Woman Assaulted
-
బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): వరుసకు సోదరుడైన పి.గణేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత మహిళ అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి గురువారం వచ్చి ఫిర్యాదు చేసింది. దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావులతో కలిసి బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీ లతా మాధురికి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. చదవండి: సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసు స్టేషన్లో నిందితుడు గణేష్‌పై దిశ కేసు నమోదైందని రాజామణి తెలిపారు. అయిన్పటికీ రాజోలు పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఏఎస్పీకి వివరించారు. నిందితుడిపైనా... కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తాము ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రాజామణి, శ్రీనివాసరావు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి.. యువతిపై అత్యాచారం
చెన్నై : తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను కూడా చితకబాదారు. వెల్లూరు కోట సమీపంలో శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, వస్తువులను తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు. కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2018లో భారత్‌లో 34 వేల అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. అలాగే 2018లో సరాసరిన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకుందని కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. -
అత్యాచార కేసుల్లో 48 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తరచూ మహిళలు, చిన్న పిల్లలపై చోటుచేసుకుంటున్న అత్యాచార, హత్యా ఘటనలు ఓవైపు కలవరపెడుతుండగా.. వాటన్నింటిపై తక్షణ చర్యలు తీసుకుని బాధితుల పక్షాన నిలవాల్సిన శాసన కర్తలే నిందితులైతే వారి గోడు వినే వారెవ్వరు... చట్టాలు చేసి మృగాళ్ల పీచమణిచే దిక్కెవ్వరు..! దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహిళలపై అత్యాచార, హత్యా ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది. అత్యాచార ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 11 మందితో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ చెరో 5 మందితో తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా, 7గురు శివసేన , 6గురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత అయిదేళ్ల కాలంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 327 మందికి ప్రముఖ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్లు ఇచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తం సభ్యుల్లో 40 మంది లోక్‌సభ, రాజ్యసభలకు, మిగతా 287 మంది రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్ పొందారని పేర్కొంది. మరో 118 మంది స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేశారని తన రిపోర్టులో వెల్లడించింది. వీరిలో 18 మంది పార్లమెంటుకు, మిగతా 100 మంది అసెంబ్లీలకు పోటీ పడ్డారని బయటపెట్టింది. ఎన్నికల్లో టికెట్లు పొందిన ఈ మొత్తం నేతల్లో అత్యధికంగా 65 మంది మహారాష్ట్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేయగా.. బిహార్ నుంచి 62 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 52 మంది పోటీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 327 మందిలో బీజేపీ 47 మంది అభ్యర్థులకి టికెట్ ఇచ్చి మొదటి స్థానంలో నిలవగా, బీఎస్పీ 35 మందికి, కాంగ్రెస్ 24 మందికి టికెట్లు కేటాయించి తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. -
భర్త కళ్లెదుటే మహిళపై..
బీడ్: భర్త ఎదుటే మహిళపై దాడి చేసి, నగ్నంగా ఊరేగించిన అనాగరిక ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. బీడ్ జిల్లా వర్న్గాల్వాది గ్రామంలో శుక్రవారం ఈ దారుణోదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి టీనేజీ బాలికతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల కుటుంబానికి చెందిన మహిళతో సంబంధం పెట్టుకోవడానికి సోదరుడికి సహాయం చేసిందన్న అక్కసుతో బాధితురాలిపై ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 2న బాధితురాలిపై భర్త ఎదుటే నిందితులు దాడి చేశారు. వారినిద్దరూ క్షమించమని వేడుకోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. ఆగస్టు 4న ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై మరోసారి దాడికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా ఆమె దుస్తులు చించేసి, చెప్పులతో కొడుతూ గ్రామంలో నగ్నంగా ఊరేగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిరాయ్ తాలుకాలోని ఛక్లాంబా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. టీనేజీ బాలికను జువనైల్ కస్టడీకి తరలించినట్టు బీడ్ ఎస్పీ తెలిపారు. నిందితులు మారుతి సత్లే, బాబన్ సత్లే, అంగద్ ఇంగోల్, కుంతా ఇంగోల్, లంకా సత్లే, రేఖ ఇంగోల్, జాంబర్ దంతల్గా గుర్తించారు. -
ఆ మహిళ టీవీ స్టార్లా ప్రవర్తించింది
ఇటుకతో దాడి వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్య ఆమె ఒక్కో చానల్లో ఒక్కోలా మాట్లాడారు ఆగస్టు 5లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఢిల్లీ సర్కారు, పోలీసులకు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో సోమవారం ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపైకి ఇటుక విసిరిన వ్యవహారంలో ఆ మహిళ టీవీ స్టార్ వలె ప్రవర్తించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాడికి గురైన మహిళ ఒక్కో టీవీ చానెల్లో ఒక్కో విధంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. మహిళపై హెడ్ కానిస్టేబుల్ దాడి కేసును ఢిల్లీ హైకోర్టు బుధవారం తనంతట తానుగా విచారణకు స్వీకరించింది. నగరంలో పెరుగుతున్న రోడ్‌రేజ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం ప్రజలు కూడా తమ బాధ్యతను అర్థం చేసుకొని, వాటిని నెరవేర్చాలని అభిప్రాయపడింది. ఈ కేసుపై ఆగస్టు 5 లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఢిల్లీ సర్కారును, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన హెడ్ కానిస్టేబుల్‌ను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించారు. అతను ప్రస్తుతం 14 రోజుల న్యాయ నిర్భంధంలో ఉన్నాడు. ప్రచారంలోకి మరో ఆడియో రికార్డింగ్: ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి గతంలో ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో రికార్డింగుకు తోడుగా ఇప్పుడో ఆడియో రికార్డింగ్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో రికార్డింగులో మహిళ పోలీసు కానిస్టేబుల్‌ను దుర్భాషలాడడం, లెసైన్స్ చూపించడానికి నిరాకరించడం, చలాన్ రుసుమును కానిస్టేబుల్ చేతికి ఇవ్వబోనని, పోలీసు కానిస్టేబుల్ మహిళను కోర్టు చలాన్ విధిస్తానని చెప్పడం, చిన్న పిల్ల ఏడుపు మొదలైనవి రికార్డయ్యాయి. ఈ రికార్డింగు మహిళ గతంలో చెప్పిన మాటలకు కొంత భిన్నంగా ఉండడంతో మహిళ ఆరోపణలపై అనుమానాలు తలెత్తాయి. ఆడియో క్లిప్‌లో రూ. 200 లంచం అడిగినట్లు వినిపించలేదు. కానీ ఇది లంచం అడిగిన తరువాత చేసిన రికార్డింగ్ అని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.