సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని కోజికోడ్‌లో ఈనెల 19న నిపా వైరస్‌తో ముగ్గురు మరణించడంతో వెలుగుచూసిన ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఇప్పటివరకూ నిపా వైరస్‌తో 15 మంది మరణించారని, ఈ వైరస్ లక్షణాలతో 753 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు వెల్లడించాయి. ఈనెల 28 వరకూ కోజికోడ్, మలప్పురం జిల్లాలో 15 మంది నిపా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు తెలిపింది. 16 అనుమానిత కేసులను గుర్తించారని, వైద్య సిబ్బంది సహా నిపా లక్షణాలున్న 753 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వీరికి మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరస్ రీసెర్చి, పూణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో లేబరేటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది.
కేరళలో ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం తగిన సహకారం అందిస్తోందని ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు.
తొలి వైద్యనివేదిక అందిన ఐదు గంటల్లోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్‌ల నుంచి వైద్య బృందాలను పంపామని తెలిపారు. కేరళలో తొలిసారిగా నిపా వైరస్ వెలుగు చూసిందని, భారత్‌లో దీని జాడలు బయటపడటం ఇది మూడవసారి కావడం గమనార్హం. 2007లోనూ భారత్‌లో నిపా కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment