
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్న సమయంలో జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది.
ఆ ఫ్లోర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు. దాంతో సాష్ట్‌వేర్ ఉద్యోగులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పినట్లు సమాచారం.

Comments
Please login to add a commentAdd a comment