
విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తూ జగన్ పాలన పై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ అవినాష్.. ఇరు ప్రభుత్వాల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు.
కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరినీ మోసం చేసింది. ఈ బడ్జెట్ చూసి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. రైతులను,విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళల్ని మోసం చేశారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో టార్గెట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకులు హింసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడితే పార్టీ అండగా ఉంటుంది’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.