కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫైర్ అయ్యారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో సారాంశం.. ‘హాయ్ అండి నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నాను. కొన్నికోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడ్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానెళ్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొకడేమో సీతను రావణాసురుడి దగ్గర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదంటాడు. ఇంకొకడైతే రాముడ్ని డైరెక్ట్‌గా దగుల్బాజీ అంటాడు. ఛీ ఛీ చీ.. ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్‌రా నీకా మాటలు. నాకు క్రిష్టియన్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాన్ వస్తే నేను వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వాళ్లు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో చర్చి, మసీదు, గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అరే.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసి.. మా హీరో మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. సూపర్. సార్.. మీ అందరికి.. హిందు మతాన్ని కించపరుస్తుంటే.. ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేననుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవ్వరూ ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా.. మీకిది తప్పు అని అనిపిస్తే ఖండించండి సార్. అలాగే రేపు బొడుప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా మతబేధం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సర్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్లు ఒకటే. థ్యాంక్యూ’ అంటూ ముగించారు. ఇక ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment