Swami Paripoornananda
-
దిశ నిందితులది ఎన్కౌంటర్ కాదు... సర్జికల్ స్ట్రైక్
-
రామరాజ్యం స్థాపిద్దాం
సాక్షి, తాండూరు: రాష్ట్రంలో మిషన్ 70లో భాగంగా డెభ్బై ఎమ్మెల్యే స్థానాలను సొంతం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆదివారం బీజేపీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి పటేల్ రవిశంకర్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడతానని తెలిపారు. దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజల ఆశాకిరణం ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అభివర్ణించారు. హిందూ ధర్మం కోసం తాను మాట్లాడినందుకు టీఆర్ఎస్ సర్కారు తనను తెలంగాణ నుంచి బహిష్కరించిందని, అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనను రాష్ట్రంలో ఆవిష్కరించారని తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణ ప్రకాషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తానని మాట తప్పారని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల విషయంలో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాముని కోసం వానరాలు ఎలా సేవ చేశాయో.. అదేవిధంగా తాండూరులో రవిశంకర్ గెలుపు కోసం ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కోసం కుమ్ములాటలు నడుస్తున్నాయన్నారు. తాము కాంగ్రెస్ బగావో.. దేశ్‌కు బచావో అనే నినాదంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మైనార్టీ ఆడపడుచులను అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటే ప్రంద్రా మినిట్ ఓవైసీ సోదరులు ఎక్కడికెళ్లారని ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. పంద్రామినట్ అంటున్న వారు.. మత బూచీని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబపడుతుందన్నారు. ముస్లిం ఆడపడుచులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ భేటీ బచావో భేటీ పడావో పథకం ప్రవేశపెట్టారని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం నవాబులు, రజాకార్ల పాలనను కొనసాగిస్తోందని మండిపడ్డారు. మోదీ ఏనాడు మతాన్ని అడ్డుపెట్టుకోలేదన్నారు. ప్రస్తుతం ముస్లింలు సైతం బీజేపీ వెంట నడుస్తున్నారని తెలిపారు. అమిత్ షా నేతృత్వంలో దేశంలోని ఒక్కొ రాష్ట్రం కాషాయమయంగా మారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో తాను ఎన్నికల ప్రచారం చేసి కాషాయ తెలంగాణగా మారుస్తానని చెప్పారు. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న పార్టీలను తరిçమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రమాణం చేయిస్తారా.. రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తామని కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రమాణం చేస్తారా.. అని పరిపూర్ణానంద స్వామి సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థులతో తాను ప్రమాణం చేయిస్తున్నానని తెలిపారు. రామరాజ్యాన్ని స్థాపిద్దామని అని సూచించారు. తాను ప్రచారం నిర్వహిస్తుంటే సీఎం అవుతారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారని, తాను పదవుల కోసం పాకులాడడం లేదని స్పష్టం చేశారు. కేవలం హిందూ ధర్మ రక్షణ కోసమే బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. తాండూరులో కాలుష్యం వీపరీతంగా ఉందన్నారు. రవిశంకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్లు ప్రజల కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈసారి కాంగ్రెస్ క్రిస్టియన్ మేనిఫెస్టో, టీఆర్ఎస్ నిజాంల మేనిఫెస్టోతో ముందుకొచ్చాయని ధ్వజమెత్తారు. బీజేపీది మాత్రం హిందూ ధర్మ మేనిఫెస్టోతో పాటు బలహీన వర్గాలు, రైతులకు మేలు చేకూరేలా మెనిఫెస్టో ప్రవేశపెట్టిందన్నారు. రామ మందిరం నిర్మిస్తున్నాం.. ఉత్తరప్రదేశ్‌లో కాషాయం ఎగిరింది. భోగాల పాలన అంతం కావడంతో యోగి ప్రభుత్వంలో రామమందిరం నిర్మిస్తున్నమాని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ను హిందూపురం, మహబూబాబాద్ పేరు మానుకోట, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, వికారాబాద్‌ను అనంతగిరిగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం సేడం ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పటేల్ తెల్కూర్, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి పటేల్ రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ జనార్దన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సింలు, జిల్లా అధికార ప్రతినిధి పటేల్ రవిశంకర్, నాయకులు మనోహర్‌రావు, శెట్టి రమేష్, కృష్ణ ముదిరాజ్, సత్యయ్యగౌడ్, హన్మంతు, రవీందర్, మహిపాల్, రాములు నాయక్, సుధీర్‌రెడ్డి, రాజ్‌కుమార్ కులకర్ణి, అంతారం లలిత, పటేల్ జయశ్రీ, గాజుల శాంతుకుమార్, వాలి శివకుమార్, శివరాజ్, మాధవరెడ్డి తదితరులున్నారు. -
‘నన్ను బహిష్కరించినా పోరాటం ఆపను’
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో తమ పార్టీ మిషన్ 70కి కామారెడ్డితో బీజం పడటం ఖాయమని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. కామారెడ్డిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వికసిస్తేనే తెలంగాణ వికసిస్తుందని వ్యాఖ్యానించారు. మైనార్టీల ఓట్లు సైతం బీజేపీకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనను తెలంగాణ నుంచి బహిష్కరించినా పోరాటం ఆపనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే డ్రైనేజ్‌లో వేసినట్టేనని విమర్శించారు. టీఆర్ఎస్కు, బీజేపీకి అంతర్గత ఒప్పందం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అందుకే రాజకీయాల్లోకి వచ్చా: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : తన నగర బహిష్కరణ.. అమిత్ షా చేత తన రాజకీయ ఆవిష్కరణైందని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా.. దళిత వాడలు, నిరాదరణకు గురైన బస్తీల్లో తిరిగానని, అక్కడి పరిస్థితులు చూసి తీవ్రంగా చలించానన్నారు. తాను రాజకీయాల్లో ఇమడగలనా లేదా అని ఆలోచించానని, తనకు దేవుడు తప్ప ఇంకెవరు లేరని తెలిపారు. రాజకీయాల్లో ఫాదర్, లేదా గాడ్ ఫాదర్ అయినా ఉండాలని, ఈ విషయంలో తన తల్లిదండ్రులు, గురువుల రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు రాకపోతే.. ఇంకెప్పుడు అడుగు పెట్టొద్దని, ఏది ఆశించవద్దని ఆ ముగ్గరు చెప్పారని స్పష్టం చేశారు. ఇంకా స్వామిజీ ఎమన్నారంటే.. ‘ఈ నెల8న అమిత్‌షాను కలిసినప్పుడు.. నా మీద చూపిన గౌరవం, వారితో మాట్లాడాకా నా ధైర్యం మరింత రెట్టింపు అయ్యింది. మీ సేవ ఈ దేశానికి అవసరమని అమిత్ షా తెలిపారు. నవరాత్రులు అయ్యాక నిర్ణయం చెబుతానన్నాను. స్వామిజీ తెలంగాణకు వెళ్లండి.. లక్ష్మణ్‌ను కలిసాక పార్టీ మీకు సూచన చేస్తుందని అన్నారు. రాజకీయం కాదు రాజనీతి ఉండాలని అనుకుంటున్నాను. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని పరి రక్షించుకోవాలి అంటే బీజేపీ రావాలనుకున్నాను. బీజేపీలో కులాలు, కుటుంబాలు లేవు అవినీతి లేదు. గుణమే హద్దు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలి.. పరివార సర్కార్ పోవాలి.. అదే మా నినాదం. మిషన్70లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోంది. అమిత్ షా బాధ్యత తీసుకోమన్నారు. ఏ పదవి, బాధ్యత వద్దని తెలిపాను.పని చేయడానికి వచ్చాను. పదవి కోసం కాదు. లక్ష్మణ్ ఏ గీత గీసిన పాటిస్తాను. ఆశ లేదు ఆశయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు.. దారుసలాంతో నడిచాయి. ఇప్పుడు వచ్చే బీజేపీ సర్కార్ లాల్ దర్వాజ ఆజ్ఞలతో నడుస్తది. అమావాస్య నాకు మంచి ముహూర్తం. ఎన్నికల కమిషన్ కూడా మాకు మంచి రోజునే కేటాయించింది. తెలంగాణ.. కాషాయ తెలంగాణగా మారబోతోంది.’ అని తెలిపారు. -
బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద
-
బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పార్టీ కండువాతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. పరిపూర్ణానందను అమిత్ షా వద్దకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తోడ్కోని వచ్చారు. బీజేపీలో చేరడం పట్ల పరిపూర్ణానంద హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తానని ఈ సందర్భంగా అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, రాంమాధవ్ మార్గదర్శనంలో పని చేస్తానని చెప్పారు. రోజుకు 17 గంటలు పార్టీ కోసమే పాటు పడతానని, దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. లక్ష్మణ్‌కు అమిత్ షా ఫోన్ మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేశారు. రేపు ఢిల్లీలో 11 గంటలకు జరగబోయే సమావేశానికి రావాలని లక్ష్మణ్‌ను పిలిచారు. రేపటి పార్లమెంట్ బోర్డ్ మీటింగ్‌లో 30 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేయనుంది బీజేపీ అధిష్టానం. దీంతో అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంచార్జ్ కృష్ణదాస్, మురళీధర్ రావు, కిషన్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీకి బయలుదేరనున్నారు. -
కొండగట్టు ప్రమాదం: ఆగని కన్నీళ్లు
జగిత్యాలజోన్/కొండగట్టు/ధర్మపురి: ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నారాయణ బలిహోమం నిర్వహిస్తున్నట్లు శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడి 62మంది చనిపోయిన కొండగట్టు ఘాట్‌రోడ్డు ఆవరణలో బుధవారం నారాయణ బలి శాంతిహోమం నిర్వహించారు. కార్యక్రమానికి కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల నుంచి మృతుల కుటుంబాలు భారీగా తరలివచ్చారు. ఘటనాప్రదేశాన్ని చూసి, వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందాస్వామి మాట్లాడుతూ.. దేశంలోనే కొండగట్టు బస్సు ప్రమాదం ఘోరమైందన్నారు. ప్రమాదంలో మరణించిన వారిని తీసుకురాలేమని, ఉన్నవారికి మంచి జరగాలనే ఉద్దేశంతో నారాయణబలిహోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హోమం ద్వారా ప్రేతాత్మకు విముక్తి, ఆత్మశాంతి కలుగాలని కోరుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘటన స్థలం వద్ద శాస్త్రోత్తకంగా పిండ ప్రదానం చేసి వాటిని ధర్మపురి గోదావరిలో కలుపుతారని వెల్లడించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలకు ఉచిత వసతి, విద్యను అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలుర కోసం వాల్మీకి అవాసం, బాలికల కోసం భగిని నివేదిత అవాసాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాను సాయం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైదికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ, కరీంనగర్, జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీలు బండి సంజయ్, ముదుగంటి రవీందర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రాజ్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్‌లు డాక్టర్ శంకర్, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కన్నీరు.. మున్నీరు.. కొండగట్టు ప్రమాద ఘటనాస్థలానికి భారీగా మృతుల కటుంబసభ్యులు వచ్చారు. ఎవరి మోహంలో నిరునవ్వు లేదు. కన్నీరు ఆగడం లేదు. ఘటనాస్థలాన్ని చూసిన వారు తమ వారిని గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ముందుగా పండితులు మృతుల కుటుంబసభ్యులపై గోదావరి పుణ్యతీర్థం చల్లారు. అనంతరం హోమం, పూజలు, సామూహిక పిండాలు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. పంచభూతాల పరిరక్షణతో క్షేమం.. పకృతిని ఆరాధిస్తూ పంచభూతాలను పరిరక్షించడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. కొండగట్టు మృతుల పిండాలను ధర్మపురి గోదావరిలో కలిపారు. అనంతరం ఆర్అండ్బీ వసతిగృహంలో మాట్లాడారు. ధర్మపురిలో సాక్ష్యాత్తు భగవంతుని సొమ్ముకే రక్షణ లేకపోవడంతో శోచనీయం అన్నారు. ధర్మపురి