
పూణే: మహరాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టించింది. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఆరు కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 71కి చేరుకుంది. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసింది.
పూణేలో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడ ప్రజలకు వణికిస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ (GBS) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్‌బారినపడిన వారి సంఖ్య తాజాగా 71కి చేరుకుంది. బాధితుల్లో 47 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉండగా.. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక, ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక పరిశోధనా టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే, జీబీఎస్‌కు చికిత్స లేదు. దీని బారినపడిన వ్యక్తులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
జీబీఎస్ అంటే ఏమిటి?
గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కారణంగా నరాల బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గులియన్-బారే సిండ్రోమ్ అరుదైనది వ్యాధి. మాయో క్లినిక్ ప్రకారం.. గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించడానికి కనీసం ఆరు వారాల ముందు శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు ఇలా..
బాధితులకు మెట్లు ఎక్కడం, నడవడం కష్టమవుతుంది.
నరాల బలహీనత, కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు బలహీనమవుతాయి.
నరాలు దెబ్బతినడం వల్ల మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయి.
అసాధారణ హాట్‌బీట్, రక్తపోటు మార్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment