
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్‌గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.
చంద్రబూడ్ ఏమన్నారంటే..
ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షిణ కల్పించలేం. దీన్ని సొసైటీ ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టాలు అమలు తీరు కూడా కచ్చితంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తాము బయటకు వెళితే రక్షణ ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. తొందరగా విచారణ పూర్తి చేసి శిక్షలను కూడా అంతే త్వరగా అమలు చేయాలి. ఇందులో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు.
నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
ఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్ మార్చుకోవడంతో పాటు షూస్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్ లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తన్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్‌తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.
పుణె బస్టాండ్‌లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి
Comments
Please login to add a commentAdd a comment