పవిత్ర గోదావరిలో కొంతకాలంగా డ్రయినేజీ నీరుకలుస్తూ కాలుష్య కోరల్లో చిక్కుకోగా దీన్ని నివారించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. పంచభూతాల్ని పవిత్రంగా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఘాట్‌రోడ్ ప్రమాదంపై మరో బస్సుతో పరిశీలన ఘాట్‌రోడ్‌పై బస్సు ప్రమాదంపై అధికారులు కదిలారు. ఈ ఘటనపై రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్ ఇప్పటికే మూడుసార్లు కొండగట్టు చేరుకుని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంతో స్థానిక అధికారుల్లోనూ కదలిక వచ్చింది. మరోవైపు బుధవారం నల్గొండ జిల్లా ఆర్ఎం విజయ్‌కుమార్ ఘటనస్థలానికి వచ్చి ఘాట్‌రోడ్‌పై ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు సేకరించారు. మరో ఆర్టీసీ బస్సును కొండపై నుంచి కిందకు తీసుకొచ్చారు. వచ్చేక్రమంలో ఘాట్‌రోడ్ స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదం జరిగిందా..? టర్నింగ్‌లతోనా.. ? ప్రమాద సమయంలో బస్సు స్పీడు ఎంత ఉంది.. ? ఎంత స్పీడులో ఈ ప్రమాదం జరిగింది.. ? ఆ సమయంలో బ్రేకులు ఫెయిలయ్యాయా...? అని అనేక కోణాల్లో పరిశీలించారు. ప్రమాద సమయంలో ధ్వంసమైన రెయిలింగ్‌తోపాటు ప్రమాదకరలోయనూ పరిశీలించారు. -
పరిపూర్ణానంద బహిష్కరణపై స్టే నో!
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం వ్యవస్థాపకుడుపరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నగర బహిష్కరణ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నగర బహిష్కరణ కొనసాగింపునకు వీలుగా తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో స్వామీజీకి గతంలో జారీ చేసిన నోటీసు అందాల్సి ఉందని, దానిని పరిశీలించాక ఈ అప్పీల్‌పై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినందుకే నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు విడివిడిగా ఉత్తర్వులిచ్చాయని, వీటి అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉతర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదించారు. యాత్ర పేరుతో అనుమతులు తీసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిపూర్ణానంద స్వామి వాదనలు వినాల్సి ఉందని, ఇప్పటికే స్వామీజికి ఇచ్చిన నోటీసు అందాల్సి ఉన్నందున ఈ పరిస్థితుల్లో స్టే ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం ప్రకటించింది. విచారణ వాయిదా పడింది. -
స్వామీజీ బహిష్కరణపై నిరసనలు
కొత్తగూడెం అర్బన్: విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణ వేటు ఎత్తి వేయాలని కోరుతూ బీజేపీ, బీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేష్ టెంపుల్ ఏరియా నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన సూపర్‌బజార్ మీదుగా బస్టాండ్ చేరుకుని కలెక్టరేట్ ముట్టడికి వెళ్లే సమయంలో పోలీసులు స్థానిక బస్టాండ్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద అడ్డగించి, అరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కింద పడ్డారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసిన మిగిలిన ఆందోళనకారులను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా కొన్ని టీవీ చానెల్స్‌లో హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వారి మనోభావాలను కించపరిచేలా అవహేళన చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేయడం సరైన పద్దతి కాదన్నారు. అటువంటి చానెల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ముట్టడి చేసే క్రమంలో పోలీసులు నాయకులు, కార్యకర్తలను కొట్టి, బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించడం సరికాదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం 50 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సీతారామ్ నాయక్, శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు యేర్రా కామేష్, వీహెచ్‌పీ జిల్లా నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్ నాయకులు బరిగంటి సురేష్, కుమార్, వినోద్‌రెడ్డి, లక్ష్మీ, సరోజ, ఆర్ఎస్ఎస్ నాయకులు రామచంద్రయ్య, రాజేశ్వరరావు, పార్థసారధి, ఏబీవీపీ నాయకులు నరేందర్ పాల్గొన్నారు. ఖమ్మం(కల్చరల్) : పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందు పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లిక అంజయ్య, ఉపాధ్యక్షుడు ఉన్నం వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ చేయటం ఎంత వరకు సమంజసమన్నారు. బహిష్కరణ ఎత్తివేయకుంటే ఆందోళనలు ఉ«ధృతం చేస్తా మని హెచ్చరించారు. తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వివాదం జరిగి ంది. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ తదితరులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రముఖ్ కొచ్చర్ల రమాదేవి, కోశాధికారి పసుమర్తి రవి, హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు పోతుల వీరచంద్రశేఖర్, మిక్కిలినేని సునీల్, శివసాయి చౌదరి, దేవేందర్, రుద్ర ప్రదీప్, వేల్పుల సుధాకర్, భుక్యా శ్రీను, జైపాల్‌రెడ్డి, ఉపేందర్, ఇంద్రఐక్య వేదిక కన్వీనర్ పిట్టల లక్ష్మీనారాయణ, ఏబీవీపీ సంఘటన యాత్రి మహిపాల్ పృథ్వీ,సాయి, గోపి పాల్గొన్నారు. -
‘ప్రతి ఇంటికి తాళం వేయండి’
సాక్షి, హైదరాబాద్ : కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కాగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరిట ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలెవరూ బయటకి రాకుండా ప్రతి ఇంటికి తాళం వేయండి ..శాంతి భద్రతలు ఇంకా బాగుంటాయని ఎద్దెవా చేశారు. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. స్వామీజీ ఎం తప్పు చేశారని ఆయనపై గుండా యాక్ట్ పెట్టారని మండిపడ్డారు. ప్రగతి భవన్ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేడయం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్ సమర్థించడం సరికాదన్నారు. -
‘దమ్ముంటే వారిని అరెస్ట్ చేయండి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు నిరసన, ధర్నా చేసే హక్కు లేకుండా చేస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే స్వామీజీని నగర బహిష్కరణ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శనివారం ర్యాలీ చేస్తామంటే తనను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. రెచ్చ గొట్టే వాఖ్యలు చేసే వారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల్లో ఆరుగురిపై కేసులున్నాయని దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే వారిని పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ తీసుకొని వివరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వకుంటే అక్కడే ఉండి అనుమతి తీసుకుని వివరిస్తామని ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు. -
కేవీపీఎస్ నాయకుల ఆందోళన
జనగామ: కత్తి మహేష్, పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణలను వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ బాధ్యులు గురువారం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కత్తి మహేష్, పరిపూర్ణానంద బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఇద్దరిని నగర బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. దళిత, గిరిజన సంఘాల సమాఖ్య జిల్లా చైర్మన్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారపాక మధు, బొట్ల శేఖర్, తిప్పారపు విజయ్ ఉన్నారు. -
