హిందూ ధర్మానికి రక్షణ కొరవడింది: స్వామీ పరిపూర్ణానంద
హైదరాబాద్, న్యూస్‌లైన్: హిందువులు పీఠాధిపతులకు కేవలం దండం పెట్టుకోవడమే కాకుండా ఒక సైనికుడిలా మారి ధర్మాన్ని కాపాడాలని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి హిందూ ధర్మానికి రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఇక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కంచి పీఠానికి అధిపతులుగా ఉన్న వారిపై అకారణంగా కేసులు బనాయించి వారిని మానసిక వేదనకు గురిచేశారన్నారు. ఈ కేసులో న్యాయస్థానం పూర్తి పారదర్శకంగా వ్యవహరించిందని చెప్పారు. పీఠానికి తిరిగి గౌరవం దక్కే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాలని కోరారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.