psr nellor
-
Nellore: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాల్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. మృతి చెందిన వారిని చందు, కల్పనలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం
సాక్షి, సూళ్లురుపేట (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సురేష్ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బినామీ బాలు అనే వ్యక్తి పక్కా ప్లాన్‌తో సురేష్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. -
చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: సిటీ నియోజకవర్గంలో 7 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. నారా లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని విమర్శించారు. లోకేష్‌ను చూసి ఎవరూ భయపడరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ప్రశంసించారు. చిల్లర రాజకీయాలు లోకేష్ ఇకనైనా మానాలని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. తండ్రి, తాతలను అడ్డం పెట్టుకుని లోకేష్‌లా తాము రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. -
పోటెత్తిన జనం.. ఆయుర్వేదం మందు పంపిణీ నిలిపివేత
సాక్షి, నెల్లూరు : కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. మందుకోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ కష్టంగా మారింది. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తూనట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుండి విశాలామైన గ్రౌండ్లో మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ: కరోనాకు నేటినుంచి ఆయుర్వేద మందు పంపిణీ -
రాజీకని పిలిచి.. స్నేహితులే దారుణంగా
సాక్షి, నెల్లూరు : తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే అనుమానంతో రాజీకని పిలిచి ఓ యువకుడ్ని స్నేహితులే దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన బుజబుజనెల్లూరులోని మురళీ జ్యూవెలరీషాపు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...చెన్నైకు చెందిన మురగన్ భాస్కర్(25) తన తండ్రిని హత్య చేశారన్న అక్కసుతో పదిహేనేళ్ల వయస్సులోనే హత్యచేసి జైలు జీవితం అనుభవించాడు. పదేళ్ల కిందట నెల్లూరుకు వచ్చాడు. బుుజబుజనెల్లూరు న్యూకాలనీలో ఉంటూ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడసాగాడు. అతనిపై నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో దొంగతనం కేసు ఉంది. భాస్కర్‌కు బుుజబుజనెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన వెంకటేష్, దేవ, ఆరీఫ్, రసూల్ స్నేహితులు. వారం రోజుల క్రితం వెంకటేష్, దేవ ఆరుబయట మద్యం, గంజాయి సేవిస్తుండగా ఎవ్వరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మందలించి పంపివేశారు. అయితే పోలీసులకు భాస్కరే సమాచారం అందించాడన్న అనుమానం వారిలో బలంగా నాటుకుపోయింది. ఎలాగైనా భాస్కర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వెంకటేష్ తన స్నేహితులైన దేవా, అన్సర్, రసూల్, మరో వ్యక్తిని ఓ దుకాణం వద్ద ఉండమని చెప్పి రాజీచేసుకుందామని భాస్కర్‌ను పిలిచాడు. దీంతో భాస్కర్ తనతో సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి సమీపంలోని మురళీ జ్యూవెలరీషాపు వద్దకు వెళ్లారు. వెంకటేష్, అతని తల్లి అక్కడకు చేరుకోగా ఇరువర్గాలు మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో వెంకటేష్ సైగ చేయడంతో మిగిలిన వారు అక్కడకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో భాస్కర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, నగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, వేదాయపాళెం ఎస్సైలు లక్ష్మణ్‌రావు, పుల్లారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఘటనా స్థలంలోని మహిళలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కరోనాను ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నాం
-
కాలేజ్‌లో వికేంద్రీకరణ సదస్సు
-
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నదాతలకు సమృద్ధిగా పంటలు పండి అందరికీ మేలు జరగాలని రాష్ట్ర హోం, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకతోటి సుచరిత ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరై రొట్టె పట్టుకున్నారు. హోం మంత్రితోపాటు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బారాషాహీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ పాలనలో రైతులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టె పట్టుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..వైఎస్సార్ సీపీ 100 రోజుల పాలన బాగా జరిగిందని, రానున్న రోజుల్లోనూ సంక్షేమ సర్కారుగా తాము పనిచేస్తామని తెలిపారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంటలకు నీరు ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం దర్గా ప్రాంగణంలో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు పాల్గొన్నారు. కాగా శనివారంతో రొట్టెల పండుగ ముగియనుంది. శుక్రవారం కావడంతో దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. -
పోలవరం పూర్తి చేసి తీరతాం
-
పోలవరం పూర్తి చేసి తీరతాం
సాక్షి, నెల్లూరు : పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసి తీరతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదని కేవలం కాంట్రాక్టర్లను మాత్రమే రద్దు చేశామని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇచ్చామని, నూతన కాంట్రాక్టర్లచే నవంబర్ నుంచి పనులు పారదర్శకంగా మొదలవుతాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం హెడ్‌వర్క్స్(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు నోటీసులు జారీ చేయడంతో ఆ కంపెనీలు తప్పుకోవడం తెలిసిందే. -
రాముడు నడయాడిన ‘రామతీర్థం’
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళుతుండగా శివ పూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకత లింగాన్ని ప్రతిష్టించి కొలిచారని, అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతోందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీరంగా.. రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీరంలో బ్రహ్మోత్సవాల వేళ సముద్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్టించిన స్పటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సాక్షి, రామతీర్థం(నెల్లూరు) : కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికుడైన కోటంరెడ్డి శేషాద్రిరెడ్డికి స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమై సుమారు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే స్వామి వారి వివిధ అలంకరణలకు రామతీర్థం పరిసర ప్రాంతాల భక్తులు ఉభయకర్తలుగా వ్యవహరించడం ఆనవాయితీ. నేటికి ఇదే ఆచారంగా కోనసాగడం విశేషం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వరవడిన భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులకు అపార నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ వివరాలు అతి పురాతనమైన శైవక్షేత్రం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 23వ తేదీ ఆదివారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి, 24వ తేదీ ధ్వజారోహణ, 25న చిలక వాహనం, 26న హంస వాహనం, 27న పులి వాహనం, 28న రావణసేవ, 29న నందిసేవ, 30న రథోత్సవం, జూలై 1న స్వామి వారికి కల్యాణం, 2న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), అదే రోజు రాత్రికి తెప్పోత్సవం, అశ్వ వాహనం, 3వ తేదీన ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే రథోత్సవం, స్వామి వారి కల్యాణం, తీర్థవాది ఘట్టాలకు స్వామి వారిని తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీర్థవాదికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఆలయ అధికారు మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా చేరుకోవాలంటే.. ఉత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. అల్లూరు, పద్మనాభసత్రం నుంచి కూడా ప్రైవేట్ వాహనాలు నిత్యం రామతీర్థం వరకు నడుస్తుంటాయి. కావలి నుంచి కూడా నేరుగా రామతీర్థానికి బస్సు సౌకర్యం ఉంది. -
నయా జోష్!
సాక్షి, అమరావతి : రాష్ట్రమంతా ఒకే నినాదం.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ మార్పు కోసం ఊరూ–వాడా, పల్లె–పట్నం హోరెత్తుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలు జనసంద్రాలై ‘జై జగన్’ అంటూ నినదిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ, యువత, మహిళలు కుల మతాలకు అతీతంగా కొత్త జోష్‌తో కదం తొక్కుతున్నారు. గురువారం నెల్లూరు, నంద్యాలలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో అభిమానం ఉరకలేసిన వేళ కనిపించిన చిత్రావిలి. -
ఓటు దొంగలున్నారు.. జాగ్రత్త!
