Comedian Naveen
-
డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి కారు కింద నక్కి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులకు చిక్కిన యువ హాస్య నటుడు నవీన్ తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. కారు డ్రైవ్ చేస్తూ వస్తున్న నవీన్‌ను ఆపి తనిఖీ చేయగా.. మద్యం తాగినట్లు తేలింది. దీంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నించారు. మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో నవీన్ కారు దిగి పరుగులు తీశాడు. ఆ వెనుకే ఉన్న మరో కారు కింద దాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడు పారిపోతున్నాడని భావించిన పోలీసులు వెంబడించి పట్టుకోవడంతోపాటు వాహనం సీజ్ చేశారు. అర్ధగంట పాటు ఈ హైడ్రామా నడిచింది. ఈ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న 16 మంది కారు డ్రైవర్లను, నలుగురు బైక్ రైడర్లను పోలీసులు పట్టుకున్నారు. తాగిన మైకంలో తిట్ల దండకం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్లో నలుగురు యువతులూ చిక్కారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద చిక్కిన ఇద్దరికి బీఏసీ కౌంట్లు 83, 95 వచ్చాయి. మరోపక్క జూబ్లీహిల్స్ రోడ్ నం.45 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 9 కార్లు, 5 ద్విచక్ర వాహనచోదకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిలోనూ ఇద్దరు యువతులు ఉన్నారు. వీరి బీఏసీ కౌంట్ 80 కంటే ఎక్కువ వచ్చింది. కార్లలో వచ్చిన ఈ నలుగురు యువతులూ తొలుత తమను పరీక్షించేందుకు వీల్లేదంటూ మొండికేశారు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా పరీక్షించడానికి ప్రయత్నించగా.. తిట్ల దండకం ప్రారంభించారు. చివరకు టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో మిన్నకుండిపోయారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన కమెడియన్
-
ధన్‌రాజ్ చొరవతోనే చేశాను
భూదాన్‌పోచంపల్లి : వర్ధమాన యువనటుల్లో నవీన్‌ది ప్రత్యేక స్థానం. అనతికాలంలోనే 20కి పైగా సినిమాల్లో వైవిద్యమైన ప్రాతలు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. రంగుల ప్రపంచం కోసం కలలు కని, ఎంతో కష్టపడి ఆ కలను సాకారం చేసుకున్నాడు. తనకు గాడ్ఫాదర్లు ఎవదూ లేరని, స్వశక్తితోనే సినీ పరిశ్రమలో పైకి వచ్చానని పేర్కొంటున్న నవీన్.. తన సినీ జీవిత విశేషాలను సాక్షికి వివరించాడు. కుటుంబ నేపథ్యం మాది రాజమండ్రి. నా అసలు పేరు నవీన్‌నే ని. నాన్న శేఖర్ హెల్త్ ఆఫీసర్, అమ్మ రామలక్ష్మి గృహిణి. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండేది. చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడిని. సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత ఆ హీరోల డైలాగ్స్, డ్యాన్స్, హావభావాలను అనుకరించేవాడిని. సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డా.. తనకు గాడ్ఫాదర్లంటూ ఎవరూ లేరు. ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్లేవాడిని. స్టేజీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. చివరకు ‘100% లవ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి ప్రవేశించాను. విభిన్న పాత్రల్లో నటించే అవకాశం రావడం అదృష్టం ‘100% లవ్’ సినిమా తరువాత పిల్లజమీందార్ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆటోనగర్ సూర్య, రోటిన్ లవ్‌స్టోరీ, తుంగభద్ర, కుమారి 21ఎఫ్, మళ్లీమళ్లీ రానిరోజు, ఇటీవల విడుదలైన కల్యాణవైభోగమే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో తదితర సినిమాలలో తనకు విభిన్న పాత్రలలో నటించే అ వకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మనసంతా, ఆక్సిజన్, సూపర్‌గుడ్ బ్యా నర్లో ఓ సినిమాతో పాటు తమిళంలో ఇష్క్ సిని మాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో ఐ దారు సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి. ధన్‌రాజ్ చొరవతో.. పిల్ల జమీందార్ సినిమాలో నటిస్తున్నప్పుడు నటుడు ధన్‌రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన చొరవతో జబర్ద్‌స్త్ ప్రోగ్రామ్స్ చేశాను. అందులో 20 ఎపిసోడ్స్ వరకు చేశాను. ప్రస్తుతం పూర్తిగా సినిమాల పైన దృష్టి సారించాను. అన్ని రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. -
ర్యాప్‌తో సినీ గేయాలకు కొత్త ఒరవడి
అమలాపురం టౌన్ : మంత్ర సినిమాలో ‘మహా...మహా...’, విక్రమార్కుడు సినిమాలో ‘అత్తిలి సత్తై.. సత్తై అంటూ ర్యాప్‌తో ఉర్రూతలూగించిన నోయల్ నటుడిగా కూడా ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు విలన్‌గా కూడా తెరపై కనిపించనున్నారు. ర్యాప్‌తో ఉర్రూతలూగిస్తున్న నోయల్ అమలాపురంలో తళుక్కుమన్నారు. ఒక పంథాలో... సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న తెలుగు సినీ పాటల్లో ర్యాప్ విధానం కొత్త ఒరవడి సృష్టించిందని నోయల్ చెప్పారు. అమలాపురంలో ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ఇంట్లో మంగళవారం కొరియో గ్రాఫర్ సుభాష్ సరికొండ, హాస్యనటుడు నవీన్‌లతో కలసి నోయల్ విలేకరులతో మాట్లాడారు. తనకు తొలిసారిగా విక్రమార్కుడు సినిమాలో ర్యాప్ సాంగ్ పాడేందుకు దర్శకుడు రాజమౌళి అవకాశం ఇచ్చారన్నారు.. కొత్తగా విడుదలైన రేయ్ సినిమాలో పవనిజం పాటకు చేసిన ర్యాప్‌కు చాలామంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. నటుడిగా కూడా తాను రాణిస్తున్నానని, మగధీర, బంపర్ ఆఫర్, ఈగ, గెడ్డం గ్యాంగ్ వంటి సినిమాల్లో నటించానని తెలిపారు. తాజాగా కుమారి 21 ఫిమేల్ చిత్రంలో విలన్‌గా చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ర్యాప్ సింగింగ్‌పై ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో నటుడిగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నానని వివరించారు. పలు హీరోలకు ట్రైనర్ సుభాష్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన సుభాష్ సరికొండ ఇటీవల కాలంలో పలు చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తూనే పలు చిత్రాల్లో నటించారు. అయితే అంతకు ముందు సినీ పరిశ్రమలో వర్ధమాన హీరోలు సాయిచరణ్‌తేజ, సందీప్‌కిషన్, సర్వానంద్, రోహిత్ వంటి వారికి హైదరాబాద్‌లోని ఓ డ్యాన్స్ స్కూల్లో ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం సుభాష్‌కు ఉంది. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో జరుగుతున్న ఉత్సవాలకు నోయల్, సుభాష్, నవీన్ అతిథులుగా హాజరైన సందర్భంగా అమలాపురంలో కొద్దిసేపు గడిపారు. ప్రస్తుతం పాలకొల్లులో చిత్రీకరణ జరుపుతున్న కుమారి 21 ఫిమేల్ చిత్రానికి తాను కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. ఓ పాత్రలో కూడా నటిస్తున్నానని పేర్కొన్నారు. పేరుతెచ్చిన తుంగభద్ర అమలాపురానికి చెందిన హాస్యనటుడు నవీన్ ఇటీవల విడుదలైన తుంగ భద్ర సినిమాలో హాస్యనటుడిగా ప్రతిభ కనబరిచాడు. అమలాపురం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లితెరపై అవకాశాలు ఎక్కువగా వస్తున్నా సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. ఇష్క్ చిత్రం తమిళ వెర్షన్ ఉరిల్.. ఉరిల్ చిత్రంలో నటిస్తున్నానన్నారు. ప్రముఖ నటి జయప్రద కుమారుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని తెలిపారు. తనకు దర్శకుడు సుకుమార్ 100% లవ్ చిత్రం దాంవకా బ్రేక్ ఇచ్చారన్నారు.