W H O
-
నిపా కలకలం : వైద్యుల పర్యవేక్షణలో 753 మంది..
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని కోజికోడ్‌లో ఈనెల 19న నిపా వైరస్‌తో ముగ్గురు మరణించడంతో వెలుగుచూసిన ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఇప్పటివరకూ నిపా వైరస్‌తో 15 మంది మరణించారని, ఈ వైరస్ లక్షణాలతో 753 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడించాయి. ఈనెల 28 వరకూ కోజికోడ్, మలప్పురం జిల్లాలో 15 మంది నిపా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు తెలిపింది. 16 అనుమానిత కేసులను గుర్తించారని, వైద్య సిబ్బంది సహా నిపా లక్షణాలున్న 753 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వీరికి మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరస్ రీసెర్చి, పూణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో లేబరేటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. కేరళలో ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం తగిన సహకారం అందిస్తోందని ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. తొలి వైద్యనివేదిక అందిన ఐదు గంటల్లోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్‌ల నుంచి వైద్య బృందాలను పంపామని తెలిపారు. కేరళలో తొలిసారిగా నిపా వైరస్ వెలుగు చూసిందని, భారత్‌లో దీని జాడలు బయటపడటం ఇది మూడవసారి కావడం గమనార్హం. 2007లోనూ భారత్‌లో నిపా కలకలం సృష్టించింది. -
‘కల్యాణలక్ష్మి’ అక్రమార్కులపై కొరడా
► ఏడుగురు నిందితులకు రిమాండ్ ► పరారీలో కార్యదర్శి, హెచ్‌డబ్ల్యూఓ అమ్రాబాద్ : కల్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై మూడు కేసులు నమోదు కాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను బుధవారం ఇక్కడ ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. అమ్రాబాద్ మండలంలోని ఈదులబావికి చెందిన రామానుజమ్మ, అన్న ఆంజనేయులు, ఎమిరెడ్డిపల్లికి చెందిన ఎనుపోతుల శ్రీదేవి, భర్త మన్నెం వెంకటయ్య, కుమార్ (శ్రీదేవి అన్న), తిర్మలాపూర్ (బీకే) కు చెందిన పెర్ముల అరుణమ్మ, భర్త చక్రపాణిలపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వీరందరినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాస్తవానికి రామనుజమ్మకు 2009లో కుమ్మరోనిపల్లి వాసి చంద్రయ్యతో వివాహం కాగా 2014 అక్టోబర్ 26న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కల్యాణలక్ష్మి కింద లబ్ధి పొందారు. శ్రీదేవికి ఎనిదేళ్లక్రితమై వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా 2015 ఫిబ్రవరి 22న జరిగినట్టు చూపించారు. అరుణమ్మకు మూడేళ్ల క్రితమే పెళ్లికాగా 2014 నవంబర్ 3న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక్కొక్కరు ఈ పథకానికి సంబంధించి రూ.51 వేలు తీసుకున్నట్లు తేలింది. ఈ ధ్రువపత్రాలన్నీ అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులోని వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్పిడి చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో దళారీలతో అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల సమాచారం అందింది. దీనిపై ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తాజాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో నిందితులైన అమ్రాబాద్ గ్రామ కార్యదర్శి అంజనేయులు, విచారణ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ) హన్మంత్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.