
నినాదాలు చేస్తున్న కేవీపీఎస్ బాధ్యులు
జనగామ: కత్తి మహేష్, పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణలను వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ బాధ్యులు గురువారం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కత్తి మహేష్, పరిపూర్ణానంద బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఇద్దరిని నగర బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో బలవంతంగా లాక్కెళ్లారు.
దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. దళిత, గిరిజన సంఘాల సమాఖ్య జిల్లా చైర్మన్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారపాక మధు, బొట్ల శేఖర్, తిప్పారపు విజయ్ ఉన్నారు.