
అమలాపురం రూరల్: వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు విచక్షణను వదిలేస్తున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం గ్రౌండ్‌ను ఓ యూట్యూబర్ అనుచరులు గోతులమయం చేశారు. ఈ చేష్టలను జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సుమారు 300 మందిని వెంటబెట్టుకుని ఓ యూట్యూబర్ (YouTuber) బాలయోగి స్టేడియం గ్రౌండ్‌లోకి(Balayogi Stadium Ground) ప్రవేశించాడు.
ఈ గ్రౌండ్‌లో బంగారం పాతిపెట్టానని, అది ఎవరికి దొరికితే వారిదే అంటూ అక్కడ వచ్చిన యువకులను ఉసిగొల్పాడు. దాంతో వారు చేతికి దొరికిన వస్తువుతో గ్రౌండ్‌ను తవ్వడం మొదలెట్టారు. దీనిని గమనించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సురేష్‌కుమార్ వారి చర్యలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.