అమలాపురం టౌన్ : మంత్ర సినిమాలో ‘మహా...మహా...’, విక్రమార్కుడు సినిమాలో ‘అత్తిలి సత్తై.. సత్తై అంటూ ర్యాప్‌తో ఉర్రూతలూగించిన నోయల్ నటుడిగా కూడా ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు విలన్‌గా కూడా తెరపై కనిపించనున్నారు. ర్యాప్‌తో ఉర్రూతలూగిస్తున్న నోయల్ అమలాపురంలో తళుక్కుమన్నారు. ఒక పంథాలో... సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న తెలుగు సినీ పాటల్లో ర్యాప్ విధానం కొత్త ఒరవడి సృష్టించిందని నోయల్ చెప్పారు. అమలాపురంలో ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ఇంట్లో మంగళవారం కొరియో గ్రాఫర్ సుభాష్ సరికొండ, హాస్యనటుడు నవీన్‌లతో కలసి నోయల్ విలేకరులతో మాట్లాడారు.
తనకు తొలిసారిగా విక్రమార్కుడు సినిమాలో ర్యాప్ సాంగ్ పాడేందుకు దర్శకుడు రాజమౌళి అవకాశం ఇచ్చారన్నారు.. కొత్తగా విడుదలైన రేయ్ సినిమాలో పవనిజం పాటకు చేసిన ర్యాప్‌కు చాలామంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. నటుడిగా కూడా తాను రాణిస్తున్నానని, మగధీర, బంపర్ ఆఫర్, ఈగ, గెడ్డం గ్యాంగ్ వంటి సినిమాల్లో నటించానని తెలిపారు. తాజాగా కుమారి 21 ఫిమేల్ చిత్రంలో విలన్‌గా చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ర్యాప్ సింగింగ్‌పై ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో నటుడిగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నానని వివరించారు.
పలు హీరోలకు ట్రైనర్ సుభాష్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన సుభాష్ సరికొండ ఇటీవల కాలంలో పలు చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తూనే పలు చిత్రాల్లో నటించారు. అయితే అంతకు ముందు సినీ పరిశ్రమలో వర్ధమాన హీరోలు సాయిచరణ్‌తేజ, సందీప్‌కిషన్, సర్వానంద్, రోహిత్ వంటి వారికి హైదరాబాద్‌లోని ఓ డ్యాన్స్ స్కూల్‌లో ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం సుభాష్‌కు ఉంది. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో జరుగుతున్న ఉత్సవాలకు నోయల్, సుభాష్, నవీన్ అతిథులుగా హాజరైన సందర్భంగా అమలాపురంలో కొద్దిసేపు గడిపారు. ప్రస్తుతం పాలకొల్లులో చిత్రీకరణ జరుపుతున్న కుమారి 21 ఫిమేల్ చిత్రానికి తాను కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. ఓ పాత్రలో కూడా నటిస్తున్నానని పేర్కొన్నారు.
పేరుతెచ్చిన తుంగభద్ర
అమలాపురానికి చెందిన హాస్యనటుడు నవీన్ ఇటీవల విడుదలైన తుంగ భద్ర సినిమాలో హాస్యనటుడిగా ప్రతిభ కనబరిచాడు. అమలాపురం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లితెరపై అవకాశాలు ఎక్కువగా వస్తున్నా సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. ఇష్క్ చిత్రం తమిళ వెర్షన్ ఉరిల్.. ఉరిల్ చిత్రంలో నటిస్తున్నానన్నారు. ప్రముఖ నటి జయప్రద కుమారుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని తెలిపారు. తనకు దర్శకుడు సుకుమార్ 100% లవ్ చిత్రం దాంవకా బ్రేక్ ఇచ్చారన్నారు.
ర్యాప్‌తో సినీ గేయాలకు కొత్త ఒరవడి
Published Wed, Apr 1 2015 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement