virus outbreak
-
మరోసారి కరోనా పంజా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 సృష్టించిన విలయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు. వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు. ఇది నిజంగ ఆందోళకరమైన పరిణామమేనని పేర్కొన్నారు. -
చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు: భారత ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉంది. చైనాలో నమోదవుతున్న శ్వాససంబంధ కేసులన్నీ సాధారణమైనవేనని, వాటికి పెద్ద ప్రత్యేకత లేదని తెలిపింది. అయినా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చెప్పిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంతేగాక ఈ వైరస్ సోకిన వారిలో ఫ్యాటలిటీ రేటు(మరణాల రేటు) తక్కువగా ఉందని వెల్లడించింది. గతంలో చైనా నుంచే పుట్టుకొచ్చిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దీంతో చైనీయుల్లో ఎలాంటి వైరస్ కారక వ్యాధుల కేసులు నమోదైనా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులపై భారత ఆరోగ్య శాఖ స్పందించింది. ఇటీవల కోయంబత్తూరులో వెలుగు చూసిన వైరస్ కేసులు కూడా కరోనా కేసులు కాదనే విషయం స్పష్టమైంది. ఇదీచదవండి.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా... -
కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా
పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్ మేకర సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్లో పేర్కొన్నారు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా. The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA. — Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022 కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్‌నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. ఇదీ చదవండి: కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం -
షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!
బీజింగ్: కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్కడ రోజులు కాదు గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. చదవండి: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు.. -
కేరళలో ‘మీజిల్స్’ పంజా.. 160 మంది చిన్నారులకు వైరస్
తిరువనంతపురం: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు కాగా.. తాజాగా కేరళలోనూ భారీగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోందని తెలిపింది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. మరోవైపు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్. అయితే, తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ‘మలప్పురమ్‌లో మీజిల్స్ వైరస్‌ను గుర్తించిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో జయపురపైనా సమీక్షించాం. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాం.’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇదీ చదవండి: మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి -
టెన్షన్ పెడుతున్న ప్రాణాంతక వైరస్ లంపీ.. కీలక హామీ ఇచ్చిన మోదీ
గ్రేటర్ నోయిడా(యూపీ): పశుసంపదను బలితీసుకుంటున్న లంపీ చర్మ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రబలే లంపీ వ్యాధి పశువుల్లో తీవ్రమైన జ్వరం, చర్మంపై గడ్డలు ఏర్పడి తుదకు ప్రాణాలను హరిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ వ్యాధికారణంగా గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాసహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాడి ఆవులు, పశువులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. సోమవారం గ్రేటర్ నోయిడాలో ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్‌ను ప్రారంభించి మోదీ ప్రసంగించారు. ‘ రైతులకు, వారి ఆదాయానికి, పాల ఉత్పత్తికి విఘాతంగా మారిన లంపీ వ్యాధి వ్యాప్తి నిరోధానికి దేశీయంగా వ్యాక్సిన్ అందుబాటులోనే ఉంది. మూడేళ్లలో దేశంలోని అన్ని పశువులకు కాళ్లు, నోటి సంబంధ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం’ అని మోదీ అన్నారు. ‘‘పశు ఆధార్ పేరిట ప్రతీ పాడిజంతువుకు బయోమెట్రిక్ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాడి పరిశ్రమ విస్తరణతోపాటు సంతులిత పాడి ఆర్థికవ్యవస్థ సాధ్యమవుతుంది. గోవర్థన్ యోజనతో వ్యవసాయ, డెయిరీ రంగంలో కొత్తగా వేయికిపైగా అంకుల సంస్థలు పురుడుపోసుకున్నాయి. మహిళల భాగస్వామ్యం వల్లే డెయిరీ సెక్టార్ వృద్ధిబాటలో పయనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే 44 శాతం వృద్ధితో పాల ఉత్పత్తి నేడు 21 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటు (2 శాతం)తో పోలిస్తే భారత్‌లో పాల ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 6 శాతానికి పెరిగింది. చిన్న రైతుల వల్లే ఇది సాధ్యమైంది’’ అని మోదీ అన్నారు. -
ఢిల్లీని వణికిస్తున్న మంకీపాక్స్.. 24ఏళ్ల మహిళకు పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశ రాజధానిలో ఈ వ్యాధి బాధితుల సంఖ్య 7కు పెరిగింది. నైజీరియాకు చెందిన 24 ఏళ్ల మహిళ నాలుగు నెలలుగా ఢిల్లీలోని శారదా విహార్‌లో ఉంటోంది. ఇటీవలే జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. వెంటనే బాధితురాలితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఇప్పటివరకు మొత్తం ఏడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురు పురుషులు కాగా.. నలుగురు మహిళలు. ఏడుగురిలో ఆరుగురు నైజీరియాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒక్కరు మాత్రమే ఢిల్లీ వాసి. అయితే ఏడుగురు బాధితుల్లో ఐదుగురు ఇప్పటికే కోలుకున్నారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు ఐదు మంకీపాక్స్ కేసులు నమొదయ్యాయి. చదవండి: భారత్ జోడో యాత్రలో రాహుల్‌కు పెళ్లి ప్రపోజల్! -
అమెరికాలో మంకీపాక్స్ కలవరం.. 30 మంది చిన్నారులకు సోకిన వైరస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్‌లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? -
Monkeypox: మంకీపాక్స్ అనుమానిత వ్యక్తి మృతి!
తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులు నిర్ధారణ కాగా.. తొలిసారి వైరస్ సోకిన వ్యక్తి కోలుకున్నట్లు కేరళ వైద్య శాఖ ప్రకటించింది. అయితే.. కొన్ని గంటల్లోనే అదే రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే యూఏఈ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కోసం యువకుడి నమూనాలను అలప్పుజాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు అధికారులు. మృత దేహాన్ని కుటుంబానికి అప్పగించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించారు. ఆ యువకుడికి చికిత్స అందించిన వైద్యులు లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ‘ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి దద్దుర్లు, బొబ్బలు కనిపించలేదు. ఆ తర్వాత కనిపించటం గమనించాం. యూఏఈ నుంచి వచ్చిన వెంటనే ఆసుపత్రిలో చేరాడు.’ అని తెలిపారు. మూడు రోజుల క్రితం యూఏఈ నుంచి తిరిగివచ్చాడని, అప్పటి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత దద్దుర్లు రావటంతో మంకీపాక్స్‌గా అనుమానిస్తున్నట్లు చెప్పారు. అయితే.. పరీక్ష ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి ఆందోళన చెందవద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదీ చదవండి: రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ -
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. జీజీహెచ్‌లో చేరిన అనుమానిత కేసు
-
Monkeypox: గుంటూరులో మంకీపాక్స్ కలకలం!
గుంటూరు: గుంటూరులో అనుమానిత మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్ వైద్యులు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇదీ చదవండి: తల్లడిల్లిన మాతృ హృదయాలు -
దేశంలో విజృంభిస్తున్న మంకీపాక్స్.. మరో వ్యక్తిలో లక్షణాలు!
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ వైరస్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయి. మంకీపాక్స్ లక్షణాలతో బాధితుడు మంగళవారం సాయంత్రం.. ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ మాదిరిగానే చర్మంపై బొబ్బలు, తీవ్ర జ్వరం వంటివి కనిపించాయన్నారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని చెప్పారు. 34 ఏళ్ల బాధితుడు ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత జ్వరం, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. దేశంలో మొత్తం నాలుగు కేసులు రాగా.. కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. మూడు రోజుల క్రింత జులై 24న ఢిల్లో తొలి కేసు నమోదైంది. ఆ వ్యక్తి సైతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. వైద్యులకు శిక్షణ ప్రారంభించింది. రాష్ట్రాలు అప్రమత్తం.. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాయి. మంకీపాక్స్ కేసులు బయటపడిన దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ ను జులై 23న అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్‌కు పాక్ మహిళల ‘హనీట్రాప్’.. సైనిక రహస్యాలు లీక్! -
దేశంలో మంకీపాక్స్ కలవరం.. మరో అనుమానిత కేసు నమోదు!
లక్నో: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన ఓ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. నమూనాలు సేకరించి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపించారు. అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అనుమానిత మంకీపాక్స్ కేసు బయటపడిన క్రమంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అన్ని ఆసుపత్రులు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మంకీపాక్స్‌పై నిఘా పెంచాలని అధికారులకు సూచించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళలోనే వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. కేరళ, ఢిల్లీలలో కేసులు వచ్చిన క్రమంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల గుండా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలపై జులై 18న కీలక సూచనలు చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Toxic Liquor: కల్తీ మద్యం తాగి 21 మంది కూలీలు మృతి -
Marburg virus: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్!
అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్' వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 'సెనెగల్‌లోని ఇన్స్టిట్యూట్ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం.. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్ వైరస్ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్ వైరస్ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్ అశాంతి నగర్‌కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం -
యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి ‘మంకీపాక్స్’.. దేశంలోనే తొలి కేసు!
తిరువనంతపురం: ఇప్పటికే కరోనా మహమ్మారితో రెండేళ్లకుపైగా ఇబ్బందులు పడుతున్నాం. తాజాగా మరో మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. కేరళలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు. యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తిని కలిసిన క్రమంలో అనారోగ్యానికి గురికాగా.. ఆసుపత్రిలో చేరినట్లు వీణా జార్జ్ తెలిపారు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. ‘ఎలాంటి భయం అవసరం లేదు. మంకీపాక్స్‌కు వైద్యం ఉందని, వైరస్ సోకిన వ్యక్తితో కలిసిన వారికే వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వైరాలజీ ల్యాబ్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. బాధితుడు దేశంలోకి వచ్చాక ఎవరినీ కలవలేదు.’ అని తెలిపారు ఆరోగ్య మంత్రి. Following India's first case of Monkeypox in Kollam, Kerala, Union Health Ministry to deploy a multi-disciplinary Central team to support the Kerala govt in probing the outbreak and instituting requisite health measures https://t.co/AhCcCBImx4 pic.twitter.com/E6Ia4uaRbp — ANI (@ANI) July 14, 2022 మరోవైపు.. స్థానిక ల్యాబ్‌లో పరీక్షించగా బాధితుడికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే.. మరోమారు నిర్ధారించుకునేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు పంపించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు. అయితే.. వ్యాధి లక్షణాలు బయటపడ్డాకే ఇతరులకు వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. జ్వరం, తలనొప్పి, ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుందన్నారు. వైరస్ సోకిన 5 నుంచి 21 రోజుల్లో బయపడుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదీ చూడండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్‌లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
తిరువనసంతపురం: కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైరస్ సోకినట్లు పేర్కొంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందనవసరం లేదు విజింజంలోని ఎల్ఎంఎస్ఎల్పీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం నోరోవైరస్ అంటే నోరోవైరస్ అనేది అంటువ్యాది. ఇది తీసుకున్న ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు. నోరో వైరస్ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి జాత్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ముందుగా అప్పుడే నవంబర్ 2021లో కేరళలో మొదటిసారిగా నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు. తాజాగా మరోసారి కేసులు వెలుగుచూశాయి. -
మరో కొత్త వైరస్ కలకలం.. 19 మంది మృతి
కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్‌లోనే వెలుగు చూసింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం -
Monkeypox: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు
మంకీపాక్స్ వైరస్ ముప్పు భారత్‌కూ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. ఇప్పటికే ముంబైలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది రెండు వారాల వ్యవధిలో 14 దేశాలకు విస్తరించడం అసాధారణమైన వ్యవహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ అలర్ట్ అయ్యింది. తమిళనాడులో హైఅలెర్ట్ మంకీపాక్స్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలకు అనుగుణంగా.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ అనుమానిత కేసుల్ని గుర్తిస్తే.. వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి తగు చికిత్స అందించాలని తెలిపింది. గత 21 రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్యంపై నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది తమిళనాడు సర్కార్. మంకీపాక్స్ అంటే.. స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది. లక్షణాలివే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?: తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా సోకుతుంది. చికిత్స ఎలా.. ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్‌తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! -
Monkeypox: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ
ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు యూరప్, యూకే, నార్త్ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ.. అది వ్యాపించడానికి గల కారణాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు వైద్య సంస్థలు ఒక స్పష్టమైన ప్రకటన చేశాయి. ► ఫ్లూ(జ్వరం) తరహా లక్షణాలు ఉండే మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోనూ డజన్ల కొద్దీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వ్యాప్తి చెందినవే కావడం గమనార్హం. ► కెనడాలో డజను, స్పెయిన్.. పోర్చుగల్‌లో 40(అనుమానిత.. ధృవీకరణ కేసులు), బ్రిటన్‌లో తొమ్మిది(మే 6వ తేదీ నుంచి ఇప్పటిదాకా..), అమెరికాలో బుధవారం తొలి మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ► శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు వైరస్ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమయ్యింది. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. గే, బైసెక్సువల్, పరస్పర పురుష శృంగారంలో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. యూకేలో వెలుగు చూసిన మొదటి కేసు నైజీరియాతోనే ముడిపడి ఉండడం విశేషం. ► ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత వారం రోజులుగా యూకే, యూరోపియన్ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో చాలావరకు గే, బైసెక్సువల్‌గా గుర్తించినట్లు తెలిపింది. ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోసే ఫాల్ వెల్లడించారు. ► మంకీపాక్స్ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణాల మీదకు వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లోనే. పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. ఇంతకు ముందు.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో వేలమంది మంకీపాక్స్ బారినపడ్డారు. కానీ, యూరప్, నార్త్ అమెరికాలో కేసులు వెలుగు చూడడం అరుదనే చెప్పాలి. ► మంకీపాక్స్.. జ్వరం తరహా లక్షణాలతో మొదలవుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. మంకీపాక్స్ వైరస్‌ను మనీపాక్స్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ► ఉచ్ఛ్వాస పెద్ద బిందువుల(తుంపర్ల) ద్వారా, శరీరంపై గాయాలు, కలుషితమైన పదార్థాలతో.. చాలాసందర్భాల్లో వ్యాపిస్తుంది. జంతువులు, మనుషులు, వైరస్ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుంది. జంతువుల ద్వారా కాటు, కొరికిన గాయాలు, కరవడం.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ► అయితే యూరప్, నార్త్ అమెరికాతో పాటు యూకేలో వెలుగు చూస్తున్న కేసుల్లో.. వైరస్ బారినపడ్డ వాళ్లు ఇతరులతో అత్యంత సన్నిహితంగా(శారీరక సంబంధం) మెలగడం వల్లే వైరస్ విజృంభించడం గమనించాల్సిన విషయం. ► మంకీపాక్స్ తొలి కేసు 1950లో.. రెండు దఫాల అవుట్‌బ్రేక్‌లు(వేవ్)లుగా విజృంభించింది. ► పరిశోధనల నిమిత్తిం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో గుర్తించారు. అయితే మనుషుల్లో గుర్తించింది మాత్రం 1970లో. అది కాంగోలో. ► ఆఫ్రికా ఖండంలో బయటపడ్డ వేల కేసుల్లో.. చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించింది. శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువే. ► స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్నే చాలాకాలంగా మంకీపాక్స్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, అది అథెంటిక్‌గా ప్రూవ్ కాలేదు. ► సాధారణ జ్వరానికి ఉపయోగించే చికిత్సతో పాటు యాంటీ వైరల్స్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లూబ్లిన్ను కూడా మంకీపాక్స్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు. ► ఈ వైరస్ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ► ప్రస్తుతం బయటపడ్డ కేసుల వెనుక అరుదైన మంకీపాక్స్ వైరస్ ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వైరస్ కట్టడికి తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
2080లో కరోనావైరస్ కంటే మరో తీవ్రమైన వైరస్ !
కరోనా లాంటి మరో మహమ్మారి రాబోతోందా? మళ్లీ ఎన్నేళ్లకి ప్రపంచ దేశాలపై ఇలాంటి వైరస్ కొమ్ములు విసురుతుంది ? పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టించే కోవిడ్–19లాంటి వ్యాధులు వందేళ్లకి ఒకసారి వస్తాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ ఆ అంచనాలన్నీ తప్పయ్యే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. మరో 60 ఏళ్లలోనే ఇలాంటి మహమ్మారి ప్రజల్ని కాటేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో అత్యంత అరుదుగా సంభవించే ఇలాంటి వైరస్లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకు ఒక్కసారి కాదని , వచ్చే 60 ఏళ్లలో.. అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని హెచ్చరించారు. ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనం ఎలా చేశారు ?: ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్ మార్కో మరాని, ఆయన బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు. 400 ఏళ్లలో చికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా భవిష్యత్‌లో వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు. ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా, టైఫస్, స్పానిష్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడు వచ్చాయి ? ఎన్నేళ్లు మానవజాతిని పీడించాయి ? ఎంత తరచుగా ఇలాంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది ? వంటి వివరాలన్నీ సేకరించి దాని ఆధారంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పుపై అంచనాలు వేసినట్టుగా మార్కో మరాని వెల్లడించారు. సర్వసన్నద్ధంగా ఉండాలి ! భవిష్యత్‌లో పుట్టుకొచ్చే వైరస్‌లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని అధ్యయనం రచయిత డాక్టర్ మార్కో మరాని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో.. వందేళ్లలో ఇలాంటి వరదలు చూశామని ఎవరైనా వ్యాఖ్యానిస్తే మళ్లీ అంతటి ఉధృతిలో వరద రావడానికి మరో 100 సంవత్సరాలు వేచి చూడాలని అర్థం కాదని ఇక అధ్యయనం సహ రచయిత అయిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త గార్బియల్ కాటుల్ అభిప్రాయపడ్డారు. వందేళ్ల లోపులో ఎప్పుడైనా అంటే వచ్చే సంవత్సరమైనా అలాంటి వరద ముంచెత్తుతుందని అన్వయించుకోవాలన్నారు. తరచూ ఎందుకు వైరస్లు పంజా విసురుతున్నాయో తెలుసుకోవడానికే ఈ గణాంకాలను సేకరించి అధ్యయనం చేశామని ఆయన వివరించారు. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ప్రపంచ దేశాలపై కోవిడ్–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉంది అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్లు బయల్పడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్ ఉంది. 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి వ్యా«ధుల ముప్పు అధికం కావడానికి జనాభా పెరుగుదల, ఆహార విధానంలో మార్పులు, పర్యావరణం ధ్వంసం, వ్యాధి కారక జంతువులతో మనుషులు కలిసిమెలిసి తిరగడం వంటి కారణాలెన్నో ఉన్నాయి. -
వైరస్ల దాడి కరోనాతో ఆగదా.. ఇంకా వస్తాయా?
కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తూనే ఉంది. మరి దీనికి అంతమెప్పుడు? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్ దాడి మొదలవుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు వస్తున్నాయి కదా. దీనిపై ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ (ఐపీబీఈఎస్)’ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా.. జంతువులు, పక్షుల నుంచే.. మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వ్యాధుల్లో చాలా వరకు జంతువులు, పక్షుల నుంచి వ్యాపిస్తున్నవే. అంటే ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి, వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు.. మ్యుటేషన్ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. 1940 దశాబ్దం నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే. ఏటా మరిన్ని కొత్త వ్యాధులు జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. సగటున 3, 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. మహమ్మారులుగా మారేవి అవే.. ఇన్ఫ్లుయెంజా, సార్స్, ఇప్పటి కోవిడ్ సహా మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న వ్యాధులు మొత్తం కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచో, పెంపుడు జంతువుల నుంచో మనుషులకు విస్తరించినవే. 1. మంకీపాక్స్ ఎబోలా లైమ్ డిసీజ్ సార్స్ హంటా వైరస్ 2. ఆంథ్రాక్స్ వెస్ట్ నైల్ వైరస్ ప్లేగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా రేబిస్ బ్రూసెల్లోసిస్ ట్యూబర్క్యులోసిస్ సాల్మనెల్లోసిస్ ట్యులరెమియా 3. కౌపాక్స్ బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలోపతి రిఫ్ట్వ్యాలీ ఫీవర్ ఈ కొలి ఇంకా గుర్తించని వైరస్లు లక్షల్లోనే.. జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లలో మనం ఇంకా గుర్తించని వాటి సంఖ్య 17 లక్షలకుపైనే అని ఒక అంచనా. అందులో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఊ నిజానికి భూమ్మీద కొన్నికోట్ల రకాల వైరస్లు ఉన్నాయని.. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగినవి చాలా తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్లే.. వైరస్లు ఇప్పుడిప్పుడు కొత్తగా పుడుతున్నవేమీ కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. పరిస్థితులకు అనుగుణంగా రూపుమార్చుకుంటున్నవే. మరి ఇప్పుడు కొత్తగా ప్రభావం చూపించడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ప్రకృతి సమతౌల్యాన్ని మనుషులు దెబ్బతీయడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవులను నరికివేయడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులు, వన్యప్రాణులు జనావాసాలకు దగ్గర కావడం, వాటి మాంసం వినియోగం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►దాదాపు వందేళ్ల కిందటితో పోలిస్తే.. ప్రస్తుతం 30 శాతం అడవులు తగ్గిపోయాయి. ఆ భూమిలో వ్యవసాయం, పట్టణీకరణ పెరిగింది. ►2050 నాటికి 247 కోట్ల ఎకరాల అడవులు అంతరిస్తాయని ఒక అంచనా. ►ప్రపంచవ్యాప్తం గా అడవి జంతువుల్లో 24 శాతం వరకు స్మగ్లింగ్ బారినపడుతున్నాయి. దీని విలువ సగటున ఏటా 17 వేల కోట్ల రూపాయలకుపైనే అని అంచనా. ఊహించ లేనంత నష్టం ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తూ మనుషులు సంపాదిస్తున్న దానికంటే కోల్పోతున్నదే ఎక్కువని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వివిధ రూపాల్లో జరుగుతున్న నష్టం ఊహించలేమని పేర్కొంటున్నారు. ►వివిధ మహమ్మారుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆర్థికంగా జరుగుతున్న నష్టం ఏడున్నర లక్షలకు కోట్ల మేర ఉంటుందని అంచనా. ►అదే కరోనా కారణంగా తొలి ఏడాదిలో జరిగిన నష్టం ఏకంగా 60 లక్షల కోట్ల నుంచి కోటి కోట్లదాకా ఉంటుందని చెబుతున్నారు. మరి ఇప్పుడేం చేయాలి? ప్రకృతితో కలిసి జీవించడమే మనిషి ఇప్పుడు చేయాల్సిన పని అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొత్తగా మహమ్మారులు వచ్చాక వాటిని నియంత్రించేందుకు కష్టపడటం కంటే.. అసలు అలాంటి భయంకర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడటమే మేలు అని స్పష్టం చేస్తున్నారు. అడవులను నరికివేయడం ఆపాలని, వీలైతే కొత్తగా అడవులు పెంచాలని.. వన్యప్రాణుల వేట, వ్యాపారాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. ►జంతువులు, పక్షుల నుంచి వైరస్లు మనుషులకు వ్యాపించే అవకాశాలను ముందుగానే గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని.. ఒకవేళ సోకినా వెంటనే గుర్తించి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. -
చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్
బీజింగ్: మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ జన్మస్థానానికి కేంద్రంగా భావిస్తోన్న చైనాలో ఇప్పుడు మరో ప్రమాదకర వైరస్ వెలుగు చూసింది. ఎస్ఎఫ్టీఎస్ (సివియర్ ఫీవర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) వైరస్‌గా పిలుస్తోన్న దీని వల్ల ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది దీని బారిన పడ్డారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ బుధవారం కథనాన్ని వెలువరించింది. ముఖ్యంగా ఈ మాయదారి వైరస్ మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో 37 కేసులు నమోదవగా గత నెలలో ఒక్క అన్హూయ్ ప్రావిన్స్‌లోనే 23 కేసులు వెలుగు చూడటం గమనార్హం. (కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?) అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదు. 2010లో తొలిసారిగా చైనాలో ఇది ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత జపాన్, కొరియాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. మరణాల రేటు 10-16 శాతంగా ఉంది. పదేళ్ల తర్వాత ఈ ఎస్ఎఫ్టీఎస్ వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. నల్లి(టిక్) వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మనిషి రక్తం, శ్లేషం ద్వారా కూడా ఇది సంక్రమిస్తుందని ఝెజియాంగ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు. అలాగే మనుషుల నుంచి మనుషులకు వ్యాపించేందుకు కూడా ఆస్కారం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నంత కాలం దీని గురించి పెద్దగా భయపడనవసరం లేదని వైద్యులు అంటున్నారు. (ప్రతి 15 సెకన్లకు ఓ ప్రాణం పోతుంది) -
170కు చేరిన కరోనా మృతులు..
బీజింగ్ : చైనాను వణికిస్తున్న డెడ్లీ వైరస్ కరోనాతో ఇప్పటి వరకూ 170 మంది మరణించారు. 6000 కరోనా కేసులను ఇప్పటివరకూ నిర్ధారించినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో కలకలం రేగడంతో చైనా నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ సహా పలు ఎయిర్లైన్లు చైనా నుంచి విమాన రాకపోకలను రద్దుచేశాయి. కరోనా వైరస్ బయటపడిన వుహన్ నగరం నుంచి తమ పౌరులను ఆయా దేశాలు వెనక్కిరప్పిస్తున్నాయి. వుహన్ నగరం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు చైనాలో భారత్ రాయబార కార్యాలయం సన్నాహాలు చేపట్టింది. అమెరికా, జపాన్, బ్రిటన్లు ఇప్పటికే తమ పౌరులను స్వదేశాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపగా, యూరప్, జర్మనీ, మంగోలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ర్టేలియాలూ విమానాలను పంపుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. మరోవైపు భారత్‌లోనూ కేరళ, గుజరాత్, ఢిల్లీలోనూ పలు కేసులను గుర్తించినా ఏ ఒక్క కేసూ పాజిటివ్‌గా నమోదు కాలేదు. అనుమానిత రోగుల శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్ట్స్, ఆస్పత్రుల్లో ఏర్పాట్లను వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. చదవండి : ఏపీలో ‘కరోనా’ జాడ లేదు: ఆళ్ల నాని -
చైనాకు వెళ్లకండి..
ఢిల్లీ: చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. చైనాలో ఈ వైరస్ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్ చెప్పారు. ఇవీ జాగ్రత్తలు.. ఈ వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.