సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్
నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.
టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.
ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.
ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
Comments
Please login to add a commentAdd a comment