కత్తి మహేశ్‌ను హీరో చేసిందెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు. పైగా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా విశ్లేషకుడు కత్తి మహేశ్, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పాద యాత్ర జరుపుతానంటూ హెచ్చరిక చేసిన పరపూర్ణానంద స్వామి పట్ల పరస్పరం భిన్నంగా వ్యవహరించడం కూడా తెలంగాణ పోలీసులకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కత్తి మహేశ్‌కు ఎలాంటి న్యాయపరమైన నోటీసులు ఇవ్వని పోలీసులు (పిలిపించి మాట్లాడారే తప్ప), మత మార్పిడిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తొలుత స్వామిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, కత్తి మహేశ్‌ను మాత్రం నగర బహిష్కారం చేశారు. పోలీసుల నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడమే కాకుండా ప్రతిపాదిత నిరసన పాద యాత్రను మానుకోనని మొండికేయడంతోనే స్వామినీ కూడా నగర బహిష్కారం చేశారు. సమన్యాయం చాటుకునేందుకే అలాచేసి ఉండవచ్చు. కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు నిక్కచ్చిగా ఆయన తన సొంత అభిప్రాయంగానే చెప్పారు. అది ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆయన అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శించవచ్చు. అంతేగానీ శిక్షించే అధికారం చట్టానికే లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు ఇంకెక్కడిది? ఆ మాటకొస్తే రామాయణంపై అందులోని పాత్రలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఎంతో మంది సాహిత్యవేత్తలు, మేథావులు రామాయణాన్ని విమర్శించారు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రముఖ తెలుగు మహిళా సాహితీవేత్త రంగనాయకమ్మ ‘రామాయణం ఓ విష వృక్షం’ అని ఓ గ్రంధమే రాశారు. దక్షిణాదిలో ద్రావిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్ ఈవీ రామస్వామి రామాయణంలోని అన్ని పాత్రలను విశ్లేషిస్తూ దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్యా.. తదితర పాత్రలన్నింటిని విమర్శించారు. రాముడు, లక్ష్మణుడు శూర్పనకను అవమానించిన కారణంగానే అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతనుఎత్తుకు పోయాడని, అమెను కనీసం ముట్టుకోలేదంటూ రావణాసురుడిని సమర్థించారు. రామాయణాన్ని ఆయన విశ్లేషిస్తూ పెరియార్ రామస్వామి రాసిన ‘ఈవీ రామస్వామీస్ రీడింగ్ ఆఫ్ ది రామాయణ’ అనే పుస్తకాన్ని తమిళయన్లు పవిత్ర గ్రంధంగా పూజిస్తున్నారు. పెరియార్ రామస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన ప్రారంభించిన ద్రావిడ ఉద్యమం పేరు దాదాపు అన్ని రాజకీయ పార్టీల పేర్లలో మిలితమై ఉంటుంది. ఇటు పెరియార్ రామస్వామి పుస్తకాన్నిగానీ, తెలుగునాట రంగనాయకమ్మ రాసిన ‘రామాయణం విషవృక్షం’ పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు? ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్‌బ్యాక్స్ ప్రచురించిన ‘మెనీ రామయాణాస్’ చదివితే ఇంకేమైనా ఉందా? ఇంకా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిషేధించలేదు కనుక, ఈ పుస్తకాలను కూడా నిషేధించలేదు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్‌కు నగర బహిష్కార శిక్ష సబబా, కాదా? అన్న చర్చ వస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కత్తి మహేశ్‌కు వచ్చిన పబ్లిసిటీ ఏమోగానీ నగర బహిష్కరణ శిక్ష ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. మహేశ్ వర్సెస్ పరిపూర్ణానంద స్వామి ఎపిసోడ్లో స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు మాట వరుసకు కూడా కత్తి బహిష్కారాన్ని ఖండించలేదు. కేంద్రంలో ఇటీవల అస్తమానం భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం ఈ ఎపిసోడ్‌పై స్పందించడం లేదు. అదే నెట్‌ఫిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. గాంధీ, నెహ్రూలు వారికి దేవుళ్లతో సమానం కనుక వారికి కోపం వచ్చి ఉంటుంది. హిందువులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ సాక్రెడ్ గేమ్స్‌పై ఆరెస్సెస్ వారు కూడా కోర్టుకెళ్లారు. అది వేరే విషయం. -
టికెట్ బుక్‌చేసిన పరిపూర్ణానంద.. రంగంలోకి పోలీసులు!
సాక్షి, హైదరాబాద్ : నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలలు హైదరాబాద్ నగర బహిష్కరణను పోలీసులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది. -
పరిపూర్ణానంద స్వామి గృహనిర్బంధం సరికాదు
తాండూరు: హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయయాత్ర చేపడుతున్న స్వామి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు గృహనిర్బంధం చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.రమేష్‌కుమార్ తెలిపారు. తాండూరులోని అంబేడ్కర్చౌక్లోని ప్రధాన రోడ్డుపై బీజేపీ నాయకులు సోమవారం బైఠాయించారు. రాస్తారోకో చేశారు. వారు ఆందోలనకు దిగిన కొద్దిసేపటికే పోలీసులు చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిజీ హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పూజారి పాండు, పట్టణ అధ్యక్షుడు బంటారం భద్రేశ్వర్, నాయకులు బొప్పి సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది ఫైర్
-
కత్తి మహేష్‌పై హైపర్ ఆది ఫైర్
కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫైర్ అయ్యారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో సారాంశం.. ‘హాయ్ అండి నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నాను. కొన్నికోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడ్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానెళ్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొకడేమో సీతను రావణాసురుడి దగ్గర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదంటాడు. ఇంకొకడైతే రాముడ్ని డైరెక్ట్‌గా దగుల్బాజీ అంటాడు. ఛీ ఛీ చీ.. ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్‌రా నీకా మాటలు. నాకు క్రిష్టియన్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాన్ వస్తే నేను వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వాళ్లు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో చర్చి, మసీదు, గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసి.. మా హీరో మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. సూపర్. సార్.. మీ అందరికి.. హిందు మతాన్ని కించపరుస్తుంటే.. ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేననుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవ్వరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా.. మీకిది తప్పు అని అనిపిస్తే ఖండించండి సార్. అలాగే రేపు బొడుప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా మతబేధం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సర్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్లు ఒకటే. థ్యాంక్యూ’ అంటూ ముగించారు. ఇక ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
రామ భక్తులంతా జైల్లో ఉన్నారు: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో పరిపుర్ణానందకు మద్దుతుగా పలు హిందూ సంస్థల ప్రతినిధులు నిరసన తెలపగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయానికి కూడా వెళ్లనివ్వడం లేదని, మంచిపై దాడి చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తామని తెలిపారు. రామ భక్తులంతా జైల్లో ఉన్నారని, బేషరతుగా విడిచిపెట్టాలన్నారు. తన ఒక్కడికైనా పాదయాత్ర అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తాము ఏవరిపైనా విమర్శలు చేయమని అనుమతివ్వాలన్నారు. దాడి చేయొచ్చని అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారని.. అమరనాథ్ యాత్రికులపై దాడులు జరుగుతున్నాయని భక్తులను అడ్డుకుంటారా ప్రశ్నించారు. చదవండి : పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
‘కత్తి మహేష్‌పై జీవితకాల నిషేధం విధించాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆరు నెలల నిషేధం సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి శాశ్వతంగా కత్తి మహేష్‌ను బహిష్కరించాలని, జీవితకాలం పాటు నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళితుల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్‌పై ప్రభుత్వానికి పట్టదా? స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఖండించారు. కత్తి మహేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. స్వామిజీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేస్తామంటే ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు సినీ నటి కరాటే కల్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం: డీజీపీ -
