సాక్షి, విజయవాడ: పోలవరంపై సాక్షి అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర కేబినెట్ నోట్‌లో ఫేజ్ 1 ప్రస్తావన ఉందా..? అంటూ ప్రశ్నించగా తెల్లమొహం వేశారు. పోలవరం ఎత్తు తగించేందుకు అంగీకరించడంపై ప్రశ్నించగా.. కేంద్ర కేబినెట్ నోట్ చూపించకుండానే వెళ్లిపోయారు. 41.15 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలిపినట్టు ప్రకటించిన మంత్రి నిమ్మల.. ఫేజ్ 2 తర్వాత నిధులు వస్తాయంటూ బుకాయించారు.
పోలవరంపై చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది.
కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్‌లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు.
ఇదీ చదవండి: పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం!
Comments
Please login to add a commentAdd a comment