మహేశ్‌బాబు- ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.
మహేశ్‌బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్‌ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్‌కు కామెంట్ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్‌లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.
'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రా
హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment