హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులకు చిక్కిన యువ హాస్య నటుడు నవీన్ తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. కారు డ్రైవ్ చేస్తూ వస్తున్న నవీన్‌ను ఆపి తనిఖీ చేయగా.. మద్యం తాగినట్లు తేలింది. దీంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నించారు. మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో నవీన్ కారు దిగి పరుగులు తీశాడు. ఆ వెనుకే ఉన్న మరో కారు కింద దాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడు పారిపోతున్నాడని భావించిన పోలీసులు వెంబడించి పట్టుకోవడంతోపాటు వాహనం సీజ్ చేశారు. అర్ధగంట పాటు ఈ హైడ్రామా నడిచింది. ఈ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న 16 మంది కారు డ్రైవర్లను, నలుగురు బైక్ రైడర్లను పోలీసులు పట్టుకున్నారు.
తాగిన మైకంలో తిట్ల దండకం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్లో నలుగురు యువతులూ చిక్కారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద చిక్కిన ఇద్దరికి బీఏసీ కౌంట్లు 83, 95 వచ్చాయి. మరోపక్క జూబ్లీహిల్స్ రోడ్ నం.45 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 9 కార్లు, 5 ద్విచక్ర వాహనచోదకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలోనూ ఇద్దరు యువతులు ఉన్నారు. వీరి బీఏసీ కౌంట్ 80 కంటే ఎక్కువ వచ్చింది. కార్లలో వచ్చిన ఈ నలుగురు యువతులూ తొలుత తమను పరీక్షించేందుకు వీల్లేదంటూ మొండికేశారు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా పరీక్షించడానికి ప్రయత్నించగా.. తిట్ల దండకం ప్రారంభించారు. చివరకు టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో మిన్నకుండిపోయారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి కారు కింద నక్కి
Published Mon, Dec 4 2017 2:51 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment