సాక్షి, ఢిల్లీ: పోలవరం ఎత్తు తగ్గించడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎత్తు తగ్గించి నిర్మించడానికి ఇంత ధనం అవసరం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నారాయణ ప్రశ్నించారు.
పోలవరం 41 మీటర్లకు తగ్గితే బ్యారేజిగా మాత్రమే పనికివస్తుందని నారాయణ అన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు రావు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పోలవరం ఇక ఉత్త బ్యారేజే
Comments
Please login to add a commentAdd a comment