక్షలతో ఎస్టిమేట్ తయారు చేశారు. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయూలని కోరారు. ఈ రెండు అంశాల్లోని పని ఒక్కటే కావడం గమనార్హం. అయితే ఒక్క పనిని రెండు వేర్వేరు పనులుగా చూపిస్తూ ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అనుమతి కోసం ఉంచారు. కాగా, నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ కోసం ఉంచిన ఏ ఒక్క పనినీ కౌన్సిల్ సభ్యులు ఆమోదించలేదు. దీంతో అధికారుల పథకం బెడిసి కొట్టినట్లయ్యింది. ఒక వేళ అనుమతి లభించి ఉంటే ఒక పని చేసి దానికి రెండు బిల్లులు తీసుకుని సంస్థకు టోకరా వేసేవారనడంలో సందేహం లేదు. అధికారులు ఇంతగా బరితెగించారంటే ముఖ్య ప్రజాప్రతినిధులెవరైనా వారిపై ఒత్తిడి తెచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థారుు విచారణ జరిపిస్తే.. గతంలో కూడా ఇదే రీతిలో ఒక పనికి రెండు ఎస్టిమేషన్లు వేసి నిధులు దోచుకున్న సంఘటనలేవైనా ఉంటే వెలుగు చూసే అవకాశం ఉంటుందని ఓ కార్పొరేటర్ వ్యాఖ్యానించారు. ఈ తతంగంపై సోమవారం కార్పొరేషన్లో కొందరు ఉద్యోగులు గుసగుసలు పోరుున నేపథ్యంలో పాలక వర్గం ఏ విధంగా స్పందిస్తుందోననే ఉత్సుకత నెలకొంది. -
పనులు కాకముందే చెల్లింపులు?
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మునిసిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాజకీయ పార్టీల నాయకులు ప్రచార బాట పట్టారు. ఈ ఎన్నికలు ఇంజినీరింగ్ అధికారులకు అవకాశంగా మారాయి. ముఖ్యంగా చిన్న నీటి పారుదల అధికారులకు పంట పండింది. ఈ శాఖకు ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపులు జరుగుతాయి. మంజూరైన నిధులకు సంబంధించిన బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో సమర్పించాలి. లేకుంటే కేటాయించిన నిధులు మురిగిపోయే పరిస్థితులు ఉంటాయి. గత సంవత్సరం చిన్న నీటి పారుదల శాఖకు ఆలస్యంగా నిధులు మంజూరయ్యాయి. సమయం లేకపోవడంతో పలు గ్రామాల్లోని చెరువుల అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి. పనులు పూర్తికాకున్నా భవిష్యత్‌లో బిల్లులు చెల్లించాలంటే, నిధులు మురిగిపోకుండా ఉండాలంటే ఇపు్పుడు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు సమర్పించాల్సిందే. అది కూడా 31 మార్చి తేదీలోగా పీఏఓ అధికారులకు అందించాలి. 15 రోజులుగా సాగునీటి శాఖలో ఇదే దందా జరిగినట్లు తెలిసింది. కొన్ని పథకాల్లో చేపట్టిన పనులు 10 నుంచి 30 శాతం పూర్తయ్యాయి. నూరు శాతం పనులు జరిగినట్లు ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు పీఏఓలో సమర్పించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. పనులు పూర్తయితే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను బిల్లులతో జతచేసి అధికారులు అందించాల్సి ఉంటుంది. దీంతో యూసీ లేకుండానే బిల్లులు సమర్పించినట్లు తెలిసింది. సాగునీటి శాఖలో.. గత సంవత్సరం వివిధ పథకాల ద్వారా చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది. అయితే టెండర్లు నిర్వహించి, పనులు చేపట్టే నాటికి జూన్ నెల రానే వచ్చింది. తూతూమంత్రంగా పనులు చే సి 15 నుంచి 30 శాతం వరకు బిల్లులు కాంట్రాక్టర్లు తీసుకున్నారు. ఆ తర్వాత వర్షాకాలం రావడంతో పనులు చేపట్టే అవకాశాలు లేకుండా పోయాయి. భారీగా వర్షా లు కురవడంతో నీరు ఎక్కువగా ఉండి చెరువుల్లో పను లు చేయలేదు. ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క-సారల మ్మ జాతర రావడంతో పనుల ఊసేలేకుండా పోయింది. ఈలోగా మార్చి నెలాఖరు రానే వచ్చింది. జనవరి నాటి కి పురోగతి లేని పనులు మార్చి నాటికి పూర్తయినట్లు ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పర్సంటేజీలు తీసుకున్న తర్వాతే బిల్లులు పీఏఓలో సమర్పించారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పనులు చేయకున్నా బిల్లులు ఇస్తామనడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి అధికారులకు పర్సంటేజీలు ముట్టజెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు గోప్యం.. చిన్న నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతి వివరాలు ఇచ్చేందుకు అధికారులు దాట వేత ధోరణి అవలంబిస్తున్నారు. ఎన్ని చెరువులకు ఎన్ని నిధులు మంజూరయ్యా యి, ఏ మేరకు పనులు పూర్తయ్యాయో చెప్పాలని ఐబీ అధికారులను అడిగితే డివిజన్లలో వివరాలు తీసుకోమని సమాధానం ఇస్తున్నారు. డివిజన్లలో అడిగితే ఈఈలు లేరు.. వారు వస్తనే ఇస్తామని కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమాధానం వస్తోం ది. విజిలెన్స విచారణ చేపడితేనే చిన్న నీటి పారుదల శాఖలో చేపట్టిన పనుల్లో అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.