
సాక్షి, అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో నిర్వాసిత కుటుంబాలకు చేసిందేమీ లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డామ్, రెండు కాల్వలు తవ్వడం కాదని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని అప్పుడే ప్రాజెక్ట్ పూర్తయినట్లు అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వాసితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారని తెలిపారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)
పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తి చేస్తారని చెప్పారు. అన్ని చర్యలు చేపడుతున్న టీడీపీ నేతలు పనిగట్టుకొని చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. జులై చివరి నాటికి ఆర్ అండ్ ఆర్ కాలనీలు పూర్తి చేసి 15 వేల కుటుంబాలను తరలిస్తామని తెలిపారు. మనసున్న మా రాజు జగన్‌మోహన్ రెడ్డి అని మంత్రి అనిల్ కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు)
Comments
Please login to add a commentAdd a comment