జిల్లాలోని పలు నియోజకవర్గంలో గెలుపోటములను తారుమారు చేసే ఓటర్లు సంఖ్య మూడు వేల నుంచి నాలుగువేలు మాత్రమే. ఇది గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 2014లో టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మి లక్షయ్యనాయుడుపై 5,635 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడు వేలు నుంచి నాలుగు వేలు ఓట్లు అటు పడాల్సినవి ఇటు పడితే ఫలితాలు తారుమారే. ఈ క్రమంలో ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఓట్లు తొలగింపుల కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వస్తున్న దరఖాస్తులు చూస్తుంటే ఎన్నికల్లో లబ్ధికోసం ఓ వర్గం చేస్తున్న పాలి ట్రిక్స్‌గా న్యూట్రల్ ఓటర్లు అభిప్రాయ పడుతున్నారు. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫామ్–7 దరఖాస్తులు (ఓట్లు తొలగింపులకు సంబంధించిన ఫామ్స్) రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులైన ఓటర్లే లక్ష్యంగా వేల సంఖ్యల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదవుతున్నాయిని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాకే పరిమితం అయిన ఈ జాఢ్యం ఆ జిల్లా సరిహద్దు నియోజకవర్గం అయిన వెంకటగిరికీ పాకింది. ఎవరు చేస్తున్నారో.. ఎక్కడ నుంచి చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో.. ఇలా గంపగుత్తుగా వస్తున్న «ఓట్ల తొలగింపు దరఖాస్తులపై అధికారులు పక్కగా విచారణ చేపట్టి ఓట్లు దొంగల అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రతిపక్షపార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దరఖాస్తులు వచ్చినంతమాత్రాన ఓట్లు తొలగించే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిన తరువాత సరైన కారణాలతోనే ఓట్లు తొలగింపులు చేస్తామని అధికారులు చెబుతున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎంత వరకు సాధ్యమని, అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు వేలసంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం సాధ్యమయ్యే పనికాదంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. 2,200 క్లెయిములతో విస్తుపోయిన అధికారులు కలవాయి మండలంలో ఓటు తొలగింపులకు సంబంధించి మొత్తం 2,200 క్లెయిములు అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ దరఖాస్తులన్నీ రాత్రికి రాత్రే ఒక్క రోజే రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పక్కాగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కలువాయి మండలంలోని 43 పోలింగ్ స్టేషన్లు ఉండగా 26 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 26 మంది పేరున 2,263 ఫామ్–7 క్లెయిములు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఈ క్లెయిములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మాజీ కన్వీనర్లు, ప్రస్తుత కన్వీనర్ల పేరున దరఖాస్తులు అందాయి. వీటిలో మెజారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు కావడం గమనార్హం. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సామల మోహన్‌రెడ్డి. కలువాయి మండలం బాలాజీ రావుపేటకు చెందిన వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్. చిత్రమేమిటంటే మోహన్‌రెడ్డి తన ఓటును తొలగించాలని ఆన్లైన్ ద్వారా ఫామ్–7 దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు విచారణకు రావడంతో అవాక్కయ్యాడు. ఇంకా మోహన్‌రెడ్డి గ్రామానికి చెందిన మరో 30 మంది ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో ఫామ్–7 దరఖాస్తు చేసినట్లు నమోదైందని అధికారులు మోహన్‌రెడ్డికి వివరించడంతో విస్తుపోయాడు. తనకు తెలియకుండా అలా ఎవరు చేశారో అర్థం కావడం లేద ని అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతున్నాడు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్లా రమణారెడ్డి. కలువాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పేరుతో 169 ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో ఫామ్–7 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఆ క్లెయిమ్‌లలో మోహన్‌రెడ్డి భార్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లు ఉన్నాయి. మోహన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో ఆన్లైన్లో క్లెయిములు పెట్టిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలి వెంకటగిరి నియోజకవర్గంలో వేలాదిగా వచ్చిన ఫామ్–7 దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ జరిపించాలి. ప్రతి దరఖాస్తుకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టాలి. ఓట్లు తొలగింపులపై ఓటర్లలో ఉన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత అధికారులదే. – జి.ఢిల్లీబాబు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్, వెంకటగిరి ఆన్లైన్లో వచ్చిన ఫారమ్–7 దరఖాస్తులు వెంకటగిరి 344 కలువాయి 2200 రాపూరు 145 సైదాపురం 683 బాలాయపల్లి 229 డక్కిలి 300 మొత్తం 3901 -
పుచ్చకాయతో నష్టాలు
పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది. సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ధరలు భారీగా పతనం ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి. – సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం డిసెంబర్ నెలలో నాటుకోవాలి రైతులు డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకుంటే పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. – ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు -
సమస్యల్లో ఇందిరమ్మ
కావలిఅర్బన్: పట్టణంలోని ముసునూరులో ఇందిరమ్మ పేరుతో కాలనీ ఉంది. గొప్ప నాయకురాలి పేరు మీద ఉన్న ఈ కాలనీ ప్రజలు మాత్రం నిత్యం సమస్యల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు గడచిన ఐదేళ్లుగా కాలనీ అభివృద్ధిపై కనికరం కూడా చూపలేదు. ముసునూరులోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 5 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాలనీలో సుమారు 15,00 మంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టణంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అన్ని కాలనీలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఆయన అకాల మరణం చెందారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వారిపైన నిర్లక్ష్యం ప్రదర్శించాయి. రూ. కోట్లాది మున్సిపల్ నిధులను అధికారపార్టీ ప్రజాప్రతినిధుల వార్డులలో వెచ్చించుకుంటున్నారు. బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చూపారు. మౌలిక వసతుల కొరత కాలనీ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు దాటుతున్నా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. ఇళ్లు కట్టుకుని ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఇళ్లలోకి కాపురాలు వచ్చారు. కాని ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ జీవించలేక తిరిగి కావలికి వెళ్లి బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాలనీలో రోడ్లు నిర్మించాలని స్థానికులు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా తాగునీరు కల్పించాలని కోరారు. డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో ఒక బోరు మాత్రమే పనిచేస్తుంది. దాని నుంచి అనేక కుటుంబాల ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి ఆ నీరు కూడా రాదని అంటున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు దక్షిణ బజారులో ఒక బోరు నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకా అనేక వసతులు కల్పించాలని మొర పెట్టుకున్నా అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదు. మరమ్మతుకు నోచుకోని బోర్లు కాలనీలో కొన్ని బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన విషసర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కాలనీలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాటు చేయాల్సి ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సున్నా కాలనీలో నివశిస్తున్న నిరుపేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేయడంలేదు. ఇందిరమ్మ కాలనీలో ఉన్నవారికి వీటిని వర్తింపజేయడంలేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న వార్డులలో మాత్రమే అభివృద్ధి పథకాలను అందజేస్తున్నారంటూ వాపోతున్నారు. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు. రోడ్లు నిర్మించండి ఇందిరమ్మ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీధులు గుంతలమయంగా ఉన్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు నిర్మించి ఆదుకోండి. – పోట్లూరు రవి, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి దక్షిణ బజారులో బోరు నిర్మించండి కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. తాగునీటి సరఫరా అంతంత మాత్రం గానే ఉంటుంది. దక్షిణ బజారులో బోరు నిర్మిస్తే కొంతవరకు తాగునీటి సమస్య తొలగుతుంది. –ఎస్కే ఖాలీబీ, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి -
చంద్రబాబును ప్రజలు నమ్మరు
నెల్లూరురూరల్: ప్రజలను మోసం చేసే సీఎం చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం నమ్మరని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీ మస్తానయ్య పేర్కొన్నారు. రూరల్ మండలం కాకుపల్లి, లింగాయపాళెం, గమళ్లపాళెంలో సోమవారం ఆయన బీజేపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని విధంగా నిధులు కేటాయించారన్నారు. కానీ చంద్రబాబు కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసులగౌడ్, ముక్కు రాధాకృష్ణ, రఘురామయ్య, సుబ్రహ్మణ్యంరెడ్డి, పట్రంగి నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ అభిమాని ఆత్మహత్య
కావలి: పట్టణంలోని సబ్‌కోర్టు వీధిలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసుపులేటి నరేంద్ర (24) అనే పవన్ కల్యాణ్ అభిమాని సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన నరేంద్ర కావలి పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అవివాహితుడైన నరేంద్ర ప్రేమించిన యువతి వ్యవహారంలో మనస్థాపం చెంది నాలుగు రోజులుగా మద్యం తాగుతూ సన్నిహితుల వద్ద తన ప్రేమ విఫలంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. తాను ప్రేమించిన యువతిని ఇంటికి తీసుకువస్తానని తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ విషయాన్ని బాబాయ్‌కి చెప్పగా, ఆయన మీ నాన్నాతో నేను మాట్లాడుతాను, ఎక్కడున్నవో చెప్పు అని నరేంద్రను ఫోన్లో ప్రశ్నించాడు. ఎందుకులే బాబాయ్... అని సమాధానం చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో సోమవారం ముసునూరు దాటిన తర్వాత చెంచుగానిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రామచంద్రాపురం గ్రామంలో విషాదం అలముకొంది. -
పునరావాసం కల్పించకుంటే పోరాటమే
నెల్లూరు(మినీబైపాస్): పేదలకు పునరావాసం కల్పిం చకుండా అక్రమణల పేరుతో నివాసాలను తొలగిస్తే వారితో కలిసి పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని భక్తవత్సలనగర్, ఉమ్మారెడ్డిగుంట ప్రాంతా ల్లో ఆదివారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటుండగా ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని కోటంరెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలు సైతం ఉన్నాయని, కూలి పనులు చేసుకుని తిండి తినకుండా గూడు నిర్మించుకున్నామని, ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడకు వెళ్లాని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో ఇష్టానుసారంగా మార్కింగ్ చేపట్టి ఉన్నారన్నారు. రైల్వే ట్రాక్ అవసరంలేని చోట మార్కింగ్ ఇచ్చి ఉన్నారని, పునరావా సం కల్పించకుండా ఖాళీ చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పరిహారం, ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజ ల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇన్చార్జి మొయిళ్ల సురేష్‌రెడ్డి, 21 వడివిజన్ ఇన్చార్జి చేజర్ల మహేష్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు కట్టా వెంకటరమణయ్య, నాయకుల వెంగళ్‌రెడ్డి, రాజారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భాస్కర్, అమీర్జాన్, కృష్ణ, రాజేశ్వరమ్మ, మాదా బాబు, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
కాయ్ రాజా..కాయ్
► పదికి రూ.100, వందకు రూ.1000 ► వెంకటేశ్వరపురం కేంద్రంగా జోరుగా సింగిల్ నంబర్లాట ► ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో విచ్చవిడిగా జూదం నెల్లూరు: నగరంలోని వెంకటేశ్వరపురం కేంద్రంగా సింగిల్ నంబరు నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. పదికి రూ.100, వందకు రూ.1000 వస్తుందని ఆశ చూపి కొందరు నిర్వాహకులు జూదాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నడుస్తున్నా ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఈ ఆట కొనసాగుతోంది. వెంకటేశ్వరపురంలో కేంద్రంగా జరుగుతున్న ఈ ఆట చుట్టు పక్కల ప్రాంతాలైన జనార్ధన్ రెడ్డి కాలనీ, పడుగుపాడు, కోవూరు, సాలుచింతల ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వందకు వెయ్యి వస్తుందన్న ఆశతో చిన్న, మధ్య తరగతి వారు ప్రధానంగా యువకులు ఆకర్షితులై ఈ ఆట ఆడుతూ అప్పుల పాలై నష్టపోతున్నారు. వెంకటేశ్వరపురంలో ఉన్న ఏజెంట్ల వద్ద వంద కడితే నంబరు తగిలితే రూ.1000 వస్తుంది. ఆ వెయ్యిలో ఏజెంట్ కమీషన్ రూపంలో రూ.200 పట్టుకొని రూ.800 ఇస్తున్నారు. రూ.10 నుంచి ఈ ఆట మొదలవుతోంది. వెంకటేశ్వరపురం సెంటర్లో ఉన్న ఏజెంట్లు ఈతంతగాన్ని నడిపిస్తూ కమీషన్లతో లబ్ధిపొందుతుంటే, దీని బారిన పడినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కష్టం చేసి కూలి డబ్బులు తెచ్చుకుని ఏజెంట్ల చేతుల్లో పెడుతున్నారు. ఓ వ్యక్తి ఇటీవల రూ.20 వేలు నంబర్ల ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిసింది. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో మరిన్ని అప్పులు చేస్తూ అప్పుల పాలైపోతున్న పరిస్థితిలో కూరుకుపోయాడు. ప్రతి రోజూ ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి నంబర్లను ఏజెంట్లు ప్రకటిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. తెల్లవారు జాము నుంచే సెంటర్లలో నిర్వాహకుల సందడి మొదలవుతోంది. ఏ నంబరుకు ఆడితే ఎంత వస్తుంది.. ఎంత మంది పందెం పెట్టారు అన్న అంశంపై చర్చతో వీరి ఆట ప్రారంభమవుతోంది. గతంలో సింగిల్ నంబర్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి వారే కాకుండా కొందరు వ్యాపారస్తులు సైతం ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. ఒక్క వెంకటేశ్వరపురంలోనే రోజుకు రూ.లక్ష వరకు ఈ ఆటలో లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో ‘కాటన్’ వలె ఇప్పుడు సింగిల్ నంబర్ల ఆటలో కూడా చాలా మంది డబ్బులు పొగొట్టుకొని బాధపడుతున్నారు. ముఖ్యంగా నిర్వాహకులు కొత్త వారిని ఆకర్షిస్తూ వారితో ఆట ఆడిస్తున్నారు. రూ. లక్షల్లో ఈ ఆట కొనసాగుతుందంటే ఈ వ్యసనం ఏ మేరకు వ్యాపించిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి నిషేధిత ఆటలను పోలీసులు గుర్తించి మరికొంత మంది దీని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
పరీక్షలెప్పుడో?
► అగమ్యగోచరంలో బీఈడీ విద్యార్థులు ► ప్రథమ సంవత్సర పరీక్షలు జరగని వైనం ► నిర్లక్ష్యంగా వీఎస్‌యూ అధికారులు జిల్లాలో బీఈడీ విద్యార్థుల పరిస్థితి అగయగోచరంగా మారింది. ప్రథమ సంవత్సరం ముగిసి రెండో సంవత్సరంలో అడుగు పెట్టినా నేటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పరీక్షల తేదీని నేటికీ ప్రకటించకపోవడంపై విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు. నెల్లూరు: జిల్లాలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేటు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారు రెండు వేల మందికి పైగా బీఈడీ కోర్సు చదువుతున్నారు. 2015–16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్లు కోర్సుగా ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1, 2 సెమిస్టర్లు, రెండో సంవత్సరానికి సంబంధించి 3, 4 సెమిస్టర్లు పరీక్షలు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు తొలి సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో జరగాల్సి ఉంది. రెండో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు 1వ సెమిస్టర్ పరీక్ష ఇంత వరకు జరగలేదు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 3వ సెమిస్టర్ డిసెంబర్లో నిర్వహించారు, 4వ సెమిస్టర్ ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. వారికి టీచింగ్ ప్రాక్టికల్స్ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు జరపకపోవడంతో బీఈడీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సెమిస్టర్ పరీక్షలు వెంట, వెంటనే జరిపితే ఏ విధంగా రాయాలని ప్రశ్నిస్తున్నారు. పట్టించుకోని అధికారులు బీఈడీ పరీక్షలను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఈ ³రీక్షలపై వీఎస్‌యూ అధికారులు ఎలాంటి దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీల పరిధిలోని బీఈడీ కళాశాలల్లో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలో వీఎస్‌యూ అధికారులు ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ముండిపడుతున్నారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అకడమిక్ పూర్తియినా నేటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ విషయంలో బీఈడీ కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పరీక్షలు నిర్వహించాలని బీఈడీ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. ఆలస్యమైన మాట వాస్తవమే బీఈడీ పరీక్షలు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కొత్తగా బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. దీంతో ఆలస్యమైంది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. మొదటి, 3వ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తాం. – చంద్రయ్య, ఇన్చార్జి రిజిస్ట్రార్, వీఎస్‌యూ