స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్
-
పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్ : ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ ఖండన శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును ఆయన ఖండించారు. స్వామీజీలను అరెస్టు చేయడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మణ్ హితవు పలికారు. పరిపూర్ణానందను వెంటనే గృహనిర్బంధం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం, నిరసనలు ప్రదర్శించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఈ హక్కును ప్రభుత్వాలు కాలరాయకూడదని ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్థల ఆందోళన స్వామి పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుమల అలిపిరి వద్ద హిందూ దేవాలయాల పరిరక్షణ సేవాసంస్థ నిరసన ప్రదర్శన చేపట్టింది. గోవింద నామస్మరణతో సంస్థ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టగా.. విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
పరిపూర్ణానంద హౌస్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహయాత్రకు బ్రేక్ పడింది. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. జుబ్లీహిల్స్‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేపథ్యంలో వేలమంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. -
పరిపూర్ణానందను కలసిన సీఎం దంపతులు
వేములవాడ, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధిపై సూచనలివ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానం దను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సతీ సమేతంగా కలిశారు. మంగళవారమిక్కడ భారత్ టుడే చానల్ కార్యాలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు గంటన్నరసేపు పరిపూర్ణానందతో పలు అంశాలపై సీఎం చర్చించారు. వేముల వాడ, కాళేశ్వరం ఆలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందు కు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, అందుకు తగిన సలహాలు సూచనలు అందించాలని పరిపూర్ణానందను సీఎం కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున సీఎం వివిధ ఆలయాలకు తెలంగాణ మొక్కులు చెల్లించటాన్ని పరిపూర్ణానంద సమర్థించారు. దీనిపై వామపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. మొక్కుల చెల్లింపు న్యాయ సమ్మతమేనని తన అభిప్రాయాన్ని వినిపించారు. ఆ సమయంలో స్వామి మాటలు తనకు ఆత్మస్థైర్యం కల్గించిందని ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
హిందూ ధర్మానికి రక్షణ కొరవడింది: స్వామీ పరిపూర్ణానంద
హైదరాబాద్, న్యూస్‌లైన్: హిందువులు పీఠాధిపతులకు కేవలం దండం పెట్టుకోవడమే కాకుండా ఒక సైనికుడిలా మారి ధర్మాన్ని కాపాడాలని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి హిందూ ధర్మానికి రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఇక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచి పీఠానికి అధిపతులుగా ఉన్న వారిపై అకారణంగా కేసులు బనాయించి వారిని మానసిక వేదనకు గురిచేశారన్నారు. ఈ కేసులో న్యాయస్థానం పూర్తి పారదర్శకంగా వ్యవహరించిందని చెప్పారు. పీఠానికి తిరిగి గౌరవం దక్కే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాలని కోరారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
చరిత్రలో నిలిచిపోతుంది
‘‘ఎన్నో వందల, వేల సినిమాలొస్తున్నాయి. ఏ సినిమా ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తోందో మనకు తెలుసు. అలాగే ఏ సినిమాని ఎలా ఆదరించాలో కూడా ప్రేక్షకులకు తెలుసు. సినిమా తీసేవాళ్లల్లో ఎంత సంస్కారం ఉండాలో, చూసేవాళ్లలో కూడా అంతే సంస్కారం ఉండాలి’’ అన్నారు పరిపూర్ణానంద స్వామి. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై జేకే భారవి దర్శకత్వంలో శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’ ఇటీవల విడుదలైంది. టైటిల్ రోల్‌ని కౌశిక్‌బాబు, ఇతర ప్రధాన పాత్రలను నాగార్జున, శ్రీహరి, సాయికుమార్ తదితరులు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ -‘‘ప్రతి హిందువు, భారతీయుడు చూడాల్సిన సినిమా. ఆదిశంకర జీవితాన్ని భారవి చాలా స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చేసి భారవ సాహసం చేయలేదు, తపస్సు చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. నేటి తరంలో ఇలాంటి సినిమా రావడం, అది ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సమావేశంలో జయశ్రీదేవి, భారవి, కౌశిక్, నాగ్ శ్రీవత్స, రాజా రవీంద్ర, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.