Monkeypox Virus Cases In US: Over 30 Children Test Positive For Monkeypox - Sakshi
Sakshi News home page

అమెరికాలో మంకీపాక్స్ డేంజర్ బెల్స్‌.. 30 మంది చిన్నారులకు పాజిటివ్‌.. 18,417కు చేరిన బాధితులు

Published Fri, Sep 2 2022 11:36 AM | Last Updated on Fri, Sep 2 2022 12:45 PM

Over 30 Children Test Positive For Monkeypox In US - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి.

ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్‌లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది.

అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి.
చదవండి: కరోనా, మంకీపాక్స్‌ రెండూ ఒకే రకమైన వైరస్‌లా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement