పరిపూర్ణానంద హౌస్‌ అరెస్టు! | Swami Paripoornananda House Arrest | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 9:55 AM | Last Updated on Mon, Jul 9 2018 12:44 PM

Swami Paripoornananda House Arrest - Sakshi

స్వామి పరిపూర్ణానంద (పాతచిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహయాత్రకు బ్రేక్‌ పడింది. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్వామి పరిపూర్ణానంద‌ ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. జుబ్లీహిల్స్‌‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేపథ్యంలో వేలమంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement