
కాకుపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
నెల్లూరురూరల్: ప్రజలను మోసం చేసే సీఎం చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం నమ్మరని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీ మస్తానయ్య పేర్కొన్నారు. రూరల్ మండలం కాకుపల్లి, లింగాయపాళెం, గమళ్లపాళెంలో సోమవారం ఆయన బీజేపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని విధంగా నిధులు కేటాయించారన్నారు. కానీ చంద్రబాబు కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసులగౌడ్, ముక్కు రాధాకృష్ణ, రఘురామయ్య, సుబ్రహ్మణ్యంరెడ్డి, పట్రంగి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment