
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్‌గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.
Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8
— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025

జరిగింది ఇదీ..
పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్‌లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.
బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment